ఖైరతాబాద్ లో దానం నిర్లక్ష్యం!
-పార్టీ బలోపేతానికి కృషి శూన్యం?
-తనతో వచ్చిన వారికే ప్రాధాన్యం!
-ఉద్యమ కారులు దూరం… దూరం!
-వ్యక్తిగత పనులు తప్ప ప్రజా సమస్యలకు మంగళం!
-రాష్ట్రస్థాయి, జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలకు అనేక సార్లు అవమానం!
-ప్రజలతో మమేకాని సందర్భాలు అనేకం!
-జూబ్లీ హిల్స్ గుడిసె వాసుల విషయం పార్టీపై ప్రభావం?
-ఎమ్మెల్యే దానం తీరు ఎండగట్టిన జనం?
-జనగామలో ముత్తిరెడ్డికి జనం నుంచి ఎదురౌతున్న నిరసన గళాలు?
-ఎంత గుండెల్లో పెట్టుకొని గెలిపించారో ఆ ప్రజలనుండే అంత చీత్కారాలు?
-కబ్జాలపై ఆది నుంచి విమర్శలు?
-సొంత పార్టీ నేతలకే బెదిరింపులు?
-అధికారులకు ముత్తిరెడ్డి చేసిన అవమానాలు?
-కొమురవెళ్లి వివాదాలు?
-దుర్గమ్మ గుడి విషయంలో ఎదుర్కొన్న ఆరోపణలు?
-జనగామ,చేర్యాల చెరువుల ఆక్రమణలు?
-దుర్గమ్మ గుడి స్థలంపై ఇప్పటికీ కొనసాగుతున్న విమర్శలు?
-ముత్తిరెడ్డి మూలంగా నిరాశ్రయులైన ఏసి.రెడ్డి నగర్ వాసులు?
-ఎనాడు బడి వైపు చూడని ముత్తిరెడ్డికు చీపురు తెచ్చిన తంటాలు?
హైదరాబాద్,నేటిధాత్రి:
పదవులు రాక ఎందరో ఎదరుచూస్తుంటే, ప్రజా ప్రతినిధి కాలేకపోయానని మధనపడుతుంటే, పదవులు వచ్చిన వారిలో కొందరు మాత్రం ప్రజల్లో వుండడం లేదు. ప్రజలకు సేవ చేస్తున్నది లేదు. ఆ పదవులకు వన్నె తెవాలన్నది మర్చిపోతున్నారు. ప్రజలు ఆదరించి గెలిపించినా, అదేదో తమ అదృష్టమన్నట్లు వ్యవహరిస్తున్నారు. పదవులు లేని నాడు పాకులాడడం, పదవులు వున్ననాడు ప్రజలకు దూరంగా వుండడం అలవాటు చేసుకుంటున్నారు. గెలిచాక ప్రజా సేవ పక్కన పెట్టి, పెత్తనం చేయడం, ఆస్ధులు పోగేసుకోవడం, ప్రజలను లెక్క చేయలేకపోవడం వంటివాటిని అనుసరిస్తూ, పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. ఇలాంటి నేతల మూలంగా ఉద్యమ పార్టీకి తీరని నష్టం చేస్తున్నారు. ఇలాంటి నాయకులు వుండడం నష్టదాయకమే అని ప్రజలే అంటున్నారు. నిత్యం విమర్శలు ఎదుర్కొంటున్న వారు తెలంగాణలో చాలా మంది వున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతో నమ్మకంతో, వారికి పదవులు అందించారు. టిక్కెట్లిచ్చి గెలిపించారు. పార్టీ కోసం పనిచేస్తారని అనుకున్నారు. ప్రజలకు సేవ చేస్తారని నమ్మారు. కాని వారు ఈ రెండూ తప్ప అన్నీ చేస్తున్నారు. అన్న విమర్శలే సర్వత్రా వినిపిస్తున్నాయి. అలాంటి వారిలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నారేందర్ వున్నారు.
ముందుగా దానం నాగేందర్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఆయన తెలంగాణ ఉద్యమ కారుడు కాదు.
