కేయూ ఇంజనీరింగ్ కళాశాలలో కరోనా కలకలం-శుక్రవారం పరీక్ష వాయిదా

నేటిదాత్ర కేయూ:
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు జులై 5వ తేదీ నుంచి పరీక్షలు జరుగుతున్నాయి. యూనివర్సిటీ హాస్టల్లో దాదాపు 200 మంది విద్యార్థులు వసతి తీసుకొని పరీక్షలు రాస్తున్నారు, వారిలో ఒకరు అస్వస్థతకు గురి కాగా, టెస్ట్ చేస్తే పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కోవిద్ పాజిటివ్ వచ్చిన విద్యార్థిని ఇంటికి పంపించి, హాస్టల్ డైరెక్టర్ మిగతా విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థులు అందరూ పరీక్షలను పోస్ట్పోన్ చేయాల్సిందిగా అధికారులను కోరగా శుక్రవారం జరగబోయే బీటెక్ మూడవ సంవత్సరం మొదటి సెమిస్టర్ మూడో పేపర్ పరీక్ష వాయిదా వేశారు. మిగతా పరీక్షలను సోమవారం నుండి యధావిధిగా కొనసాగించబడ్డాయనీ వాయిదా వేసిన పరీక్షను ఎప్పుడు నిర్వహించేది తర్వాత షెడ్యూల్ చేస్తామని పరీక్షల నియంత్రణ అధికారి మరియు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య మల్లారెడ్డి అదనపు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సురేఖ తెలిపారు. రోజు పరీక్ష ప్రాంగణములో మరియు వసతిగృహాలలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయాలని, బీటెక్ పరీక్షలను ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో నిర్వహించాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. గత మూడు రోజుల క్రితం జెఎన్టి యు మరియు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పరీక్షలను వాయిదా వేయాలని ఆన్లైన్లో బీటెక్ డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరడం జరిగింది.
ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, జాతీయ విద్యా సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీస్, అటానమస్ కళాశాలలు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు, కానీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఆఫ్లైన్ విధానానికి మొగ్గు చూపడం వలన విద్యార్థులు కరోనా బారినపడి ప్రాణ నష్టం జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నదని, టెక్నాలజీని ఉపయోగించుకుని విద్యార్థులకు పరీక్షలు ఆన్లైన్లో పెట్టాలని విద్యావేత్తలు, తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!