భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి :
భద్రాచలంలో గురుకులం ఈ ఎం ఆర్ ఎస్ పాఠశాలకు మెరిట్ ప్రకారము ఉపాధ్యాయులను పంపించాలని ఇన్చార్జి ఆర్ సి ఓ గురుకులం డేవిడ్ రాజ్ సంబంధిత ప్రిన్సిపాల్ లకు ఆదేశించారు. శనివారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గురుకులం ప్రిన్సిపాల్ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా నిర్మించే గురుకులం కళాశాలకు గురుకులంలో పనిచేసే వారికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వాలని, అలాగే బాలికల కళాశాలలో మహిళ అధ్యాపకులను, బాలుర కళాశాలలో పురుషులను మాత్రమే, నియమించాలని ,ఇటీవల జూనియర్ లెక్చరర్ల పోస్టుల కొరకు అప్లై చేసుకుని నియమితులైన వారిని తప్పనిసరిగా ఆయా కళాశాలలో నియమించాలని, అదేవిధంగా ప్రస్తుతం కళాశాలలో ఖాళీ అయిన పోస్టులను కూడా త్వరలో భర్తీ చేస్తామని ఆయన అన్నారు. ఇంతవరకు గురుకులం పాఠశాలలో కళాశాలలో పనిచేసి వెళ్లిపోయిన వారి జాబితా తయారుచేసి తనకు అందించాలని, ఆ తర్వాత అదే కళాశాలలో పనిచేస్తున్న వారికి మెరిట్ ప్రకారము ప్రాధాన్యత ఇస్తామని ఆయన అన్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం గురుకుల కళాశాల పాఠశాల లో చదువుతున్న విద్యార్థిని,విద్యార్థుల చదువు పట్ల సంబంధిత ఉపాధ్యాయులు కృషి చేయాలని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన అన్నారు. కొత్తగా నిర్మించే కళాశాలలో సంబంధిత కమిటీల ఆధారంగా వారు సూచించిన దాని ప్రకారం లెక్చరర్లను నియమిస్తామని ఆయన తెలుపుతూ ముఖ్యంగా మెరిట్ ప్రకారము మాత్రమే పరిగణలకు తీసుకొని సంబంధిత అధ్యాపకులను నియమిస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఏ స్పెషల్ ఆఫీసర్ అశోక్ కుమార్, సుదిమల్ల, గుండాల ,దమ్మపేట, భద్రాచలం కిన్నెరసాని ప్రిన్సిపాల్ లు అరుణ్ కుమారి ,హరికృష్ణ, శ్యాం కుమార్ ,దేవదాస్, రవికుమార్ ,ఖమ్మం ఎస్ఓఈ ప్రిన్సిపాల్ బాలస్వామి, గురుకులం పరిపాలన అధికారి నరేందర్ ,తదితరులు పాల్గొన్నారు.