` ఆ నలుగురు కుటుంబ సభ్యులే కాదు.. తెలంగాణ పోరాట వీరులు … ఉద్యమ సైనికులు.
` అపుడువాళ్లే …ఇప్పుడూ వాళ్లే!?
` వాళ్లు వారసులు కాదు..ఉద్యమ బాధ్యులు.
` పోరాట యోధులు..తెలంగాణ రక్షకులు.
`ఆనాడు తెలంగాణ అన్యాయం కాకుండా చూశారు.
` ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.
` ప్రగతిలో తెలంగాణ ను ఉన్నతంగా నిలబెడుతున్నారు.
` మూడు పదుల వయసులో జీవితం ఉద్యమానికి అంకితం చేశారు.
`దశాబ్ద కాలం తెలంగాణ పోరాటం చేశారు.
`ఉన్నత ఉద్యోగాలు వదిలి తెలంగాణ కోసం కొట్లాడారు.
` విలాస వంతమైన జీవితాలు కాదనుకొని తెలంగాణ పోరాటం చేశారు.
` ఏ బిజేపి నాయకుడు తెలంగాణ ఉద్యమం చేయలేదు.
` ఏ కాంగ్రెస్ నాయకుడి వారసులు పోరాటం చేయలేదు.
` కేసిఆర్ ఉద్యమం మొదలు పెట్టిన నాడు ఎవరూ కలిసి రాలేదు?
` కుటుంబ సభ్యులతో కలిసి ఉద్యమ అడుగుల వేశారు?
`ఆనాడు ఏ నాయకుడు మేమున్నామని అడుగులు వేయలేదు?
`హేళన చేశారు… రాజకీయ స్వార్థమన్నారు?
` ఇప్పుడు కుటుంబ పాలనంటున్నారు?
`తెలంగాణ తెచ్చేనాడు ఎవరూ కలిసి రాలేదు?
`ఇప్పుడు మాట్లాడుతున్న వారెవరూ తెలంగాణ కోసం కదిలిన వాళ్లు కాదు?
`బిజేపి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు?
` బిజేపి ఏ నాయకుడిది కేసిఆర్ స్థాయి కాదు?
` కేసిఆర్ రాజకీయాలతో ఎదిగిన నాయకుడు కాదు?
` తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన నాయకుడు.
` కొట్లాడి తెలంగాణ తెచ్చిన యుగపురుడు.
`తెలంగాణ ప్రజల గుండెల్లో దేవుడు.
`కేసిఆర్ తో పోల్చుకునే స్థాయి బిజేపి లో ఒక్కరికి కూడా లేదు?
`తెలంగాణ కోసం కొట్లాడిన నాడు అదే కుటుంబం…
` ఇప్పుడు తెలంగాణకు వన్నె తెచ్చింది అదే కుటుంబం.
` తెలంగాణ లో కుటుంబ పాలన కాదు.
` నరం లేని ప్రతిపక్షాల నాలుకల మాటలు తెలంగాణ ప్రజలు పట్టించుకోరు.
` తెలంగాణ పాలించే అర్హత బిజేపి కి అసలే లేదు.
`తెలంగాణ ప్రజలు బిజేపిని ఆదరించరు.
` బిజేపి మాయ మాటలు ఎవరూ నమ్మరు.
