కేటిఆర్‌ వన్‌ మ్యాన్‌ షో!

`జగ్గారెడ్డికి ఝలక్..

`సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టాలు.

`కిషన్‌ రెడ్డికి కితకితలు.

`కేంద్ర ప్రభుత్వం పని తీరు మీద పంచులే పంచులే.

 `రాజాసింగ్‌ కంగుతిన్నాడు.

`శ్రీధర్‌ బాబుపై స్పాంటేనియస్‌ పంచ్‌.

`ప్రతిపక్షాల పరువు తీసి, గాలి బుడగ చేసి.

`ముప్పై నిమిషాలు కూర్చోలేరని ఈటెలపై సెటైర్‌.                                             

హైదరబాద్‌,నేటిధాత్రి:     

తెలంగాణ మున్సిపల్‌ ,ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి వన్‌మాన్‌ షో చేశారు. గతంలో ఒకసారి ఇలాగే తనదైన శైలిలో అసెంబ్లీలో తన మాటలతో ప్రతిపక్షాలకు చుక్కలు చూపించాడు. ఇప్పుడు మళ్లీ అదే పనిచేశాడు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షాలను చెడుగుడు ఆడుకున్నాడు. అదును చూసి చురకలంటించాడు. అసెంబ్లీ సమావేశాలంటే ప్రతిపక్షాల ఎమ్మెల్యేలకు ఎంత చిత్తశుద్ది వుండో సభా ముఖంగా చూపించారు. అసెంబ్లీ బిజినెస్‌ అడ్వయజరీ కమిటి( బిఎసీ) కి కాంగ్రెస్‌ పార్టీ 20 రోజులు కావాలని లేఖ రాసింది. బిజేపి పార్టీ 30 రోజులు సభ నిర్వహించాలన్నది. కాని ఆ పార్టీలకు చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో లేడని మంత్రి కేటిఆర్‌ వారి పరువు తీశాడు. ఇంతలో నేనున్నానంటూ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అనడంతో, బిజేపి నుండి సస్పెండ్‌ అయిన సంగతి మర్చిపోయినావా? అనడంతో సభ్యులందరూ గొల్లున నవ్వారు. 

ఇంతలో లేటుగా వచ్చినా, లెటెస్టుగా వచ్చానంటూ కాంగ్రెస్‌ సభ్యుడు దుద్దిళ్లశ్రీధర్‌ బాబు అనడంతో కనీసం మీరైనా వచ్చారు. వచ్చినందుకు ధన్యవాదాలు..స్వాగతం అన్నారు. దాంతో సభలో ఒక్కసారిగా నవ్వులు కురిశాయి. ప్రతిపక్షాల చిత్తుశుద్దిని మంత్రి కేటిఆర్‌ శంకించారు. పట్టు మంది పది నిమిషాలు సభలో కూర్చోలేరు. మా సభ్యులు పూర్తిగా సభలోనే వున్నారు. కాంగ్రెస్‌, బిజేపి చెందని సభ్యులు సభకే రాలేదు. ఇక వీళ్లను ప్రజల నమ్మాలి? వారి చెప్పే కాకమ్మ కధలు వినాలి? అంటూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలకు ప్రజా సమస్యలపై వున్న చిత్తశుద్ది ఏపాటిదో ఈ చిన్న సందర్భం చాలని అని ప్రతిపక్షాలను ఉతికి ఆరేశారు. ఆ తర్వాత జరిగిన ప్రశ్నోత్తరాలలో సంగారెడ్డి శాసన సభ్యుడు జగ్గారెడ్డి తన నియోజకవర్గ సమస్యలు తెలియజేస్తూ, తొలగింపబడిన హోంగార్డుల సమస్యలు ప్రస్తావించారు. ఆ సందర్భంగా మంత్రి కేటిఆర్‌ మాట్లాడుతూ బైట రాజకీయాలు ఎన్ని చేసినా,సభలో మాత్రం హుందాతనమైన చర్చ జరగాల్సిన అవసరం వుందంటూ, ప్రభుత్వం సంగారెడ్డి అభివృద్దికి చేసిన కృషిని మాత్రం జగ్గారెడ్డి ప్రస్తావించకపోవడం విడ్డూరంగా వుందన్నారు.

గతంలో సంగారెడ్డి దాకా మెట్రో కావాలని జగ్గారెడ్డి కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్నాపూర్‌ వరకు మెట్రో నిర్మాణం కోసం నిర్ణయం తీసుకున్నది. కాని జగ్గారెడ్డి ఈ విషయంలో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తారని ఆశించానన్నారు. అంతే కాకుండా సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా క్యాన్సర్‌ ట్రీట్‌ మెంటు ఇవ్వడం జరుగుతోందన్నారు. కనీసం ఈ విషయంలోనైనా జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశంసిస్తారని అనుకున్నానంటూ జగ్గారెడ్డికి రaలక్‌ ఇచ్చారు. గతంలో హోంగార్డులు పనిచేసిన వారి విషయాన్ని ప్రస్తావించిన జగ్గారెడ్డితో అసలు ప్రభుత్వం ఎలాంటి ఆర్డర్లు ఇవ్వకుండా ఎలా పనిచేయించుకున్నదని ప్రశ్నించారు. ఆనాడు ఏం చేశారని చురకలంటించారు. ఆ వివరాలు అందిస్తే పరిశీలిస్తానని చెప్పి జగ్గారెడ్డిని కూల్‌ చేశారు. ఇక ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా అంతేనని, ములుగును ఎంత అభివృద్ధి చేసినా, కనీసం కృతజ్ఞతలు తెలియజేయలేదని అన్నారు. ఈ మధ్య ములుగు వెళ్లినప్పుడు ప్రజలు ఎంతో సంతోషంగా, తెలంగాణ వచ్చిన తర్వాత ములుగు ఎంతో అభివృద్ది జరిగిందని కొనియాడారని గుర్తు చేశారు. ములుగుకు మెడికల్‌ కాలేజీ ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా కొన్ని దశాబ్ధాలుగా అపరిష్కృతంగా వున్న పోడు భూముల పట్టాలు ఇచ్చింది కూడా మేమే అన్నారు. అందులోనూ సీతక్క తల్లిదండ్రులకు కూడా పట్టాలు అందుకున్నారని, అయినా సీతక్క ప్రభుత్వం చేసే మంచి పనులు గురించి చెప్పకపోవడం విడ్డూరమన్నారు. 

ఇక కేంద్ర ప్రభుత్వం పనితీరును మంత్రి కేటిఆర్‌ తూర్పార పట్టారు. తాము హైదరాబాద్‌లో సుమారు 35 ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. ఉప్పల్‌, అంబర్‌పేట ప్రాజెక్టులపై మంత్రి కేటిఆర్‌ సెటైర్లు వేశారు. మేం మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తయ్యాయి. ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కాని బిజేపి రెండు ప్రాజెక్టులు ఏళ్లు గడుస్తున్నా నత్తనడకనే సాగుతున్నాయి. ఉప్పల్‌ కారిడార్‌ విషయంలో భూ నిర్వాసితులకు అవసరమైన రూ.190 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది. మౌలిక సదుపాయల కల్పన కోసం జిహెచ్‌ఎంసి రూ.35 కోట్ల పనులు కూడా చేపట్టింది. కాని కేంద్ర ప్రాజెక్టు ఒక అడుగు ముందుకు, పది అడుగులు వెనక్కి అన్నట్లు వుంది. ఇక కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అంబర్‌పేట ఫ్లైఓవర్‌ అక్కడే వుంది. ఆ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి పూర్తి చేస్తామని చెప్పినా వినిపించుకోలేదు. అంబర్‌ పేటలో కూడా భూ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.245 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. వరదలు వచ్చిన సమయంలో కుర్‌కురేలు పంచడం మాత్రమే తెలిసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వరల్లో బురద రాజకీయాలు చేయమంటే చేస్తారుగాని, పనులు చేయలేరు. వారి పని తీరు ఎలాంటిదో ఈ రెండు ప్రాజెక్టులను చూస్తేనే అర్ధమౌతుందన్నారు. మొత్తంగా ప్రతిపక్షాలకు ఎన్నుకున్న ప్రజల మీద ఎలాంటి గౌరవం లేదన్నారు. 

రాష్ట్రానికి ఒకరే ముఖ్యమంత్రి వుంటారు? మాకూ, మీకు వేరు వేరుగా వుండరు అంటూ శ్రీధర్‌బాబుకు మంత్రి కేటిర్‌ చురకలంటించారు. మంత్రి సమాధానం చెబుతున్న సందర్భంలో మన ముఖ్యమంత్రి అంటూ కేటిఆర్‌ చెబుతుంటే శ్రీధర్‌ బాబు మీ ముఖ్యమంత్రి అన్నారు. దాంతో స్పందించిన కేటిఆర్‌ రాష్ట్రానికి మీకైనా, మాకైన, ప్రజలందరికీ ఒకే ముఖ్యమంత్రి వుంటారని, మీ పార్టీలోలాగా పది మంది ముఖ్యమంత్రులండనడం సభలో నవ్వులు విరిశాయి. దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు నవ్వులేకుండా చేసుకున్నారు. ఇదీ అసెంబ్లీలో కేటిఆర్‌ వేసిన పంచ్‌ల పటాక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!