`మళ్ళీ ఊపందుకున్న ఫ్లెక్సీల ఏర్పాటు.
`ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా వెలుస్తున్నాయి.
`నాయకులు పోటీ పడి ఏర్పాటు చేస్తున్నారు.
`గతంలో ఎక్కడో ఒక చోటు కనిపించేవి.
`బాలానగర్ లో ఎక్కడ చూసినా కేటిఆర్ ఫ్లెక్సీలే.
`రోడ్ల మధ్య స్తంభాలపై కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు.
`హైదరాబాదు లో ఊపందుకున్న ప్రచారం.
`జిల్లాలలో కూడా ఇదే నినాదం.
`కేటిఆర్ యూత్ ఐకాన్ గా గుర్తింపుతో యువత పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు.
`ఐటి రంగ నిపుణులంతా కేటిఆర్ ను స్వాగతిస్తున్నారు.
ఎప్పటికప్పుడు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ముఖ్యమంత్రి అవుతారనే వార్తలు వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి కూడా మరీ పెరిగిపోతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ దేశ రాజకీయాల మీద దృష్టి పెట్టనున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో పార్టీ నిర్వహణ పూర్తి బాధ్యత కేటిఆర్ కు అప్పగించాలన్న డిమాండ్ తో పాటు, సిఎం ను కూడా శ్రేణులనుంచే ఉత్పన్నమౌతోంది. ఇటీవల కాలంలో మళ్ళీ ముందస్తు ఊహాగానాలు ఎన్ని వినిపించినా అవి నిజం కాకపోవచ్చు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా పలు మార్లు స్పష్టతనివ్వడం కూడా జరిగింది. కాకపోతే కేటిఆర్ ను సిఎం ఎప్పుడు చేస్తారన్నది మాత్రం ఎప్పుడూ ఎక్కడో అక్కడ చర్చ మాత్రం సాగుతూనే వుంది. గత కాలంలో వినిపిస్తూనే వుంది. ఆ మధ్య పెద్ద ఎత్తున ఈ విషయం ప్రజల్లో చర్చనీయాంశమే కాదు, నాయకుల అంగీకారం కూడా జరిగిపోయింది. కాకపోతే కేసిఆర్ ఒక సందర్భంలో చప్పున ఈ ప్రచారం ఆపాలని చెప్పారు. కానీ పార్టీలోనే కాదు, తెలంగాణ సమాజంలో ఈ చర్చకు పుల్ స్టాప్ పడలేదు. బహుషా కేటిఆర్ సిఎం అయితే తప్ప ఆగదేమో! ఇదిలా మళ్ళీ ముందస్తు విషయంలో కూడా కొన్ని వార్తలు షికారు చేశాయి. మాకు పూర్తి మెజారిటీ వుంది. పూర్తి స్థాయి సమయం అధికారంలో వుంటామని కేసిఆర్ తేల్చి చెప్పారు. కాకపోతే త్వరలోనే కేటిఆర్ ను సిఎం చేస్తారన్న నమ్మకం పార్టీ శ్రేణులలో బలంగా వుంది. అందుకే ప్రతి సారి ఈ విషయం తెరమీదకు వస్తూనే వుంది. తాజాగా కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలానగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున కాబోయే సిఎం కేటిఆర్ అని ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ మధ్య వరంగల్ లో కూడా ఇలాంటి ఫెక్సీలు వెలిశాయి. అయితే రాష్ట్రంలోని అనేక చోట్ల కేటిఆర్ ఫ్లెక్సీలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి తమ అభ్యర్థనను పార్టీ శ్రేణులు సిఎం కేసిఆర్ కు విన్నవిస్తున్నారట. వచ్చే ఎన్నికలలో కేటిఆర్ సిఎం గానే ఎన్నికల ప్రచారం చేసి, కేటిఆర్ కూడా సక్సెస్ పుల్ సిఎం అనే పేరు రావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా యువ నాయకులు ఈ ప్రతిపాదన ముందుకు తెచ్చి యువ నాయకత్వాన్ని మరింత ప్రోత్సహించేందుకు కేటిఆర్ సిఎం కావాల్సిందే అంటున్నారు. తెలంగాణ లోని ఐటి ఉద్యోగులు,నిపుణులు, ఐటి రంగం కేటిఆర్ ను సిఎం గా చూడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కేటిఆర్ సిఎం కావడం అన్నది ఎప్పుటికైనా నిజం అయ్యేదే. ఒక సమర్థవంతమైన నాయకత్వం కేటిఆర్ లో పరిపూర్ణంగా వుందని మొత్తం పార్టీ విశ్వసిస్తోంది. తెలంగాణ సమాజం కూడా నమ్ముతోందని చెప్పడంలో సందేహం లేదు.