
కుందరం సర్పంచ్ సమ్మయ్య
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామం నందు అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ ద్వారా తీసుకువచ్చిన శ్రీరామ స్పర్శ అక్షిoతలను హనుమాన్ గుడిలో పూజలు నిర్వహించి అక్కడి నుండి ఊరిలోని గ్రామ దేవత పోచమ్మ దగ్గర మొదటగా అక్షింతలు చేరవేసినారు. అనంతరం గ్రామంలోని రామ భక్తులు పది బృందాలుగా ఏర్పడి భక్తిశ్రద్ధలతో శ్రీరామ నామం జపిస్తూ అయోధ్య రాముని ఆలయ చిత్రపటాలు,ఆహ్వాన కరపత్రాలు,అక్షింతలను గ్రామంలోని ఇంటింటికి చేరవేస్తూ అక్షింతలు చేరవేసే తరుణంలో ప్రతి ఇంటి వద్ద మహిళలు భక్తి శ్రద్ధలు ఆచరిస్తూ మంగళహారతులతో ఎదుర్కొని శ్రీరామ అక్షింతలు స్వీకరించారు. గ్రామంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఈ కార్యక్రమo ఒక పండుగ వాతావరణం సంతరించుకుంది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సమ్మయ్య మాట్లాడుతూ గత 500 సంవత్సరాలుగా కొనసాగుతున్న నిరీక్షణ ఈ నెల 22వ తారీఖున అయోధ్యలో బాల రాముని ప్రతిష్ట కార్యక్రమం ద్వారా శ్రీరామ భక్తుల కల నెరవేరపోతున్నదని ఆనందం వ్యక్తం చేశారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రతి గ్రామ గ్రామానికి శ్రీరామ స్పర్శ అక్షింతలను ప్రతిష్టాత్మకంగా చేరవేసే కార్యక్రమం లో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని కోరినారు. శ్రీరామ స్పర్శ అక్షింతలను ఇంటిలో భద్రపరచుకొని ఈనెల 22వ తారీఖున అయోధ్యలో శ్రీ బాల రాముడు ప్రతిష్ట రోజున అయోధ్యకు వెళ్లలేని వారు సాయంత్రం ఇంటిలో పూజలు నిర్వహించుకోనీ ప్రతి ఇంటికి ఒక 5 దీపాలు వెలిగించాలని పేర్కొన్నారు.