శంకరపట్నం నేటిధాత్రి
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం, కన్నాపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో, శుక్రవారం రోజున గ్రామ సర్పంచ్ కాటం వెంకటరమణారెడ్డి మరియు గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో,కాలోజీ నారాయణరావు జయంతిని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ,కాలోజీ నారాయణరావు గారు ప్రజాకవిగా, మరియు తెలంగాణ ఉద్యమకారుడుగా, మనకు సుపరిచితుడు. ఆయన తన కలంతో సమాజ శ్రేయస్సు కోసం కవిత్వం రాసిన మహాకవి. అంతేకాకుండా, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన కలము నెత్తి సమాజానికి మంచి సందేశాన్నిచ్చిన మహాకవి కాళోజి గారు. ఈయన స్వతంత్ర సమరయోధుడు కూడా,కావున తెలంగాణ ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవం గా చేసి ఆయనను గౌరవించింది. అంతేకాకుండా వరంగల్ లోని వైద్య కళాశాలకు ఆయన పేరు పెట్టినది.అంత గొప్ప మహనీయుడు కాళోజి గారు ఆయన కు భారత దేశంలో అత్యున్నత పురస్కారం అయిన పద్మ విభూషణ్ పొందినాడు.ఇంతటి మహనీయుడు కాళోజీ నారాయణరావు గారి జయంతిని, రాష్ట్ర పండుగగా గుర్తించినారని ఈ సందర్భంగా తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మోతే భాగ్యలక్ష్మి- ఎల్లారెడ్డి, కార్యదర్శి పరశురాములు,మాది హక్కుల దండోరా వర్కింగ్ ప్రెసిడెంట్ క్యా దాసి భాస్కర్, వార్డు సభ్యులు సమ్మయ్య, కరోబార్ సమ్మయ్య, మరియు పోశయ్య, మల్లారెడ్డి, గ్రామపంచాయతీ పాలకవర్గ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.