ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) జిల్లా ప్రధాన కార్యదర్శి పర్శక రవి
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్ సి)లో ఇద్దరు డాక్టర్లు ఉండవలసి ఉండగా ప్రస్తుతం ఒక్కరే ఉన్నారని మరొక డాక్టర్ని నియమించాలని ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి పర్శక రవి డిమాండ్ చేశారు.
రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సర్వే చేశారు.
ఈ సందర్భంగా తను మాట్లాడుతూ గుండాల పిహెచ్ సి సెంటర్ పరిధిలో నాలుగు సబ్ సెంటర్లు ఉంటే ముగ్గురు మాత్రమే ఉన్నారని, ఇంకో సబ్ సెంటర్కు ఏఎన్ఎంని నియమించాలని కరెంటు పోతే ఇబ్బంది అవుతుందని జనరేటర్ ని అందుబాటులో ఉంచాలని, అన్ని రకాల రోగాలకు మందులు అందుబాటులో ఉంచాలని అలాగే కొడవటంచ గ్రామానికి కొత్తగా సబ్ సెంటర్ మంజూరు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పివైఎల్ మండల నాయకులు గుండాల ఉప సర్పంచు మానాలు ఉపేందర్, తాటి రమేష్, ఊకే శ్రవణ్, కల్తి ప్రమోద్, ఈసం రమేష్ తదితరులు పాల్గొన్నారు.