మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లి గ్రామ శివారులోని మిడ్వెస్ట్ గ్రానేట్ లిమిటెడ్ కంపెనీ కార్మిక వర్గ అధ్యక్షుడు సింగని రవి ఆధ్వర్యంలో136వ మే డే సందర్బంగా ఐఎప్టియు జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బొమ్మగాని వెంకన్న మాట్లాడుతూ మేము మనుషులమే మాశక్తికి కొన్ని పరిమితులుంటాయని,రోజులో 8గంటలు మాత్రమే పని దినంగా ఉండాలని 1886 మే 1 అమెరికాలో భారీ ప్రదర్శన నిర్వహించారు, ఈ ప్రదర్శనకి మద్దతుగా నాలుగు రోజుల తర్వాత చికాగో నగరంలోని హే మార్కెట్లో భారీ ప్రదర్శన జరుగుతుండగా కార్మికులపై పోలీసులు కాల్పులు జరపిన తరుణంలో చాలామంది మరణించారని మరణించిన వారి రక్తంలో పుట్టిన ఈ అరుణాపతకాన్ని ఎత్తుకొని మరణించిన ఆ కార్మిక అమరవీరుల జ్ఞాపకార్ధంగా ప్రతి సంవత్సరం మే ఒకటో తారీఖున జెండా ఆవిష్కరించి ఆ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎండీ మధర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నీరుగర్చే ప్రయత్నం చేస్తుందని, మోడీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మాజీ అధ్యక్షులు మోడం రాజు, గుర్రాల శ్రీను,వెంకన్న,తిరుపతి,బాషా, నర్సయ్య,యాకంభ్రం తదితరులు పాల్గొన్నారు.