హైదరబాద్,నేటిధాత్రి:
తెలంగాణలో వున్నది కేసిఆర్ కుటుబ పాలన కాదు.. ప్రజా పాలన. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల వసుదైక పాలన. తెలంగాణలో కేసిఆర్ కుటుంబం బాగుపడిరదన్న మాటలు మాట్లాడడం అందరూ అలవాటు చేసుకున్నారు. వారితో పాటు కుటుంబ పాలన అంటూ ఇటీవల ప్రధాని మోడీ కూడా మాట్లాడడం విడ్డూరంగా వుంది. కుటుంబ పాలన అనేది ఎక్కడైనా వర్తిస్తుందేమో కాని తెలంగాణలో కాదు. ఎదుకంటే తెలంగాణ స్వయంగా ఏర్పాటైన రాష్ట్రం కాదు. అరవైఏళ్లపాటు ఇతర ప్రాంతాల పెత్తనం కింత నలిగిన ప్రాంతం. ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా వున్న ప్రాంతాన్ని సీమాంధ్రతో కలిపిన ప్రాంతం. ఆ ఉమ్మడి రాష్ట్రం నుంచి అరవైఏళ్ల పాటు అస్ధిత్వంకోసం పోరాటం చేసిన ప్రాంతం. అయినా తెలంగాణ సాధన జరగక, తెలంగాణ ఆత్మగౌరవాన్ని పొందలేక, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడలేక, నాటి పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం. అప్పుడు గతంలో ఏనాయకుడు చేయనంత సుధీర్ఘమైన పోరాటం చేసిన నాయకుడు కేసిఆర్. తెలంగాణ కోసం కేసిఆర్ తన ప్రయాణం మొదలు పెట్టిన నాడు ఎవరూ కలిసి వచ్చిన వారు కాదు. కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్ కుటుంబ సభ్యులే కొందరు ఆయనతో అడుగులు వేశారు. కాని ఏ ఒక్క బిజేపి నాయకుడు ఆనాడు జై తెలంగాణ అనలేదు. తెలంగాణ ఉద్యమం చేపట్టలేదు. తెలంగాణ వాదాన్ని పిడివాదమంటూ హేళన చేసింది కూడా బిజేపి నేతలే అన్నది మర్చిపోవద్దు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన నాటి నేతల కేసిఆర్ తెలంగాణ కోసం బయలు దేరినప్పుడు రాజకీయ స్వార్ధం అన్నారు. మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే కేసిఆర్ తెలంగాణ వాదం ఎత్తుకున్నాడన్నారు. అయినా ఎవరు ఎన్ని రకాలా మాటలు మాట్లాడినా అన్నింటినీ దిగమింగుకొని తెలంగాణ ఉద్యమం సాగించిన నాయకుడు కేసిఆర్. ఆయనకు తోడుగా వచ్చి కుటుంబం మొత్తం తెలంగాణ కోసం కొట్లాడిన చరిత్ర ఒక్క కేసిఆర్ కుటుంబానిదే. అమెరికాల విలాసవంతమైన జీవితాలు. లక్షల్లో జీతాలు వదులుకున్నారు. జీవితం సంతోషంగా గడపాల్సిన నిండా మూడు పదులు వయసులేని సమయంలో తెలంగాణ కోసం అమెరికానుంచి వచ్చిన నాయకుడు కేటిఆర్. కవిత కూడా అంతే. భూతల స్వర్గంగా చెప్పుకునే అమెరికాలో జీవితం వదులుకొని, ప్రజలు తెలంగాణ కోసం కొట్లాడుతుంటే, నేనేందుకు కొట్లాడొద్దు అని వచ్చిన ఆడపడుచు కవిత. తెలంగాణ జాగృతి కోసం తెలంగాణ వికాసం కోసం, తెలంగాణ సాధన కోసం వచ్చిన ఉద్యమం చేసిన బతుకమ్మ కవిత. ముఖ్యమంత్రి కేసిఆర్‌తో మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో మమేకమైన నాయకుడు హరీష్‌రావు. ఉద్యమ కాలం నుంచి కేసిఆర్‌తో పాటు ఉద్యమంలో బాగస్వామ్యమైన నాయకుడు సంతోష్‌రావు. వీళ్లెవరు తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్‌లోకి రాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత పదవులు అందుకోలేదు. తెలంగాణ కోసం కొట్లాడిన పోరాట యోధులు. అంతే కాదు ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి కేసిఆర్‌ది పెద్ద కుటుంబం. అయినా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఈ నలుగురు తప్ప ఉద్యమంలో కీలకం కాని ఏ బంధువునూ ప్రభుత్వంలో బాగస్వాములను చేయలేదు. ఇదీ కేసిఆర్ నిబద్దత. అసలు తెలంగాణ ప్రభుత్వాన్ని కుటుంబ పాలన అనే అర్హత బిజేపి నేతలు ఎవరికీ లేదు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు కనీసం జై కొట్టని పార్టీకి ప్రశ్నించే అర్హత లేదు. అసలు బిజేపికి తెలంగాణలో చోటే లేదు.
