*గాయత్రి కంపెనీ అధినేత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అందజేసిన రెండో గ్రానైట్ ఇది*
*మొదట ఢిల్లీ చాణక్యపురిలో పోలీసు జాతీయ స్మారక స్థూపానికి, తాజాగా ఇప్పుడు కర్తవ్యపథ్ లో బోసు విగ్రహానికి ఉచితంగా బహుకరణ*
*రాజ్ పథ్ సుందరీకరణలో భాగంగా బోసు విగ్రహాన్ని నెలకొల్పారు*
*బోసు విగ్రహాన్ని గురువారం రాత్రి ప్రధాన మంత్రి మోడీ ఆవిష్కరించారు*
*ఖమ్మం:* ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ కర్తవ్యపథ్ (రాజ్ పథ్)లో సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ విగ్రహానికి ఉపయోగించిన బ్లాక్ గ్రానైట్ కు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లి నుంచి పంపడం జరిగింది.గత ఏడాది ఢిల్లీ చాణక్యపురి పోలీసు జాతీయ అకాడమీలో నెలకొల్పిన స్మారక స్థూపానికి కూడా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెర్వుమాధారం గ్రానైట్ నే ఉపయోగించడం జరిగింది.ఈ రెండింటికి కూడా బ్లాక్ గ్రానైట్లను గాయత్రి గ్రానైట్స్ కంపెనీ అధినేత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అందజేశారు.