గిరిజన మహిళపై దాడిచేసిన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి :

హైదరాబాద్ ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్ లో విచారణ పేరుతో గిరిజన మహిళపై దాడి చేసిన ఎస్సై,పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎల్ హెచ్ పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు భూక్య జగన్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో ఎల్ హెచ్ పీఎస్,ఎమ్మార్పీఎస్, టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. టిఎన్ఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షు ధారవత్ సుభాష్ నాయక్ వ్యవహరించగా ముఖ్య అతిధిగా హాజరైన ఎల్ హెచ్ పీఎస్ జిల్లా అధ్యక్షులు భూక్య జగన్ నాయక్,ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా కన్వీనర్ కట్ల రాజశేఖర్ మాదిగ లు మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో వరలక్ష్మి అనే గిరిజన మహిళ భర్త చనిపోవడంతో తన ముగ్గురు పిల్లలు చూసుకుంటూ, ఇళ్లల్లో పని చేసుకుని బతుకుతుంది.ఆగస్టు 14 న ఆమె తన కూతురు పెళ్లి ఖర్చుల కొరకు దేవరకొండ లో ఉండే తన అన్న దగ్గరనుంచి రూ.3 లక్షలు తీసుకొని, ఎల్బి నగర్ రింగ్ రోడ్డు దగ్గర 15 ఆగస్టు రోజు రాత్రి 11 గంటలకు బస్సు దిగిందన్నారు. బస్టాండ్ లో లక్ష్మితోపాటు మరో కొంతమంది ట్రాన్స్ జెండర్ మహిళలు ఉండగా అక్కడికి వచ్చిన పోలీసులు ట్రాన్స్ జెండర్స్ తో పాటు గిరిజన మహిళ లక్ష్మీని ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకొని పోయి రెండు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి ఈ వద్ద ఉన్న 3 లక్షలు,బంగారం ఆభరణాలు తీసుకున్నారని ఆరోపించారు.ప్రభుత్వం స్పందించి అమే వద్ద పోలీసులు తీసుకున్న డబ్బులు,బంగారం బాధితురాలికి ఇచ్చి అందుకు కారణమైన ఎస్సైతో పాటు పోలీసులపై ఎస్సీ,ఎస్టీ కేసులు నమోదు చేయాలని అలాగే వారిని విదుల నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *