ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలు యాదవ్
చేర్యాల నేటిధాత్రి…
కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సభలో గ్యారెంటీ పథకాలు అని ప్రవేశపెట్టిన పథకాలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎలాంటి పథకాలు అమలు చేయకుండా తెలంగాణ కు వచ్చి అమలు చేస్తాం చెప్తే ప్రజలు నవ్వుతున్నారు అని ఎద్దేవా చేశారు, మీరు అధికారంలో ఉన్న రాజస్థాన్,మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్ ను నిలదీశారు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు తెలంగాణ అభివృద్ధి కి సహకరించడం లేదు అని అన్నారు, మోదీ తెలంగాణ విభజనను అవమానించడం సరికాదు అని అన్నారు, నాడు ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడ తీర్మానం ను తుంగలో తొక్కిన బిజెపి నేడు తెలంగాణ ను అవమానిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు అని నిలదీశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ధ్యేయంగా పనిచేసి రాష్ట్రాన్నీ సాధించి అభివృద్ధిలో కూడా ముందు వరుసలో నడిపిస్తూ ప్రజల అభిమానాన్ని పొందిన బిఅరెస్ పార్టీ ముచ్చటగా మూడోసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోశ్యం చెప్పారు