కుత్బుల్లాపూర్ నేటిదాత్రి :
కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ అభ్యర్థిగా కే.పీ వివేకానంద గారు గురువారం ఉదయం శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించి ర్యాలీగా బయలుదేరి కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కే.పీ వివేకానంద కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి మూడోసారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.