బి యస్ పి ములుగు జిల్లా మహిళా కన్వీనర్ గుంటపూడి తిరుమల
ఇంటి స్థలం ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి.
బి యస్ పి ములుగు అసెంబ్లీ ప్రెసిడెంట్ యెంపెల్లి వీరాస్వామి.
మంగపేట నేటిధాత్రి
బహుజన్ సమాజ్ పార్టీ
ములుగు అసెంబ్లీ అధ్యక్షులు యెంపెల్లి వీరాస్వామి ఆధ్వర్యంలో మంగపేట మండలం లోని తహసీల్దార్ ఆఫిస్ గృహలక్ష్మి కొరకు ధరకాస్థులు చేసుకునే లబ్దిదారులను కలవడం జరిగింది. వారితో మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడుతూ గృహలక్ష్మి కోసం ధరకాస్తూ కొరకు కలెక్టర్ ఇచ్చిన ప్రకటనలో 10తారీకునే లాస్ట్ డేట్ అనడం వలన 10రోజులు కూడా టైం ఇవ్వకపోవడం వలన లబ్దిదారులు కులం,ఆధాయం, నివాసం సెర్టిఫికెట్స్ కోసం తహసీల్దార్ ఆఫిస్ ల చుట్టూ తిరుగుతూ సమయానికి అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దరఖాస్తు గడువు పెంచుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గృహలక్ష్మి లబ్ది దారులు పాల్గొన్నారు.