భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నేటిధాత్రి:
చుంచుపల్లి మండలం. రుద్రంపూర్.జి.కె.ఓ.సి నందు 53 వ వార్షిక రక్షణ పక్షోస్తవాలు 2021 సందర్బముగా జరిగినవి. మేనేజర్ కరుణాకర్ రావు అధ్యక్షతన ఏర్పటు చేసిన ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ జక్కం రమేశ్ . జి.ఎం. హెచ్‌ఆర్‌డి బిహెచ్ వెంకటేశ్వర రావు, టిబిజికేఎస్ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్ . ఏరియా ఇంజనీర్ రఘు రామ రెడ్డి గారు, జి.కె.ఓ.సి ప్రాజెక్టు ఆఫీసర్ రమేశ్ , హాజరు అయినారు. కార్మికులను ఉద్దేశించి వీరు మాట్లాడుతూ ..రక్షణ సంభంధించి విషయాలను వారికి తెలియజేయడ మైనది. రక్షణ విషయాలను పాటల ద్వారా నాటికల ద్వారా కళాకారులు తెలియ జేసినారు. 2019 52 వ వార్షిక రక్షణ వారోస్తవాల్లో జి.కె.ఓ.సి మైన్ కు గ్రూప్ 2 లో మొదటి బహుమతి, ఓవరాల్ ఎన్విరాన్మెంట్ లో 2 వ బహుమతి పొందినది అని తెలియ జేసినారు.ఈ కార్యక్రమములో ఎస్.ఓ.ఎం. (పి.పి) కార్పొరేట్ డి. శ్యామ్ సుందర్, డిజిఎం (ఈ &ఎం) హెచ్.ఆర్.డి. కార్పొరేట్ కె. రామోహన్, ఎస్.ఎస్.ఎస్.ఓ. యెల్లందు ఏరియా పి. బాలాజి నాయుడు, అడిషనల్ మేనేజర్ ఎన్విరాన్మెంట్ ఎం. ప్రసాద్,(మైనింగ్) డి. రాజకుమార్,(ఎలక్రీకల్ ) బి. రవీందర్, డబల్యూ.ఎం. ఐ ఐ.(మెకనికల్ ) ఏ. సదానందం, సీనియార్ సెక్యూరిటి ఆఫీసర్ రమనా రెడ్డి, మధుకర్ ఎస్.ఈ, పిట్ సెక్రెటరి చెరిపల్లి నాగరాజు, గోపు కుమార్, మురాద్, భీముడు, విప్లవ రెడ్డి, కుమారస్వామి, 11 మెన్ కమిటీ సబ్యులు కాపు కృష్ణ, సేఫ్టీ కమిటీ మెంబర్లు, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు, జీనుకుల సదానందం కళా బృందం, ఇతర అధికారులు, యూనియన్ నాయకులు, డిఎల్‌ఆర్ కార్మికులు పాల్గొన్నారు