ఒక వేళ తెలంగాణ ఇవ్వాల్సివస్తే హైదరాబాద్‌ను యూనియన్ టెరిటరీ చేయాలంటూ అంతర్లీనంగా సమైక్యాంద్రకు జై కొట్టిన నేత. అంతే కాదు అనేక సందర్బాలలో ఉద్యమ నాయకుడైన ముఖ్యమంత్రి కేసిఆర్‌పై కూడా ఎంత మాట్లాడకూడదో అంత మాట్లాడాడు. అసలు కేసిఆర్‌ను హైదరాబాద్ అడుగు పెట్టనీయమన్నారు. ఇలా వీలు చిక్కినప్పుడల్లా తెలంగాణ ఉద్యమకారులపై లాఠీ రaులిపించినంత పనిచేసి నాయకుడు దానం నాగేందర్. తాను మంత్రిని అన్న సంగతి కూడా మర్చిపోయి, ఓసారి సికింద్రాబాద్‌లో ఉద్యమ కారులను తరమికొట్టిన ఘనత దానం నాగేందర్‌ది. అంతేకాదు ఆయన మంత్రిగా వున్న సమయంలోనే అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని అన్న సందర్భంలో సీమాంధ్ర ఎమ్మెల్యేలు బల్లరు చరుస్తుంటే తాను కూడా బల్లలు చర్చిన నాయకుడు దానం నాగేందర్. ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం సాగుతుంటే మరో వైపు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను ఆ సమయంలో ఎలా ముఖ్యమంత్రిని చేయాలన్నదానిపై కసరత్తు చేసిన నాయకుడు దానం నాగేందర్. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి, అణచివేయడానికి చేయాల్సినంత చేశాడన్నది జగమెరిగిన సత్యం. ఇక ఆయనకు రాజకీయ జీవితానికి చేయూతనిచ్చిన పిజేఆర్‌తో విభేధించి, చివరికి ఆయన రాజకీయ జీవితానికి ఇబ్బందికర పరస్ధితులు దానమే సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. ఎందుకంటే ఆయన ఏర్పాటుచేసిన సభకు హజరైన సమయంలోనే పిజేఆర్ గుండెపోటుతో మరణించాడు. తన శిష్యుడే తనకు అన్యాయం చేస్తున్నాడని పిజేఆర్ మధనపడేవాడని అంటారు. పిజేఆర్‌కు గుండెపోటుకు గురయ్యాడని తెలిసినా, పక్కనే కిమ్స్ ఆసుపత్రి వున్నా, అక్కడకు చేర్చడంలో ఆలస్యం చేశారనన్న ఆరోపణలు అనేకం వున్నాయి. అంతే కాదు ఆయనకు 2004 ఎన్నికల్లో గోషామహల్ నుంచి కాంగ్రెస్ టిక్కెట్టు ఇవ్వకపోతే, రాత్రికి రాత్రి కండువా మార్చుకొని, తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆ సమయంలో సిఎల్పీ నేతగా వున్న వైఎస్ రాజశేఖరరెడ్డి , దానం నాగేందర్‌కు టిక్కెట్టు ఇవ్వడంలో చొరవ చూపలేదు. దాంతో తనకు కాంగ్రెస్‌పార్టీ అన్యాయం చేసిందని ప్రచారం చేసుకొని సానుభూతితో దానం గెలిచారు. కాని కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వెంటనే పదవికి రాజీనామా చేశారు. తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీ చిదిమేసిందని గగ్గొలు పెట్టిన ఆయనే ఒక్కరోజులో తెల్లారేసరికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడు. మళ్లీ కాంగ్రెస్ తీర్దం పుచ్చుకున్నాడు. ఉప ఎన్నికల బరిలో నిలిచి బోల్తాపడ్డాడు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఎక్కడైతే సానుభూతి విజయం సాధించాడో అక్కడినుంచి మళ్లీ పోటీ చేసి, వున్న పదవి పోగొట్టుకున్నాడు. 2009 ఎన్నికల్లో గెలిచి పదవి కోసం తెలంగాణను వ్యతిరేకించాడు. 2014 ఎన్నికల్లో ఓడిపోయి, 2018 ఎన్నికల ముందు టిఆర్‌ఎస్‌లో చేరాడు. ఎంతో పెద్ద మనసుతో ముఖ్యమంత్రి కేసిఆర్ గతాన్నంతా మర్చిపోయి టిక్కెట్టు ఇస్తే, గెలిచిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు చేరువైంది లేదు? మేలు చేసింది లేదు? కరోనా కాలంలో ప్రజలను ఎమ్మెల్యేగా ఆదుకున్నది లేదన్నది నియోజకవర్గంలో ప్రజలు చెబుతున్న మాట. ఇక పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఏనాడో విస్మరించాడన్నది ఆయనపై వున్న అపవాదు. ఇప్పటి వరకు ఆయన స్వయంగా పార్టీని కంచుకోటగా మార్చలేకపోయాడు. కేవలం తనతో టిఆర్‌ఎస్‌లోకి వచ్చిన తన అనుచరులకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ, ఉద్యమ కారులను దూరం పెట్టాడన్న అపవాదు వుంది. గతంలో ఆయన అనుచరులుగా వున్నవారి పెత్తనం తప్పితే, ఉద్యమ కారులైన టిఆర్‌ఎస్ సీనియర్లనాయకులను పనిగట్టు కొని దూరం పెట్టారన్న విమర్శలున్నాయి. ఎమ్మెల్యే పదవిని తన వ్యక్తిగత పనుల కోసం, ప్రతిష్ట కోసం, వ్యాపారాల కోసం తప్ప ప్రజలకు ఏనాడు చేరువైంది లేదంటున్నారు. తన నియోజకవర్గంలో వున్న టిఆర్‌ఎస్ రాష్ట్ర స్దాయి, జిల్లా స్దాయి, నియోజకవర్గ స్దాయి నాయకులను ఆయన పనిగట్టుకొని అవమానించి, పార్టీకి దూరం చేసే పనులే నిర్వహించారని అంటుంటారు. ఇక జూబ్లిహిల్ గుడిసే వాసుల విషయంలో ఎమ్యెల్యే దానం అనుసరించిన విదానాన్ని ప్రజల ఎండగట్టిన వైనం తెలిసిందే.