ఒక్కసారి జన బాహుళ్యంలోకి రండి…తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో చూడండి…వారినే నేరుగా అడగండి…వారు చెప్పింది వినండి…అంతే కాని ఏనాడైనా బిజేపి జాతీయ నాయకత్వం ప్రజలతో మమేకమైన సందర్భం వుందా?
ఎంత సేపు డిల్లీనుంచి రావడం..నాయకులు చెప్పింది వినడం. అంతే కాని నాయకులతో, కార్యకర్తలో కలిసి మాట్లాడిన సందర్భం వుందా? మాట్లాడినట్లు చరిత్ర వుందా? లేదు. కాని మేం చెపిందే నిజం…అనుకునే భ్రమలో వున్న బిజేపి ప్రజలను మాయ చేయాలని చూస్తే ఇంకా చెల్లదు. తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్య వంతులు. కనీసం మీకు మీరుగా తెలంగాణలో ఏం జరుగుతోందన్నదానిని తెలుసుకోలేకపోయినా, కనీసం కొంతమంది మేధావులు, ఇతర రాజకీయ నాయకులు చెబుతున్న మాటలైనా వినండి. అప్పుడైనా తెలంగాణ రాష్ట్రం ఎంత బాగా పురోగమిస్తోందో..తెలుస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కూడా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఏం చెప్పాడో వినండి. కనీసం అలా అయినా తెలంగాణ ఎంత వేగంగా అభివృద్ది చెందిందో తెలుస్తుంది. ఒకప్పుడు ఆంధ్రలో ఒక ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో నాలుగు ఎకరాలు కొనుగోలు చేసే పరిస్ధితి వుండేది. కాని ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం భూమి అమ్మితే ఆంధ్రప్రదేశ్‌లో 50 నుంచి 100 ఎకరాలే కాదు, అంతకన్నా ఎక్కువ కూడా కొనుక్కోవచ్చు అని సాక్ష్యాత్తు నారా చంద్రబాబు నాయుడు అన్నారంటే తెలంగాణలో భూములకు ఎంత డిమాండ్ ఏర్పడిరదో అర్ధమౌతుంది. ఒకనాడు తెలంగాణ ప్రాంతాన్ని తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేసిన వాళ్లే ఇప్పుడు తెలంగాణను చూసి అబ్బురపడుతున్నారు. ఆశ్యర్యపోతున్నారు. తెలంగాణలో వుండడానికే ఇష్టపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఎందుకు తెలంగాణ నుంచి విడిపోయామా? అని మధనపడుతున్నారు. ఇక మరో నాయకుడు లగడపాటి రాజగోపాల్. తెలంగాణకు తీవ్రంగా వ్యతిరేకించిన నాయకుల్లో కీలకమైన నాయకుడు. సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించి, సమైక్యాంధ్రకోసం ఎంతో చేసిన నాయకుడు లగడపాటి రాజగోపాల్. తెలంగాణ వస్తే జనజీవనం అస్తవ్యవస్ధమౌతుందని చెప్పిన నాయకుడు. తెలంగాణ కరువుతో అల్లాడుతుందన్నారు. ఆకలి కేకలు వినిపిస్తాయన్నాడు. కరంటు వుండదన్నాడు. ఆంధ్రప్రదేశ్ తో కలిసి లేకుంటే తెలంగాణ మనుగడ సాధ్యం కాదన్నాడు. అంతే కాదు తాను కూడా దీక్ష చేయగలనని నిమ్స్‌లో చేరాడు. రకరకాల రాజకీయ విన్యాసాలు వేశాడు. ఆఖరుకు తెలంగాణ బిల్లు ఆమోదిస్తున్న సమయంలో లోక్‌సభలో పెప్పర్ స్ప్రే చేసి, పార్లమెంటు పరవు తీశాడు. ఎంతకైనా తెగించి బిల్లు ఆపాలని ప్రయత్నించిన నాయకుడు లగడపాటి రాజగోపాల్. ఆయన కూడా తెలంగాణ ఇలా అభివృద్ది జరుగుతుందని కలలో కూడా అనుకోలేదని అంటున్నాడు. సాగు నీరు లేని తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మాణం చేయడం, రిజర్వాయర్లు కట్టడం, చెరువులు బాగు చేయడం, చెరువులు పునరుద్దరించడం, ఇరవై నాలుగు గంటలు కరంటు ఇవ్వడం , ఇంటింటికీ సురక్షితమైన మంచి నీరు అందించడం అంటే మాటలు కాదు. వాటిని ఇంత తక్కువ సమయంలో సాక్ష్యాత్కరించడం అన్నది ఎంతో చిత్తశుద్ది వుంటేనే పూర్తి చేయగలరు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌పై ప్రశంసంలు కురిపించారు. ఇక తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన అసలు నేను హైదరాబాద్‌లో వున్నానా? లేక లండన్, అమెరికాలో వున్నానా? అన్న అనుమానం కల్గిందని చెప్పారు. ఇవన్నీ ఎవరో చెప్పమంటే చెప్పిన మాటలు కాదు. వాళ్లకు వాళ్లుగా తెలంగాణ అభివృద్ధిని చూసి చెప్పిన మాటలు. అంతే కాదు మరో సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ తెలంగాణ అభివృద్దిపై ఎంతో ప్రశంసలు కురిపించారు. కేసిఆర్ లాంటి నాయకుడు దేశానికి అసవరమని అన్నారు. అరవై ఏళ్లపాటు తెలంగాణ ప్రజలు మాకు నీళ్లు కావాలంటే ఇవ్వలేదు. అసలు ప్రాజెక్టులు కట్టడం సాధ్యం కాదన్నారు. అదే ఆనాడు తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే తెలంగాణ ఏనోడో బాగు పడేది. కాని అప్పటి పాలకులు చేసిన నిర్లక్ష్యం చాల వుందని కూడా చెప్పారు. అంతే కాదు ఒక దశలో తానే స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుకి తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు పూర్తిచేస్తే బాగుంటందని సలహా ఇచ్చాను. కాని చంద్రబాబు తెలంగాణలో సాధ్యం కాదన్న కాదన్నారు. కాని ఇప్పుడెలా సాధ్యమైందంటే అది కేసిఆర్ గొప్పదనం అన్నాడు. ఇక మరో నటి లయ కూడా చాలా కాలం తర్వాత ఆమె అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్‌లో దిగిన తర్వాత నేను ఎక్కడ దిగాను అన్నంత ఆశ్చర్యపోయారట. నేను హైదరాబాద్‌కే వచ్చానా? అన్న అనుమానం కల్గిందంట. అంటే ఇంత తక్కువ సమయంలో హైదరాబాద్ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ అభివృద్ధిలో ముఖ్యమంత్రి కేసిఆర్ కు తోడుగా, నీడగా నిలిచి, రాత్రనక, పగలనక పనిచేసిన మంత్రి కేటిఆర్, మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ హరితవనం కావడంలో ఎంపి. సంతోష్ కృషి ఎంత వుందో చూస్తేనే అర్ధమౌతుంది.