`రాజనీజ్ఞుడి అడుగులు రాటుదేలే వుంటాయి.
`సంకల్ప దీక్షకు సాధన తోడు కావడం కేసిఆర్ లో గతంలో చూసిందే..
`అదును చూసి రాజకీయ ఎత్తుగడలు వేయడంలో కేసిఆర్ దిట్ట.
`తెలంగాణ ఉద్యమం కాలంలోనూ ఎంచుకున్న మార్గమే ఇప్పుడూ…
`అయినా ఎవరికీ అర్థం కానిదే…
`ఒక్కో మెట్టు…ఒక్కో అడుగు…
`ముందు ప్రాంతీయ పార్టీల ఏకం….
`నితీష్ కు అర్థమైన కేసిఆర్ వ్యూహం… తనూ అదే దారిలో పయనం…
`ఉత్తరాధిలో ప్రాంతీయ పార్టీలలో కదలిక…బిజేపికి నష్టం తప్పదిక.
`ముందు సామాజిక చైతన్యం…
`ఆ తర్వాత రైతు సంక్షేమం…
`సాగు నీటి రంగ సంస్కరణలు…
`ప్రాజెక్టుల నిర్మాణాలు….
`రైతుకు ఉచిత విద్యుత్…
`దేశమంతటా రైతు బంధు….దళిత బంధు
`అదును చూసి గిరిజన బంధు…
`తెలంగాణ లో అమలవుతున్న అన్ని పథకాలు దేశం మొత్తం…
`జన సంక్షేమం, దేశ సౌభాగ్యం…సర్వతోముఖాభివృద్దే సంకేతం.
`అన్ని వర్గాల అభ్యున్నతే కేసిఆర్ లక్ష్యం.
`తిరుగులేని రాజకీయం… దేశానికి కేసిఆర్ రూపంలో నవ శకం.
హైదరాబాద్,నేటిధాత్రి:
దేశం క్లిష్ట పరిస్ధితుల్లో వుంది. ఇది గతంలో ఓ సినిమాలో పాపులర్ డైలాగ్. అది ఇప్పుడు రాజకీయంగా నిజమే అనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కకావికలమైంది. ప్రతిపక్షాలు చెల్లాచెదురయ్యాయి. బిజేపికి ప్రాంతీయ పార్టీలతో పనిలేదు. కాంగ్రెస్ దరి చేరేందుకు ప్రతిపక్షాలకు నమ్మకం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ధైర్యం లేదు. ఒక వేళ కాంగ్రెస్ పుంజుకుంటే తప్ప ఆలోచించలేని క్లిష్ట రాజకీయ పరిస్ధితి దేశంలో వుంది. ఇదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి కలిసొచ్చే అంశం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితి అయితే ఇక దేశ రాజకీయాల్లో ఆ పార్టీకి తిరుగే లేదట. ఇది ఓ జోతిష్యుడు కూడా చెబుతున్న మాట కూడా. ముఖ్యమంత్రి కేసిఆర్ బ్రహ్మ మానసపుత్రుడు అంటూ ఆ జ్యోతిష్యుడు చెప్పే విషయాలు కొన్ని నిజాలుగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పట్టుదలకు అలాంటి వారు మారుపేరుగా వుంటారన్నది తెలుస్తోంది. జీవితాంతం అలుపెరగని పోరాటం చేస్తారన్నది కూడా కేసిఆర్ విషయంలో ఇప్పటికే నిజమైంది. కేసిఆర్ తొలి రాజకీయ అడుగులు వేసిన నాటి నుంచి ఆయన ఏదో ఒక రాజకీయ సంచలనానికి వేదికౌతూనే వస్తున్నారు. ఎందుకంటే సిద్ధిపేటలో ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచించి కూడా సామాన్యమైన నాయకుడి మీద కాదు. ఒక రకంగా ఒకప్పటి తెలంగాణ యోధుడు. ఆ మదన్ మోహన్‌కు కేసిఆర్ శిష్యుడి లాంటి వారు. గురువును కూడా రాజకీయంగా ఓడిరచగల రాజకీయ చాణక్యం ఆయన సొంతం. అలాగే తెలుగుదేశం పార్టీలో వున్న సమయంలో చంద్రబాబుకు అధికారం దక్కడంలో కీలకభూమిక పోషించిన కేసిఆర్‌ను పక్కన పెట్టి చంద్రబాబు తప్పు చేసినా, అది తెలంగాణ రాజకీయాలకు మేలు చేసింది. తెలంగాణ ప్రాంతానికి ఎంతో ఉపయోగపడిరది. అదే ఉమ్మడి రాష్ట్రంగా వుంటే తెలంగాణ ఇంకా ఎండి ఎడారి అయ్యేది. నీటి చుక్కలేని భీడు భూములే మిగిలేవి. తెలంగాణలో అన్నమో రామచంద్రా అని ఆకలి కేకలు వినిపించేవి. ఎండాకాలంలో పశు గ్రాసం కూడా దిక్కు లేకుండాపోయేది. పాడి, పంటల జాడ లేకుండా పోయేది. విధాత రూపంలో వచ్చిన కేసిఆర్ చేపట్టిన తెలంగాణ సాధన సంకల్పం మూలంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడమే కాదు, బంగారు తెలంగాణ దిశగా అడుగులు పడ్డాయి. తెలంగాణ సస్యశామలమైంది. తెలంగాణలో నీటి సిరుల పరవళ్లు లేడిపిల్లల్లా దుంకుతున్నాయి. ఎండిపోయిన చెరువులు ఎప్పుడూ నిండి వుంటున్నాయి. పల్లెలకు నీటి గోస తీరింది. పంట పొలాలకు నీరు పుష్కలమైంది. ఒకనాడు నారు నాడే సక్కగ నీరుండేది కాదు. కరంటు చాలేది కాదు. ఆరు గాలం కష్టపడి, అప్పులు చేసి విత్తు వేసి, నారు పెట్టి, నాట్లేసి, ఎరువులు, పురుగు మందులు చల్లి, చంపిపాపలా పైరును కాపాడుకుంటే, పంట చేతికొచ్చే నాటికి కరంటు కష్టాలు వెంబడిరచేవి. నీటి జాడలు అడుగంటిపోయిన బోర్లు ఎండిపోయేవి. చుక్క నీటికోసం పొలం తల్లడిల్లేది. రైతు గుండె ఆవిరయ్యేది. కాని ఆ కాలం చూసిన రైతు ఇప్పుడు కళ్లనిండా నీళ్లు చూస్తు పరవశిస్తున్నాడు. పరవళ్లు తొక్కుతున్న నీటిని చూసి సంబరపడుతున్నాడు. పొలమంతా నీటిని చూస్తూ, ఇంకిన తన కన్నీళ్లను ఆనందబాష్పాలుగా రప్పించుకొని కేసిఆర్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. బలమైన సంకల్పం వున్న వారు ఎప్పుడూ ఏదో ఒకటి సాధిస్తూనే వుంటారు.