ఇక జనగామ ఎమ్మెల్యే ఉద్యమ కారుడే…కాని ఆయన కేవలం తన రాజకీయ జీవితం కోసమే ఉద్యమాన్ని ఎంచుకున్నాడన్న వాదన మొదటినుంచి వుంది.
ఆయన ఉద్యమ కాలంలో నియోకవర్గ స్దాయి నాయకుడిగా వున్నప్పటికీ, ఉద్యమ కారులకు ఎలాంటి చేయూతనివ్వలేదన్నది అప్పట్లోనే చెప్పుకునేవారు. తెలంగాణలోని చాలా నియోజకవర్గాలలో ఉద్యమ కారుల మంచీ చెడులు చూసుకున్న నాయకులే ఎక్కువ. కాని జనగామకు సంబంధించి కేసులెదుర్కొనా, పోలీస్ స్టేషన్‌లో నిర్భందాలకు గురైనా ఏనాడు ముత్తిరెడ్డి చొరవ తీసుకున్న సందర్భాలు లేవని అంటుంటారు. అలా ఉద్యమకారులకు అవసరమైన న్యాయ సాయం చేసింది స్యయంగా జనగామకు చెందిన లాయర్లే గాని, ఏనాడు ముత్తిరెడ్డి వాటిని పట్టించుకునేవారు కాదన్నది అందరికీ తెలిసిన సత్యమే. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మంది అడ్వకేట్లు ఉద్యమ కారులకు అండగా నిలిచారు. ఒక దశలో ఉద్యమకారులను అప్పటి సిఐ రోడ్దు మీదనే లాఠీలతో కొడుతూ, బూట్లతో తొక్కిన సందర్భం వుంది. కారణం కేవలం అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఫ్లెక్సీని చించారని, పొన్నాలపై నిరసనగా కోర్టు సమీపంలో ప్లెక్సీకి చెప్పుల దండ వేవారని, ఆయన ఇంటిపై దాడి చేశారని ఆరోపణలో తెలంగాణ ఉద్యమకారులను తీవ్రంగా హింసించిన సందర్భం వుంది. కాని ఆ సమయంలో ఏనాడు ముత్తిరెడ్డి వారికి మద్దతుగా రోడ్డెక్కింది లేదు. పోలీసు నిర్భంధాలను ఎదిరించి పోరాటం చేసింది లేదు. కేవలం ఉద్యమ కారులు చేసిన ఉద్యమమే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి రాజకీయ జీవితానికి ఉపయోగపడిరదేగాని, ఆయన వల్ల ఏ ఒక్క ఉద్యమకారుడికి న్యాయం జరగలేదని అంటారు. ఇప్పటికీ ఆయన ఉద్యమకారులకు సరైన ప్రాదాన్యతనివ్వడం లేదన్న ఆరోపణలు వుండనే వున్నాయి. కేవలం ఆయన సామాజిక వర్గానికి చెందని నేతలకే ప్రత్యేక ప్రాదాన్యతనిస్తారన్న విమర్శలున్నాయి. ఎందుకంటే జనం ఎంతగా గుండెల్లో పెట్టుకొని గెలిపించుకున్నారో ఇప్పుడు అంతకు పది రెట్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ముత్తిరెడ్డి విషయంలో కబ్జాలు, సొంత పార్టీ నేతలకు బెదిరింపులు, అధికారులకు అవమానాలు, దుర్గమ్మ గుడి విషయంలో ఎదుర్కొన్న ఆరోపణలు మొత్తంగా ఈసారి ముత్తిరెడ్డిని బరిలో నిలిపితే మాత్రం ఇబ్బందే అన్నది సాక్ష్యాత్తు టిఆర్‌ఎస్ నేతలే భహిరంగంగా చెప్పుకుంటున్న మాట…