అధికసంఖ్యలో పాల్గొన్న మహిళలు
పరకాల నేటిధాత్రి(టౌన్)
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో శైవక్షేత్రమైన కుంకుమేశ్వర స్వామి దేవస్థానములో శ్రావణమాసోత్సవ మహారుద్రయాగ మహోత్సవములు సోమవారం అంగరంగ వైభవంగ పండితులు కోమళ్ళపల్లి సంపత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు.నాగులపంచమీ,మొదటి సోమవారము పురస్కించుకొని
ఉదయం 4 గంటలకు సుప్రభాతసేవ,మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం,రుద్రయాగం, పుట్టలో పాలు సమర్పించుట నిర్వహించడం జరిగింది.మహిళలు భక్తిశ్రద్దలతో పుట్టలో పాలు సమర్పించారు.వచ్చిన భక్తులకు ప్రసాదవితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గందె సత్యానందం ,యర్రంరాజు,కందుకూరి శ్రీధర్ పోచుసుజాత రాజులు దర్మకర్తల మండలి ,భక్తులు ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.