కాంగ్రెస్‌ పాలిట భస్మాసుర హస్తం రేవంత్‌!?

`కారెక్కేందుకు కాంగ్రెస్‌ నేతల క్యూ!

`అన్ని పార్టీల నేతలు కారు వైపు పరుగులు!

`త్వరలో ఆరుగురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు?

`వారితో పాటే మరి కొంత మంది నాయకులు?

`రేవంత్‌ రూపంలో అవమానాలు.

`రేవంత్‌ పక్కన పెట్టడంపై ఆగ్రహంతో వీడుకోలు.

`బిఆర్‌ఎస్‌ లో చేరికకు అనుచరులతో మంతనాలు.

`తమకెలాంటి ప్రాధాన్యత లేదని బహిరంగ వ్యాఖ్యలు.

`బిఆర్‌ఎస్‌ వైపు వచ్చేందుకు రాయబారాలు.

`త్వరలోనే కాంగ్రెస్‌ ఖాళీ…

`కాంగ్రెస్‌ లో రేవంత్‌ మీద నమ్మకం లేదు?

`రేవంత్‌ రాజకీయంలో పావులు కావడం ఇష్టం లేదు?

`రేవంత్‌ ఒంటెద్దు పోకడలు నచ్చడం లేదు?

`ఎన్నికల నాడు టికెట్‌ వస్తుందన్న నమ్మకం అంతకన్నా లేదు.

`టికెట్‌ రాకున్నా సరే కారుతో ప్రయాణం గౌరవం!

`నాయకులు కాపాడిన పుట్టలో చేరిన రేవంత్‌?

`ప్రతిపక్షాలకు షాక్‌!

హైదరబాద్‌,నేటిధాత్రి:                                   

నిజం కాస్త కటువుగానే వుంటుంది. ఇంకా చెప్పాలంటే చాల చేదుగానే వుంటుంది. నిజానికి చేదే దివ్వమైన ఔషదం. కాని తియ్యని అబద్దమే చాలా మందికి ఇష్టం. అది విషమని తెలిసినా అదే సంతోషం. అందరూ అదే కోరుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ కూడా అదే కోరుకున్నది. కాంగ్రెస్‌ పార్టీలో నాయకులే లేరన్నట్లు , రేవంత్‌ రెడ్డిని తెచ్చిన నెత్తిన పెట్టుకున్నారు. అప్పటికీ సీనియర్లు చాలా సార్లు చెబుతూనే వున్నారు. ఇప్పటికీ మొత్తుకుంటూనే వున్నారు. ఆనాడు అధిష్టానం వినిపించుకోలేదు. ఇప్పుడు విన్నా లాభం లేదు. పుణ్య కాలం దాటి పోయింది. రేవంత్‌ రెడ్డి పిసిసి. అధ్యక్షుడైన నాటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ల నెత్తి మీద తాండవమాడుతున్నాడు? అసలు కాంగ్రెస్‌ను ఖాళీ చేసి, తెలుగుకాంగ్రెస్‌ రూపకల్పన చేస్తున్నాడు? తనదంటూ, తనకంటూ ఓ బలైన బలగాన్ని తయారు చేసుకొని, కాంగ్రెస్‌ నెత్తిన చెయ్యిపెట్టేశాడు. కాంగ్రెస్‌ పార్టీ తనకు తానుగా రేవంత్‌ రూపంలో భస్మాసు హస్తం చేసుకునేదాకా తెస్తున్నాడు. ఇది ఎవరో అంటున్న మాట కాదు..సాక్ష్యాత్తు కాంగ్రెస్‌ సీనియర్లు మధనపడుతూ చెబుతున్న మాట. ఇంత కాలం పార్టీని నమ్ముకొని,పార్టీని కాపాడుకుంటూ వస్తే రేవంత్‌ వచ్చిన తమను పూచిక పుల్లలుగా చూస్తున్నాడు. మాకు స్వాతంత్య్రం లేకుండా చేస్తున్నాడు. కేవలం తన రాజకీయం తప్ప, మరో రాజకీయం కనపడకుండా చేస్తున్నాడు. మాకు పార్టీలో స్ధానం లేకుండా చేస్తున్నాడు. మా మాటకు విలువ లేకుండా చేస్తున్నాడు. వుంటే …వుండండి? పోతే ..పొండి? అని అన్నప్పుడే అర్ధం చేసుకోవాల్సింది? రేవంత్‌రెడ్డి అన్నది అక్షరాల అసలైన సీనియర్లనే బెర్తులు సర్తుకొమ్మని చెప్పినట్లు వుంది. ఇప్పుడు వుండలేక, ఇంత కాలం ఆగి వెళ్లలేక, మరో ప్రత్నామ్నాయం చూసుకోలేక, మౌన రోధన మాకు మిగులుతుందని అంటున్నారు. కనిపించిన వారితో వారి గోడు వెళ్లబోసుకుంటున్నారు. వారి రోధన అధిష్టానం తప్ప, అందరూ వింటున్నారు. రేవంత్‌ మాయలో పడి పార్టీని సర్వనాశనం చేస్తున్నా అధిష్టానం చూస్తూ ఊరుకుంటోంది. నిజం తెలుసుకోలేకపోతోంది. ఇప్పటికే రెండు సార్లు పార్టీ అధికారంలో లేకుండాపోయింది. ఈసారి కూడా గెలవకపోతే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పరిస్థితే తెలంగాణలో కనిపించడం ఖాయమంటున్నారు. అప్పుడు ఈ రేవంత్‌ రెడ్డి కూడా పార్టీలో వుండడు. మళ్లీ మేమే దిక్కవుతాం…కాకపోతే మళ్లీ పార్టీని పట్టుకొని వేలాడుతుంటాం…అంటున్నారు. దీనంతటికీ కారణం కేవలం రెవంత్‌రెడ్డి అన్నదే అందరూ అనే మాట… లోలోన రగులుతూ చెబుతున్న మాట. 

