`ప్రతిపక్షాల ఏకం కేసిఆర్ తోనే సాధ్యం.
`రాజకీయ పునరేకీకరణ విజయం కేసిఆర్ సొంతం.
`తెలంగాణ సాధనలో విజయమే ఆ బలం.
`కేసిఆర్ ఒక్క గొంతు కోట్లాది గొంతులతో సమానం.
`కేసిఆర్ ఒక్క మాటతో ఉలిక్కిపడిన బిజేపి నాయకత్వం.
`అణచివేతపై ఎక్కుపెట్టిన బాణం కేసిఆర్.
`తిరుగుబాటుకు అసలైన నిర్వచనం కేసిఆర్.
`కేసిఆర్ ప్రశ్నకు ఎదురు నిలబడడం ఎవరి తరం?
` కేసిఆర్ అంటేనే తిరుగుబాటుకు అర్థం.
`కేసిఆర్ నరనరాల్లో వుండేదే చైతన్యం.
` తెలంగాణ సాధనే అందుకు నిదర్శనం.
`కేసిఆర్ మాట ఉప్పెనతో సమానం.
`ఆ సునామికి బిజేపి మునక ఖాయం
`బిజేపి అడ్రసు గల్లంతు తధ్యం.
హైదరాబాద్,నేటిధాత్రి:
ఈ రోజుల్లో నీ గురించి ఆలోచించేవారు ఎవరు? నీకు మేలు జరగాలని కోరుకునేది ఎవరు? మనం అన్న భావన వున్నది ఎంత మందికి? మన ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశలు, ఆశయాలు, కోరికలు, వారి అవసరాలు తీరేలా వారి జీవితాల్లో వెలుగులు నిండేలా బతుకులు మారాలని కోరుకునేవారు ఎవరు? ఎంత సేపు రాజకీయాలు, పదవులు, ప్రభుత్వాలు ఇవేనా రాజకీయమంటే! అన్నం పెట్టే రైతన్న ఎందుకు దుఖిస్తున్నాడు? ఎందుకు వేధన చెందుతున్నాడు. తాను కూడా నాలుగు వేళ్లు నోట్లోకి పోకుండా ఎందుకు రోధిస్తున్నాడు. పండిన పంటకు గిట్టుబాటు ఏది? చేతికందిన పంటకు రాబడి ఏది? ఆరు గాలం శ్రమించిన దానికి కూలీ ఏది? సాగుకు నీళ్లేవి? ప్రాజెక్టులేవి? రైతుకు నిరంతర విద్యుత్ ఏదీ? దోపిడీ సమాజంలో రైతును కాపాడాల్సిన వాళ్లు ఎందుకు కళ్లు మూసుకుంటున్నారు. కుళ్లును ఎందుకు ప్రోత్సహిస్తున్నారు. దేశ సంపదన మీద పడి దోచుకుంటున్నవారు ఎవరు? ప్రజల సొమ్మును ఎవరికి దారాధత్తం చేస్తున్నారు. సొమ్మొకొరిది, సోకొకరిది ఎందుకౌతోంది? దేశ వ్యాప్తంగా బిజేపి మీద రాజకీయ వేత్తలు, నాయకులు, పార్టీల అభిప్రాయం. ఇదే ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రశ్న. ఎంత సేపు రాజకీయ అవసరాల కోసమే రాజకీయ పార్టీలు పబ్బం గుడపుకుంటూ పోతే దేశ ప్రగతికి దారేది? దేశ ప్రజలకు సుఖమేది? సంతోషమేది? ఆనందకరమైన వాతావరణం ఏది?
అందుకే చీకటినీ చీల్చుకొని వచ్చే వేకుక కిరణసూర్యుడు కేసిఆర్ రూపంలో ప్రతిసారి ఉదయిస్తూనే వుంటాడు. సమాజానికి ఇబ్బందులు, తలవంపులు వచ్చిన ప్రతీసారి తానున్నానని ప్రజలకు భరోసా కల్పిస్తుంటారు. వారి ఆశలకు వారధిగా నిలుస్తుంటాడు. వారి కోసం పోరాటానికి మరో రూపమైన పోరు బాటను ఎంచుకుంటాడు. అలా తెలంగాణ సాధించాడు. ఇప్పుడు దేశ గతిని మార్చేందుకు మరోసారి తన ప్రయాణం మొదలుపెట్టారు. సమాజ చైతన్యం కోసం, సమాజ గతి మార్పు కోసం, ప్రజల కోసం, వారి జీవితాలలో వెలుగులు నిండడం కోసం, నింపడం కోసమే కేసిఆర్ రాజకీయం. కేసిఆర్ రాజకీయ ప్రయాణం. కేసిఆర్ లక్ష్యం. సమాజం బాగు కోసమే ఆయన ఎంచుకునే మార్గం. అంతిమ గమ్యం. ఒక్కడుగా మొదలై, ఒక్కొ అడుగువేస్తూ, సమాజాన్ని తనదారిలోకి, తన అడుగుల్లో అడుగులు వేసేలా చేసుకోవడం ఈ తరం నేతల్లో కేసిఆర్ అగ్రగణ్యుడు.
దేశంలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకటే మాట. బిజేపిని ఎదుర్కొనే నేత లేరా? బిజేపిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం ఎవరికీ లేదా?
దేశమంతా బిజేపి అంటే భయపడే నేతలేనా? అన్న ప్రశ్నలకు సమాధానంగా నేనున్నాను…నేను ఎదిరిస్తున్నాను. నేను అన్న ప్రశ్నలో నుంచి ఉద్భవించిన ఉద్యమ కణాన్ని, కంకణాన్ని..నిప్పుకణాన్ని, ఉద్యమ పధాన్ని, పోరాట నిర్మాణాన్ని, ప్రజాస్వామ్య ఫలాలు అందించే విజేతను అని ప్రజలందరకీ తెలిసే, నేతలందరూ గుర్తెరిగేలా మరోసారి పిడికిలి బిగించిన నేత కేసిఆర్. తెలంగాణ కోసం కొట్లాడి, సాధించి బంగారు తెలంగాణ ఆవిష్కరించి, రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన రైతు నేత కేసిఆర్. ఇప్పుడు దేశమంతా సస్యశ్యామలం చేసేందుకు రైతును సంఘటిత పర్చి, బిజేపిని ఎదుర్కొనేందుకు సిద్దమౌతున్నాడు. అందుకే దేశంలోని ప్రతిపక్షాలన్నింటీనీ ఏకం చేసే పని మొదలుపెట్టాడు. దేశంలో ఎప్పుడు రాజకీయ సంక్షోభం వచ్చినా తెలుగు నేతలు చాతుర్యం, చాణక్యం గతంలో చూపించారు. ఇప్పుడు కేసిఆర్ రూపంలో మరోసారి ప్రజాస్వామ్య పునరుద్దరణ మొదలౌతోంది. ఒకనాడు నేషనల్ ఫ్రంట్ పేరుతో ఎన్టీఆర్ దేశ రాజకీయాలను ఏకం చేశాడు. ఆ తర్వాత దేశాన్ని గాడిలో పెట్టే బాద్యత పివి. నర్సింహారావు తీసుకున్నాడు. దేశం పారిశ్రామికరంగంలో దూసుకుపోవడానికి కారణం పి.వి. అని తరతరాలు చెప్పుకునేలా చేశాడు. తన నాయకత్వ ప్రతిభను, పటిమను చూపించి, దేశానికి దారి చూపించాడు. అదే అవసరం మళ్లీ ఇప్పుడు కూడా వచ్చింది. దేశంలో బిజేపి పాలనలో ప్రజలు ఆక్రందనలు పెడుతున్నారు. ధరల మోతలను మోయలేకపోతున్నారు. పన్నుల వడ్డింపులను చెల్లించలేకపోతున్నారు. మోయలేని బారాలను మోపుతున్న బిజేపిని తగిన పాఠం చెప్పాలనుకుంటున్నా, అందుకు ముందుకు నడిచే నేత కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే కేసిఆర్ భయలుదేరాడు. దేశ గతిని మార్చే బాధ్యతలు తన భుజాల మీద వేసుకుంటున్నాడు.
దేశ రాజకీయ పార్టీలనన్నింటినీ ఏకం చేయడం అంటే ప్రజల స్వేచ్ఛకోసం, సమానత్వం కోసం, సౌభ్రతృత్వంకోసం.
అంతే గాని దిక్కుమాలిన విశ్లేషణలు చేస్తూ, రాజకీయాలను కలుషితం చేస్తోన్న సోకాల్డు మీడియా అర్ధం పర్ధం లేని రాతలు, వ్యాఖ్యలు కాదు. దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేసే బాధ్యత కేసిఆర్ తీసుకుంటే తప్పేమిటి? చినుకు చినుకు కలిస్తేనే వర్షమౌతుంది. చెరువు నిండుతుంది. వాగులు, వంకలై, నదులై సముద్రం చేరుతుంది. అడుగు , అడుగు కలిస్తేనే ప్రయాణమౌతుంది. గమ్యం చేరడానికి వీలౌతుంది. మాటా మాటా కలిస్తేన పదమౌతుంది. పలికే బావాలకు వేదికౌతుంది. అది చైతన్యమౌతుంది. ప్రేరణౌతుంది. ప్రజల మేలు కోరే వేధికౌతుంది. ఇదే కాదా? అందరూ కోరుకోవాల్సింది. కేసిఆర్ దేశంలోని ప్రతిపక్షాలకు అవసరమైనంత చేయూత నిందిస్తానన్న మాటలకు వక్ర భాష్యాలు అద్ది, వార్తలు వండి, వార్చి ప్రజల్లో అపోహలు సృష్టించడాన్ని ఏ ప్రజా స్వామ్య వాది స్వాగతించడు. అదే నిజమైతే జాతీయపార్టీలు ఆయా రాష్ట్రాలలో ఆపార్టీలకు అవసరమైన నిధుల సమీకరణ, పంపణీ మాటేమిటన్నది కూడా చర్చ జరగాల్సిన అసవరం వుంది. రాజకీయ పార్టీ అంటే నిధులు లేకుండా ప్రచారం కూడా సాగని రోజులివి. అలాంటిది నిధులు సంగతి తప్ప, విధుల సంగతి మర్చిపోయిన పార్టీలకు మీడియా వంతపాడడం అలవాటుగా మారితే, కేసిఆర్ లాంటి ప్రజా నాయకుడి సేవలను ప్రజలకు దూరం చేయడమే అవుతుంది.
కేసిఆర్ అంటే ఒక శక్తి, యుక్తి. ఆయన మాటే ఒక ఉప్పెన. ఇది గతంలో తెలంగాణలో రుజువైంది. ఇప్పుడు బిజేపితో ఢీ, అంటే ఢీ అంటుండడంతో దేశానికంతటికీ తెలిసిపోయింది. అందుకే బిజేపి భయపడుతోందనేది రాజకీయ వాదుల వాదన. పైకి చాలా మంది ఈ విషయం చెప్పలేకపోవచ్చు కాని, కేసిఆర్ తన రాజకీయ చాణక్యం చూపడం మొదలుపెడితే ఎవరి రాజకీయమైనా సరే అక్కడితో ఆగిపోవాల్సిందే..!