ఒకనాడు నా తెలంగాణ ఎందుకు ఎండిన బీడులని ఏడ్చిన కేసిఆర్, దేశంలో కూడా రైతు వేధనను చూసి చలించిపోయాడు. తెలంగాణలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కేసిఆర్ ప్రజల సంక్షేమం కోసం అన్వయించాడు. తెలంగాణలో సాధ్యం కావని అనుకున్న ప్రతి పనిని చేసి చూపించాడు. తెలంగాణ రాకపోతే అందరూవున్నా ఆర్ధిక ఆసరా లేక చీత్కారాలకు గురవౌతున్న పెద్ద మనుషులకు ఫించన్ రూ. 2000 వచ్చేవా? గతంలో ఉమ్మడిరాష్ట్రంలో ఇచ్చిన రూ.200 వందలు రూ.5వందలు అయ్యేవేమో! కాని ప్రస్తుతం అందుతున్నంత పించన్ కలలో కూడా ఊహకందేది కాదు. అలాగే దివ్వాంగులకు రూ.3500 అన్నది ఊహించడానికే కష్టంగా వుండేదేమో! ఇక తెలంగాణలో చెరువులు బాగు పడేవా? చెరువుల్లో నీటి జాడలుండేవా? ఇరవై నాలుగుగంటల కరంటు సాద్యమయ్యేదా? రైతు బంధు అనేది ఒకటి వినిపిచేందా? ఎప్పటిలాగా కష్టమైనా ఊరునే నమ్ముకొని వుండేవాళ్లు అప్పులు చేసి సాగు చేసేవారు. ఎంతో మంది చిన్న సన్న కారు రైతులు తెలంగాణలోని తమ ఇండ్లు, భూములు వదిలేసి హైదరాబాద్, బొంబాయి వలస వెళ్లే రోజులు వుండేవి. కాని నేడు తెలంగాణ రాష్ట్రానికే ఉత్తరాధి నుంచి కొన్ని లక్షల మంది వచ్చి అటు ప్రాజెక్టులలో, ఇటు ఇండ్ల నిర్మాణాలలో, పొలం పనుల్లో, రైసు మిల్లుల్లో పనిచేస్తున్నారు. కారణం ఆయా రాష్ట్రాలో వారికి సరైన ఉపాధి లేదు. సాగుకు నీరు లేదు. వ్యవసాయం సాగడం లేదు. ఇది తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసిఆర్ దేశమంతా పచ్చని పందరి చేయాలనుకుంటున్నాడు. ఎక్కడ చూసినా పచ్చ దనం వెల్లివిరియాలని కోరుకుంటున్నారు. పాడి పంటలతో ఒకనాడు దేశం ఎలా వర్ధిల్లిందో అలా చూడాలనుకుంటున్నారు. మన దేశ ఏకానమిలో ఇప్పటికీ కీలక భూమిక వ్యవసాయ రంగానిదే. దాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తు తరం మరింత నష్టపోతుంది. అందుకే కేసిఆర్ ఒకనాడు తెలంగాణ కోసం ఎత్తిన జెండాను, ఇప్పుడు దేశం కోసం మరోసారి ఎత్తుబోతున్నాడు. మరోసారి పిడికిలి బిగించి, దేశంలో సంక్షేమ రంగానికి స్వర్ణయుగం తెవాలనుకుంటున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో వుండేందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపకల్పన చేస్తున్నారు. ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగు పడదని పెద్దలు ఊరికే చెప్పలేదు.
2014లో అధికారంలోకి వచ్చిన బిజేపి ఈ ఎనమిదేళ్ల కాలంలో ఏం సాధించింది అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే విద్య, వైద్య, సాగు, వ్యవసాయ రంగాలన్నీ కుదేలయ్యాయి. కేంద్రంలో బిజేపి ప్రభుత్వం వచ్చాక దేశంలో ఎక్కడైనా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందా? చెప్పడానికి సమాధానం లేదు. కనీసం ఏ రాష్ట్రానికైనా సహకరించారా? అంటే అదీ లేదు. కనీసం బిజేపి పాలిత రాష్ట్రాలలోనైనా సాగు నీటి ప్రాజెక్టుల గురించి ఆలోచించారా? అంటే అదీ లేదు. కాని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ వల్ల తెలంగాణలో సాధ్యమే కావనుకున్న అనేక ప్రాజెక్టులు నిర్మాణం జరిగాయి. అందులో కాళేశ్వరం అన్నది ఒక చారిత్రక ఘట్టం. కొన్ని వందల సంవత్సరాల పాటు కేసిఆర్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించేది. అసలు తెలంగాణలో రిజర్వాయర్లనిర్మాణం అన్నది చేయొచ్చని ఎవరైనా ఊహించారా? తెలంగాణను కేసిఆర్ సస్యశ్యామలం చేసి చూపించారు. ప్రపంచానికి ఒక పాఠం నేర్పించారు. కాని బిజేపి నేర్చుకోలేపోయింది. స్వతంత్ర భారత దేశంలో రైతులు కొన్ని నెలల పాటు రోడ్డెక్కి పోరాటం సందర్భం గతంలో ఎన్నడూ లేదు. కాని బిజేపి పాలనలో ఎదురైంది. దేశంలో కొత్త ప్రాజెక్టులు లేవు. రైతులకు కరంటు సరఫరా లేదు. సాగుకు అవసరమైన నీరు లేదు. పెట్టుబడి సాయం లేదు. సరైన ఎరువుల సరఫరా లేదు. వాటి ధరలకు కళ్లెం లేదు. పెట్రోల్, డిజిల్ ధరలకు రోజూ రెక్కలే…గ్యాస్ తగ్గుడన్న మాట లేకుండా పెరిపోతోంది. ప్రతి వస్తువు మీద పన్నే…జిఎస్టీ పేరుతో బాదుడే…దేశ ప్రజలకు ఇవన్నీంటినుంచి నుంచీ విముక్తి కావాలి.
