నిర్వహించిన ప్రజాసంఘాల నాయకులు.
మహా ముత్తారం నేటి ధాత్రి.
మహా ముత్తారం మండలము యామనపల్లి గ్రామంలో తుడుం దెబ్బ. నాయకపోడు సేవా సమితి. ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం పురస్కరించుకొని కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జరిగిన సమావేశంలో ప్రజా సంఘాల నాయకుడు పీక కిరణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర గణాంకాల ప్రకారం భారత్లో 1.17 లక్షల గిరిజన గ్రామాలున్నాయి. ఇందులో.. 22 వేల ప్రాంతాలకు ఎలాంటి రహదారులూ లేవు. 30 వేల గ్రామాలకు రవాణా వ్యవస్థ లేదు. 3 వేలకు పైగా ప్రాంతాల్లో పాఠశాలలు లేవు. 38 వేల గిరిజన గ్రామాల్లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కనిపించవు. ఇలాంటి వాటన్నింటిలో మౌలిక వసతులు కల్పించాలి. గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలలో ఖనిజ తవ్వకాలు, అబివృద్ధి ప్రాజెక్టుల విషయంలో పాలకులు దుందుడుగా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా గిరిజనులు సేకరించే ఔషధ మూలికలు, అటవీ ఫలసాయాల మార్కెట్ విలువ సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వాటి ద్వారా ఆదివాసులు పొందే ఆదాయం స్వల్పం. గిరిజన సహకార మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేసి, విలువ ఆధారిత పరిశ్రమలను అధిక సంఖ్యల్లో నెలకొల్పాలి. తద్వారా ఆదివాసులకు ఉపాధి కల్పన, వారికి ఆర్ధిక సాధికారత సాధ్యమవుతాయి. అటవీ హక్కుల గుర్తింపు, పెసా వంటి చట్టాలనూ సమర్ధంగా అమలు చేయాలి. ఈ తరుణంలో గిరిజనుల స్వయంపాలన, విద్యా, ఆర్థిక సాధికారత సాధనకు పాలకులు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరింత చిత్తశుద్ధితో కృషి చేయాలి పీక కిరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గొరిగ కిరణ్ నాయకపోడు సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెల్లంకొండ పోచయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కండల రామచంద్రం బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాలవచర్ల రాజు బి.ఎస్.పి మండల అధ్యక్షుడు రామగిరి రాజయ్య మాల మహానాడు మండల అధ్యక్షుడు బొబ్బిలి రాజయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.