ఉన్న ఫలంగా అందలమెక్కాలి. ఉన్నతమైన పదవులు పొందాలి. రాజకీయాల్లో రాణించాలి. 

ఒక్కసారే ఉన్నతమైన స్ధానంలో కనిపించాలి. ఇది ఆశ..అత్యాశ ఏదైనా కావొచ్చు రాజకీయాల్లో మాత్రం సాధ్యమే…కాని అందరికీ కాదు…కొన్నిసార్లు ప్రతి క్షణం కలిసివచ్చినట్లే కనిపిస్తుంది. అదృష్టం వరించినట్లే వరిస్తుంది. అంతలోనే ఆశలు అడియాసలు చేస్తుంది…ఎన్ని సార్లు ప్రయత్నించినా అడుగులు పడ్డెట్టే పడుతుంటాయి. ముందుకు వెళ్లినట్లే వుంటుంది. కాని అక్కడే వుంటారు. పదవులొచ్చిన సంతోషం సగమే…ఉన్నతంగా వున్నట్లనిపించినా ఆశనిపాతమే..! ఒకడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కి పడుతుంటాయి. కోర్కెలు పెరుగుతూనే వుంటాయి. అవకాశాలు అందుతున్నట్లే కనిపిస్తుంటాయి. కాని అందనంత దూరం వెళ్లిపోతుంటాయి. నిజానికి రేవంత్‌రెడ్డికి రాజకీయాల్లో తనకు తాను పదవులు అందుకోవచ్చేమో కాని, ఆయన చేతిలో పార్టీకి మేలు జరిగిందేమీ లేదు. ఎందుకంటే ఆయన మొదట బిజేపి విద్యార్ధి విభాగమైన ఏబివిపితో రాజకీయం మొదలుపెట్టారు. ఇంతలో వచ్చిన తెలంగాణరాష్ట్ర సమితిలో చేరారు. కాని పార్టీలో జెడ్పీటీసి టిక్కెట్‌ ఇవ్వలేదు. దాంతో ఇండిపెండెంటుగా గెలుపొందాడు. అప్పుడు తెలుగుదేశంలో చేరాడు. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఇదే సమయంలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంటుగా పోటీ చేసి గెలుపొందాడు. ఇదంతా 2005 తర్వాత జరిగిన సంగతి. అయితే 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎలాగైనా గెలవాలన్న కసితో వున్న తెలుగుదేశం పార్టీ, జూనియర్‌ ఎన్టీఆర్‌ను రంగంలోకి దింపింది. ఆయనకు సలహాదారుడి బాధ్యతలు రేవంత్‌కు అప్పగించారు. ఇంకేముంది తెలుగుదేశం పార్టీ కథ మళ్లీ మొదటికొచ్చింది. జూనియర్‌ ఎన్టీఆర్‌కు ప్రమాదం జరిగింది. తెలుగుదేశంపార్టీ మళ్లీ ఓడిపోయింది. ఇంతలో తెలంగాణ వచ్చింది. తెలుగుదేశం పార్టీ అంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలన్న దుర్భుద్ది చంద్రబాబుకు పుట్టింది. రేవంత్‌ సహాకారంలో ఆపరేషన్‌ మొదలైంది. పదవి కోసం బిఆర్‌ఎస్‌లో చేరిన రేవంత్‌కు తెలంగాణ ఉద్యమం మీద ఆసక్తి లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మీద మమకారం లేదు. తెలంగాణను అస్ధిరపర్చాలి. చంద్రబాబు కుట్రలో భాగం కావాలి. కేవలం తన రాజకీయ జీవితం ఎదగాలి. ఇంతకు మించి తెలంగాణ మీద, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ మీద ప్రేమ లేదు? గౌరవం లేదు? వుంటే తెలంగాణను అస్ధిరపర్చాలన్న దుర్బిద్దికి సహాయమే చేసేవాడు కాదు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తల్చినట్లు తెలంగాణతో పెట్టుకున్న చంద్రబాబు బాగుపడిరదేనాడు లేదు. ఆయన బాటలో నడిచిన రేవంత్‌ అందలం చూసేది లేదు. 

