# రాష్ట్ర సాధన తో అందుతున్న ఫలాలు
# గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల ప్రారంభం
# హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్ ,ఎమ్మెల్యే పెద్ది ,జడ్పీ చైర్మన్ జ్యోతి, కలెక్టర్ డాక్టర్ గోపి
నర్సంపేట , నేటిధాత్రి :
తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం అం గురుకుల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకుంటూ అమ్మఒడిల ప్రభుత్వ సంక్షేమ గురుకులాలు మారిపోయాయని రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గురుకుల పాఠశాలలో భాగంగా నర్సంపేట పట్టణంలో గిరిజన సంక్షేమ బారుల గురుకుల పాఠశాల, కళాశాలను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి , జిల్లా పరిషత్ చైర్మన్ గండ్ర జ్యోతితో కలిసి రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం ప్రారంభం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ ఆర్సిఓ డిఎస్ వెంకన్న అధ్యక్షతన కళాశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి విద్యతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన గురుకుల పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేసి వారి సంక్షేమానికి దోహదపడుతున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేజీ టు పీజీ విద్య ప్రవేశ పెట్టే నేడు రాష్ట్రంలో 1వెయ్యి గురుకుల పాఠశాలలు ప్రారంభించినట్లు, అలాగే దేశంలో ఎక్కడలేని విధంగా గిరిజన సైనిక్ పాఠశాలను కళాశాలను ప్రారంభించి తరగతులు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులు ఇతర దేశాల్లో చదువులకోసం కార్పొరేట్ స్థాయిలో స్టడీ సెంటర్ లను ఉచితంగా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసి విద్యను అందిస్తుందని అన్నారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమ హాస్టళ్ల తో పాటు పౌష్టిక ఆహారాన్ని విద్యార్థులకు అందించటం కోసం సన్న బియ్యంతో ప్రభుత్వ పాఠశాలలో భోజన వసతులు కల్పిస్తూ ఉన్నత విద్యను అందిస్తున్నారని మంత్రి సత్యవతి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గా మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ కోసం ములుగు జిల్లా కేంద్రంలో అన్ని అన్ని విధాల సౌకర్యం ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే నేటికీ యూనివర్సిటీ అమలు కాలేదని దీంతో గత ఏడేళ్లుగా గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను కోల్పోతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా గిరిజనులు 12 కోట్ల మంది జనాభా ఉంటే వారి అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించిన నిధులు కంటే తక్కువగా దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని దీంతో అభివృద్ధి గిరిజనుల అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందని మంత్రి కేంద్రాన్ని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో 207 గిరిజన తండాలు ఉన్నారని వారి అభివృద్ధి కోసం కెసిఆర్ ప్రభుత్వం దోహదపడుతుందని అన్నారు.విద్య ఒక్కటే కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి చెందుతాయని ఉద్దేశంతో నర్సంపేట నియోజకవర్గానికి 7 గిరిజన గురుకులాలను ప్రారంభం చేసినట్లు అలాగే రాష్ట్రంలో మొట్టమొదటి గిరిజన సైనిక్ స్కూల్ ప్రారంభం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.నర్సంపేట నియోజకవర్గం తోపాటు వరంగల్ జిల్లాలోని కొన్ని మండలాల తో పాటు మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన విద్యార్థులకు నర్సంపేట నియోజకవర్గం ఎడ్యుకేషన్ హబ్ గా మారిందని అందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించి మరింత అభివృద్ధికి ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకుని ఆ ఫలాలను నేడు రాష్ట్ర ప్రజలు వివిధ రూపాలుగా పొందుతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నేటి బాలలే రేపటి పౌరులు అని వారి భవిష్యత్తు కోసం ఇష్టమైన ఆహారాన్ని అందిస్తూ ఉన్నతమైన కార్పొరేటర్ విద్యను ఉచితంగా కెసిఆర్ అందిస్తున్నారని ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత కొనసాగుతున్నారని తెలిపారు. బిజెపి ప్రభుత్వం దేశంలో ఏ వర్గానికి కూడా అక్కరకు రాని బడ్జెట్ ను ప్రవేశ పెట్టారని చెప్పారు.బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నేడు దేశ రాజకీయాల వైపు కేసీఆర్ అడుగులు వేస్తున్నారని అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆమె తెలిపారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి మాట్లాడుతూ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఉన్నత విద్యను, పౌష్టికరమైన ఆహారాన్ని అందిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకోవాలని తెలిపారు.ముందుగా కళాశాల పాఠశాల విద్యార్థులు మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే పెద్ది లతోపాటు ప్రజాప్రతినిధులు అధికారులకు గౌరవంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో
అడిషనల్ కలెక్టర్ హరి సింగ్,,జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్,మున్సిపల్ చైర్మన్ గుం టీ రజినీ కిషన్,వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి,ఆర్డీవో పవన్ కుమార్,ఎమ్మార్వో రామ్మూర్తి,ఎంపిపి మోతె కళావతి ,జెడ్పీటీసీ కొమాండ్ల జయ గోపాల్ రెడ్డి,కౌన్సిలర్స్ దార్ల రమాదేవి, బాణాల ఇందిరా,రాంసహయం శ్రీదేవి, శీలం రాంబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.