
కొనరావుపేట, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూర్ గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి
అనంతరం కొలనూర్ పాక్స్ చైర్మన్ సంకినెని రామ్మోహన్ రావు ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ బండ నర్సయ్య యాదవ్, పాక్స్ చైర్మన్ సంకీనేని రామ్మోహన్ రావు, సర్పంచ్ యమున మహేష్, నాయకులు రాఘవ రెడ్డి, సతీష్, తదితరులు పాల్గొన్నారు.