ఖమ్మంలో ఎంపి వద్దిరాజు పర్యటన

*మంత్రి పువ్వాడతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొన్న రవిచంద్ర*

*పలు వినాయక మండపాల సందర్శన*

*ప్రత్యేక పూజలు, అన్నదానాలు,భక్తులతో కలసి భోజనం చేసిన ఎంపి*

 

మిన్నంటిన జై గణేశ జై జై గణేశ, గణేష్ మహరాజుకీ జై,జైజై గణేష్ మహరాజ్ నినాదాలు

ఖమ్మం : రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పట్టణంలో,శివార్లలో బుధవారం విస్త్రతంగా పర్యటించారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో రఘునాథ పాలెం మండలం కోటపాడు గ్రామం మాచినేని చెరువులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి చేప పిల్లల్ని వదిలారు.బురహాన్ పురంలో వృద్ధులు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేసిన

కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపి పాల్గొన్నారు.అలాగే, పట్టణంలోని వైరా రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సిఎంఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభోత్సవానికి అతిథిగా హాజరై దాని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.ఎంపి రవిచంద్ర తన చేయూతతో ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు,అర్చనలు చేశారు.మేదర్ బజార్ లో అంకమ్మ తల్లి ఆలయం, గణేష్ మండపాలలో కొబ్బరి కాయలు కొట్టారు.రమణగుట్ట,24గంటల పంపు,మామిళ్ల గూడెం రామాలయం సెంటర్,బోసు బొమ్మ సెంటర్,గాంధీ నగర్,జహీర్ పుర లంబాడీ తండ, అగ్రహారం, అగ్రహారం గేట్,ఆదిత్య థియేటర్ ఎదురుగా జమ్మిబండ రోడ్డు తదితర చోట్ల ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించారు.పలుచోట్ల అన్నదానం కార్యక్రమాలలో పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు,గాంధీ నగర్ 3వ వీధిలో భక్తులతో కలసి భోజనం చేశారు.వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు.రవిచంద్ర వెంట ఉన్న యువకులు “జై గణేశ జై జై గణేశ, గణేష్ మహరాజుకీ జై,జైజై గణేష్ మహరాజ్ “అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు,టపాసులు పేల్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *