
బీఎస్పీ పార్టీ మండల కమిటీడిమాండ్.
మహా ముత్తారం నేటి ధాత్రి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రము లో బహుజన సమాజ్ పార్టీ మండల కమిటీ ఆద్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది.గృహ లక్ష్మీ పథకంలో ఉన్నా సమస్యల గురించి తెలపడం జరిగింది. ఈ మారుమూల మండలము లోనీ చాలా మంది కి సొంత భూములు లేవు. అదే విధంగా గృహ లక్ష్మీ లబ్ది దారులకు ఇచ్చిన గడువు తేదీ తక్కువగా ఉన్నందున
చాలా మంది దరఖస్తు చేయలేక పోతున్నారు. కావున బహుజన సమాజ్ పార్టీతరుపున అప్లికేషన్ గడువు పొడిగంచాలని కోరుతున్నాము.అలాగే గత తొమ్మిది సంవ్సరాలుగా రేషన్ కార్డు సైట్ ఆఫ్ లో ఉన్నందున చాలా మందికి రేషన్ కార్డులు లేనందున అనర్హులు గా మిగిలిపోతామని అయోమయంలో ఉన్నారు. ఈ సమస్యలను దృష్టి లో ఉంచుకొని వీటి పరిష్కారం అయిన తరువాత నే ఈ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభించ వలసింది గా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. లేని యెడల బహుజన సమాజ్ పార్టీతరుపున ఉద్యమం చేస్తామని తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో”బహుజన సమాజ్ పార్టీ”యువజన నాయకులు, గుండు ధర్మ తదితరులు పాల్గొన్నారు.