గ్రామాల అభివృద్దే బిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం

*అన్ని కులాలకు పెద్ద పీట

*జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణరాఘవ రెడ్డి

బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి అన్నారు.

కొనరావుపేట, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగలపల్లి గ్రామంలో రూ.20 లక్షల తో నూతన గ్రామపంచాయితీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.
అనంతరం కొనరావు పెట్ గ్రామంలో జెడ్పీ నిధుల నుండి రూపాయలు మూడు లక్షలు రజక సంఘ భవన మిగుల పనికి జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల కంటె బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని అన్నారు. తండలలో ప్రజలు స్వయం పాలన చేసుకోవాలని తండలను గ్రామ పంచాయితీలుగా మన కెసిఆర్ మార్చారు. తండాలు గ్రామ పంచాయితీలుగా మారిన తర్వాత చాలా అభివృధ్ది చెందుతున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల రూపు రేఖలు మారాయన్నారు. మన కొనరావుపేట్ మండలంలో సుమారుగా 5 కోట్ల జడ్పీ నిధులతో పలు అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు.
కోనారావుపెట్ మండలంలో 28 గ్రామ పంచాయితీ లకు 22 నూతన గ్రామ పంచాయితీ భవనాలను మంజూరు చేసుకోడం జరిగిందన్నారు. మీకు అన్నీ వేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక రూపకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నయాన్నరు.
రైతు పక్షపాతి అయిన కెసిఆర్ లక్ష రుణమాఫి నీ చేస్తున్నరని అన్నారు. ఆసరా పెన్షన్లు, పేదింటి ఆడపిల్లల పెల్లిలకు కళ్యాణ లక్ష్మి, షాదిముబరాక్ ద్వారా ఒక లక్ష రూపాయలను అందివ్వడం జరుగుతుందన్నారు. కెసిఆర్ కిట్, రైతు బంధు, రైతు భీమా, దళిత బంధు, కాళేశ్వరంప్రాజెక్ట్ ద్వారా పంట పొలాలకు సాగు నీరు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అమ్మ ఒడి, ఆరోగ్య లక్ష్మి, 24 గంటల కరెంటు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత డయాలసిస్ కేంద్రాలు, మహిళల రక్షణ కొరకు షి టీమ్స్, పల్లె ప్రగతి, హరితహారం, అన్ని పాఠశాలలలో, కళాశాలలోనీ విద్యార్థులకు సన్న బియ్యంతో నాణ్యమైన మధ్యాహ్న భోజనం, అన్ని గ్రామాల్లో వైకుంఠ దామాలు, డంప్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీ లు, మత్స్యకారులకు ఉచిత చేపల పంపిణీ, యాదవ సోదరులకు ఉచిత గొర్రెల పంపిణీ, రజకులకు మోడ్రన్ దోభి ఘాటులు ఇంకా చెప్పుకుంటూ పోతే మన కెసిఆర్ తెలంగాణ ప్రజల కోసం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకాలు ఎన్నో ఉన్నాయి.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ బండ నర్సయ్య యాదవ్, వైస్ ఎంపీపీ సుమలత శ్రీనివాస్, సర్పంచులు సురేష్ యాదవ్, రేఖ సంతోష్, ఎంపీటీసీ చారి, సీనియర్ నాయకులు న్యాలకొండ రాఘవ రెడ్డి, శ్రీనివాస్, జీవన్ గౌడ్, వార్డ్ మెంబెర్స్, నాయకులు, కుల సంఘం సభ్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!