
9,10వ తేదీలలో జరిగే మహా పడావ్, మహాధర్నా జయప్రదం చేయండి
కార్మికులకు జిల్లా సీఐటియూ పిలుపు
బోయినిపల్లి,నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిని పల్లి మండలం కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా
9, 10వ తేదీలలో జరిగే మహా పడావ్, మహాధర్నా జయప్రదం చేయాలని
కార్మిక వర్గానికి మంగళవారం జిల్లా సీఐటియూ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
నరేంద్ర మోడీ నాయకత్వంలోని కార్పొరేట్ అనుకూల కేంద్ర బీజేపీ ప్రభుత్వం బరితెగించి ప్రజా కార్మిక వ్యతిరేక పరిపాలన సాగిస్తున్నదన్నారు. జాతీయ సహజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు అమ్మేస్తున్నదని మండి పడ్డారు. డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, ఇతర నిత్యవసరాల సరుకుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని విమర్శించారు. పార్లమెంట్లో మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలను నిరంకుశంగా ఆమోదించుకున్నప్పటికీ కార్మిక కర్షక ఉద్యమం ద్వారా చట్టాలను ఉపసంహరించుకున్నదని, అయినా 2017లో నరేంద్ర మోడీ పార్లమెంట్లో ఇచ్చిన కనీసం మద్దతు ధర హామీ నేటికీ అమలు కాలేదని
దుయ్యబట్టారు.
2023- 24 కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఆహార ఉత్పత్తులకు సబ్సిడీలకు భారీగా కోతలు విధించిందన్నారు. జిడిపిలో విద్యా రంగానికి ఆరు శాతం, వైద్య రంగానికి రెండు శాతం కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలపై ఉక్కుమాదం మోపుతూ పౌరుల ప్రాథమిక హక్కులను పాతరేస్తుందని పేర్కొన్నారు. ఉపాధి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి, అసమానతలు, ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను జటిలం చేస్తున్నదని వాపోయారు. ఈ నేపథ్యంలో 9 ఏళ్ల మోడీ ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాల నిరసిస్తూ అఖిల భారత కార్మిక సంఘాల పిలుపులో భాగంగా 9, 10 తేదీలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రంలో జరిగే మహా పడవ కార్యక్రమాన్ని కార్మిక వర్గమంతా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల, సిఐటియు కన్వీనర్ గురజాల శ్రీధర్, అక్కని పెళ్లి లక్ష్మణ్, సంతపురి సుమన్, కత్తెరపాక నరేష్, ర్యకము మల్లేశం, గొట్టే కమలాకర్, జంగం శ్రీధర్, తడగొండ బాబు, మహిళా కార్మికులు పాల్గొన్నారు.