రైతులకు నీరు కావాలి. అందుకు సాగునీటి ప్రాజెక్టులు కట్టాలి. రైతుకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ కావాలి. దేశమంతా పాడిపంటలతో సమృద్ది చెందాలి. దేశంలోని రైతుందరికీ రైతు బంధు అందాలి. రైతుకు తొలకరి నాడే సాయం అందాలి. పెట్టుబడి ఎదురుచూసే రోజులు పోవాలి. పండిన పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసే ప్రభుత్వం రావాలి. దేశంలో ప్రజలంతా ఆర్ధికంగా బాగుపడాలి. తెలంగాణలో అమలౌతున్న దళిత బంధు ను దేశమంతా విస్తరించాలి. అంతే కాకుండా మైదాన ప్రాంతానికి దూరంగా, సమాజానికి మరింత దూరంగా దుర్భర జీవితాలు అనుభవిస్తున్న గిరిజనులకు కూడా గిరిజన బంధు రావాలి. పేదింటి ఆడపిల్ల పిల్లకు కళ్యాణ లక్ష్మి దేశమంతా కావాలి. ఫించన్లు దేశమంతా పెరగాలి. డిల్లీలో కూడా అందని మంచినీటి సౌకర్యం తెలంగాణలో అందుతున్న మిషన్ భగీరథ అమలు కావాలి. దేశమంతా సురక్షితమైన మంచినీరు అందాలి. మహారాష్ట్రలోని లాతూర్‌లో ఏటా వేసవిలో మంచినీటిని ట్రైన్లలో సరపరా చేయడాన్ని చూస్తున్నాం. అది శాశ్వత పరిష్కారం కాదు. అక్కడ కూడా ఇంటింటికీ మంచినీరు అందించాలి. అది ఒక్క కేసిఆర్‌తోనే సాధ్యం. ఎందుకంటే ఇవన్నీ విజయవంతంగా అమలు చేసి, సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణను మొదటిస్ధానంలో నిలిపిన కేసిర్ వల్లనే దేశంగా ఈ పధకాల అమలు సాధ్యమౌతాయి. అందుకే దేశ ప్రజలంతా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. కొత్త జాతీయ పార్టీ ఎప్పుడు ప్రకటిస్తారా? అని ఎదురుచూస్తున్నారు. దేశంలోని రైతాంగమంతా చర్చించుకుంటుంది. కేసిఆర్ వస్తే రైతు రాజ్యం వస్తుందని అనుకుంటున్నారు. దేశం సస్యశ్యాలమౌతుందని చర్చించుకుంటున్నారు. దేశంలో ముక్తు బిజేపి అన్నది కేసిఆర్‌తోనే సాధ్యమన్నది నిరూపించేదాకా కేసిఆర్ విశ్రమించడని మాత్రం తెలుస్తోంది..! పట్టువదలని విక్రమార్కుడు కేసిఆర్…విజయాలే తప్ప అపజయాలు లేని రాజనీతి దురందురుడు కేసిఆర్..! నవతరం రాజకీయ నాయకుడు కేసిఆర్….దేశాన్ని ఏలే సత్తా వున్న ఏకైక నేత కేసిఆర్.