ఇదిలా వుంటే కాంగ్రెస్‌ పార్టీని కలగాబులగం చేసి, ఆ పార్టీ నాయకుల్లో నాయకులకే తగువులు పెట్టి, కొత్తవారిని తెచ్చిన వారికి పోటీ తెచ్చి, చిందరవందర రాజకీయం చేస్తున్నాడు. కాంగ్రెస్‌ను కూకటి వేళ్లతో పెకిలించే కుట్ర చేస్తున్నాడు. ఇదీ అసలైన కాంగ్రెస్‌ నేతల వాదన. ఎందుకంటే మచ్చుకు కొన్ని నియోజకవర్గాలలో పరిస్ధితులు చూద్దాం. హన్మకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లు ఇద్దరు టిక్కెట్‌ కోసం రేసులో వున్నారు. వారికి పోటీగా మరో నాయకుడిని తెచ్చిపెట్టేశాడు. నాయని రవీందర్‌రెడ్డి గత కొన్ని దశాబ్ధాలుగా ఆ స్ధానం కోసం పోటీ పడుతున్నాడు. ఓడిపోతున్నాడు. ఆ స్ధానం కోసం జంగారాఘవరెడ్డి కూడా ఆశపడుతున్నాడు. వీరిద్దరిలో ఎవరికో ఒకరికి నచ్చజెప్పాల్సిందిపోయి, వేం నరేందర్‌రెడ్డిని తెచ్చి పొగరాజేశాడు. వేం నరేందర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ పూర్వ నాయకుడు. ఆయనను తెచ్చి పైలాపచ్చీసాట రేవంత్‌ మొదలుపెట్టారు. ఇక వరంగల్‌లో కొ ండా సురేఖకు టిక్కెట్‌ అని ఇప్పటి వరకు అందరూ అనుకున్నారు. అనుకోండా ఎర్రబెల్లి స్వర్ణను తెరమీదకు తెచ్చిపెట్టాడు. ఈ రెండు వర్గాలు టికెట్‌ నాదంటే, నాదే అనుకుంటూ నిత్యం ఘర్షనలకు దిగేలా చేశాడు. పాలకుర్తి నియోజవర్గం ఎప్పటినుంచో జంగారాఘవరెడ్డి కోరుకుంటున్నాడు. గత ఎన్నికల్లో పోటీ చేశాడు. ఆయనను పక్కకు తప్పించేశాడు. రేవంత్‌ పాదయాత్ర చేసిన సందర్భంలో లక్ష్మినారాయణ నాయక్‌కు మాటిచ్చాడు. రాజకీయ నాయకుల మాటలు నీటి మీద రాతలని ఇందుకే అంటారు. లక్ష్మినారాయణ నాయక్‌ రేవంత్‌ పాదయాత్ర సమయంలో పెద్ద ఎత్తున ఖర్చు చేశాడు. సభ నిర్వహించాడు. తాజాగా పాలకుర్తిలో రaాన్సిరెడ్డిని రంగంలోకి దింపాడు. ఆమెకైనా ఆఖరుకు టిక్కెట్‌ ఇస్తాడా? లేడా అన్నది ఇప్పుడే చెప్పలేం? జనగామ నియోజకవర్గంలో మొదటినుంచి పొన్నాల ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు. గత రెండు ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు. కాకపోతే పిసిసి. అధ్యక్షుడుగా పనిచేసిన నాయకుడు. 2014 ఎన్నికలు తన భుజాల మీద వేసుకొని నడిపిన నాయకుడు. అందరికీ భిఫామ్‌లు ఇచ్చిన నేత. ఆయనకే గత ఎన్నికల్లో టికెట్‌ కష్టమైంది. ఈ సీటు కావాలని అనుకున్న జంఘారాఘవరెడ్డికి మాజీ పిసిసి. అధ్యక్షుడు ఉత్తమ్‌ మాటిచ్చారు. రేవంత్‌రెడ్డి వచ్చి పక్కకు తప్పించాడు. కొత్తగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని తెచ్చిపెట్టాడు. జనగామ కాంగ్రెస్‌ రాజకీయాలను ఆగమాగం చేశాడు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో విజయారెడ్డికి సీటు నీదే అన్నాడు. కొంత కాలానికి రోహన్‌రెడ్డిని తెచ్చిపెట్టాడు. ఇప్పుడు రాజూ యాదవ్‌కు నీకే టికెట్‌ అంటున్నాడట? ఇలా తెలంగాణ వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో రేవంత్‌ ఆడుతున్న ఆట ఇదే…ఇది కొన్ని మచ్చుకే…! అందుకే కాంగ్రెస్‌ సీనియర్లు నెత్తినోరు, కొట్టుకొని చెబుతున్నది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *