‘‘కళ్లలో’’ వున్న ‘‘కుళ్లును’’ కాళేశ్వరం నీళ్లతో ‘‘కడుక్కోండి’’?

 

`కళ్లున్నా నీళ్లను చూడలేని కబోదులు…ప్రతిపక్షాలు!

`కళ్లు తెరిచి చూడండి.. పారుతున్న నీళ్లను మొక్కండి!

` తెలంగాణలో ప్రగతి పరవళ్లు. నేలతల్లి జలకాలు.

`నీళ్లు లేకుంటే ఈ పంటెక్కడిది?

`పాలమూరు ఎలా పచ్చబడ్డది?

` పాలమూరులో సిరుల పంటలు ఎలా పండుతున్నాయి?

` చెరువులెలా నిండుతున్నాయి?

` మిషన్‌ భగీరథ నీళ్లెలా వస్తున్నాయి?

` రిజర్వాయర్లు ఎలా కళకళలాడుతున్నాయి?

` 65 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నుల దిగుబడి ఎలా సాధ్యమౌతోంది?

` కొత్తగా ఎనభై లక్షల ఎకరాల సాగు పెరగలేదా?

` తెలంగాణలో పారుతున్న కాలువలు కనిపచడం లేదా?

` పచ్చని పొలాలు నిజం కాదా?

` చెరువుల్లో మత్స్య సంపద చూడడం లేదా?

` తెలంగాణ నుంచి చేపలు ఎగుమతి కావడం లేదా?

` ఇరవై నాలుగు గంటల కరంటు అందడం లేదా?

` భూగర్భ జలాలు పెరిగి ఫ్లోరైడ్‌ పారిపోలేదా?

 హైదరబాద్‌,నేటిధాత్రి:                                     

నిజం చెప్పడానికి దమ్ముండాలి. ధైర్యముండాలి. అబద్దం చెప్పడానికి ఇవేవీ అవసరం లేదు. నోరుంటే చాలు. మోసపూరితమైన మనసుంటే చాలు. మభ్యపెట్టే గుణముంటే చాలు. కాని నిజం మాట్లాడాలంటే కూడా మంచి తనం వుండాలి. మంచి గుణం కూడా కావాలి. అవేవీ ప్రతిపక్షాలలో లేవు. ప్రతిపక్షాలు నిజాలు చూడలేవు. నిజాలు వినలేవు. నిజాలు మాట్లాడలేవు. దేశమంతా తెలంగాణ వెలుగులను చూసి ఆశ్యర్యపోతోంది. సంబరపడుతోంది. తొమ్మిదేళ్లలో జరిగిన సర్వతోముఖాభివృద్దిని చూసి అబ్బురపడుతోంది. మా రాష్ట్రాలు కూడా తెలంగాణలాగా అభివృద్ది చెందితే బాగుండు అని వివిధ రాష్ట్రాల ప్రజలు ఆశపడుతున్నారు. తెలంగాణ ప్రజలు గర్వపడుతున్నారు. సంతోషపడుతున్నారు. ప్రతిపక్షాలకు మాత్రం తెలంగాణ అభివృద్ధి కళ్లముందు కనిపిస్తున్నా చూడలేకపోతున్నారు. తెలంగాణ అభివృద్ధి కావడం వాళ్లకు గిట్టడం లేదు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు ఎప్పుడూ ఇబ్బందుల్లో వుండాలి. కష్టాలలో వుండాలి. అనే కోరుకుంటున్నాయి. తెలంగాణ బాగు పడుతుంటే కాంగ్రెస్‌, బిజేపి నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. మాకు ఇక భవిష్యత్తులో అధికారం రాదన్న అక్కసుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నిత్యం పనికి రాని వాదనలు ముందేసుకుంటున్నారు. అసలు సమస్యలు పక్కదోవ పట్టిస్తూ, పొద్దుపుచ్చకుంటున్నారు. అదికారం కోసూం గోతి కాడ ఎదరుచూసినట్లు చూస్తున్నారు. ప్రజలు బాగు పడుతుంటే చూడలేకపోతున్నారు. ప్రజలు గతంలో పడిన గోసను గుర్తు చేసుకొని, ఇప్పుడు తెలంగాణ అభివృద్దిని చూసి మురిసిపోతుంటే, ప్రతిపక్షాలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాయి. ఇంత సత్వర తెలంగాణ అభివృద్ది ప్రతిపక్షాలకు కళ్ల కనిపించడం లేదా? తెలంగాణలో ప్రతి మూలలో పారుతున్న నీళ్లు కనిపించడంలేదా? ఒకనాడు ఎండిన బీడులన్నీ పొలాలుగా మారి సిరుల పంటలు పండిస్తుంటే కనిపించడం లేదా? తెలంగాణలో వెల్లివిరిస్తున్న పచ్చదనం కనిపించడం లేదా? భూగర్భజలాలు పెరిగి, అటు చెరువులు నిండి, బావులు, బోర్లలో ఎండ కాలంలో కూడా పొలాలకు నీళ్లందుతుంటే కనిపించడం లేదా? ప్రతిపక్షాలలో రైతులు లేరా? వాళ్లకు పొలాలు లేవా? ఆయా పార్టీల నాయకులు సాగు చేయడం లేదా? రైతు బంధు పొందడం లేదా? ఒకనాడు పడావు బడ్డ భూములన్నీ కళకళలాడం లేదా? సాగు మా వల్ల కాదని, ఊళ్లలో వుంటే బతకలేమని పదుల ఎకరాలు వున్న రైతులు కూడా పట్టణాలకు వలసలు పోయిన బతికిన రోజులు గుర్తులేదా? ఆనాడు వలసలు పోయిన ప్రజలు మళ్లీ పల్లెలు బంగారు పంటలు పండిస్తూ, రైతే రాజు అన్న నానుడిని నిజం చేయడం లేదా? తెలంగాణ రైతన్న కాలు మీద కాలేసుకొని బతకడం లేదా? ఆఖరుకు అకాల వర్షాలకు ధాన్యం తడిసినా, ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన సందర్భం ఎప్పుడైనా చూశామా? ఇన్ని మంచి పనులు మన కళ్లముందు కనిపిస్తుంటే కళ్లుండి చూడలేని ప్రతిపక్షాలను ప్రజలు కూడా ఏవగించుకుంటున్నారు. అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ కళ్లలో వున్న కుళ్లును కాళేశ్వరం నీళ్లతో కడుక్కొని పారుతున్న తెలంగాణ గంగమ్మ తల్లికి దండం పెట్టుకోవాలి. తప్పుడు మాటలు మాట్లాడమని వారి నోళ్లు శుభ్రం చేసుకోవాలి. వారిలో అణువణువూ ఆహించిన అహాన్ని ఆ నీటిని తాగి పోగొట్టుకోవాలి. పారుతున్న జలంలో చేస్తున్న నిందలు వదిలేసి, ఒళ్లంతా కడుక్కోవాలి. తప్పైందని లేంపలేసుకోవాలి. తెలంగాణలో నీటి సిరులకు కారణమైన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఎవరైనా జేజేలు పలకాలంటున్న ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్‌ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్న తెలంగాణ అభివృద్ధి విశేషాలు… ఆయన మాటల్లోనే…

అసలు కలగన్నామా? తెలంగాణ వస్తుందని ఊహించామా? అరవైఏళ్ల నిర్లక్ష్యాన్ని అనుభవించాం.

 నీరు లేకున్నా కన్నీళ్ల సాగు చేశాం. కరంటు లేక పంటలు ఎండుతున్నా కన్నీళ్లను దిగమింగుకున్నాం. ఎప్పుడొస్తుందో..ఎప్పుడు పోతుందో తెలియని కరంటుకు చార్జీలు చెల్లించాం. ఎప్పటికిప్పుడు ఎంత పెంచినా, నోరు మెదపకుండా బిల్లులు కట్టుకున్నాం. ఎండిన పంటలు చూసి కుమిలి ఏడ్చాం. ఆ గోసలన్నీ పోయాయి. ఇప్పుడు ఆకుపచ్చ తెలంగాణ ఆవిషృతమైంది. తెలంగాణ కోసం పద్నాలుగేళ్ల పాటు సుధీర్ఘ పోరాటం చేసి, తెలంగాణ సాధించిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణను అభివృద్ధి నమూనాగా మార్చిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ గోస చూసి చలించిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ తెచ్చి గోస తీర్చిన నాయకుడు కేసిఆర్‌. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా..ఇదే సత్యం…ఇదే నిత్యం..అసలు పదేళ్ల కిందట తెలంగాణ ఎలా వుంది? ఇప్పుడు ఎలా వుంది? అన్నది ప్రతిపక్షాలకు తెలియందా? సరిగ్గా 2014లో తెలంగాణ వచ్చే నాటికి పండిన పంటలకు, ఇప్పుడు పండుతున్న పంటలు ఎన్ని రెట్లు పెరిగాయో! ప్రతిపక్షాలు చూడడం లేదా? ఆనాడు పండిన పంటలకు 70లక్షల టన్నులు మాత్రమే. మరి నేడు 3కోట్ల టన్నులకు పైగా వరి పండుతోంది. దానికి తోడు ఆరు తడి పంటలు పండుతున్నాయి. మొక్క జొన్న పండుతోంది. పప్పు దినుసలు పండుతున్నాయి. ఫామ్‌ ఆయిల్‌ సాగౌతోంది. ఇవన్నీ నీటి వసతులు కల్పించడం మూలంగా పంటలు సాగౌతున్నాయా? లేదా? అన్నది ప్రతిపక్షాలకు తెలియదా? ప్రతిపక్షాల నాయకులు రైతు బంధు తీసుకోవడం లేదా? నీటి సౌలత్‌ అందుకోవడం లేదా? వాళ్ల ఊర్లలో చెరువులు నిండిరది కనిపించడం లేదా? వాల్ల పొలాలకు నీళ్లు రాకుండానే సాగు చేస్తున్నారా? వాళ్ల ఊరి చెరువులో గతంలో నీటి చుక్క జాడ లేని రోజులే ఎక్కువ. అందులోనూ కాంగ్రెస్‌పార్టీ నేతలదే పాలన. మరి అప్పుడు చెరువుల్లో నీళ్లెందుకు లేవు?నేడు చెరువుల నిండా నీళ్లెందుకున్నాయి. ఆ చెరువుల్లో ఎప్పుడైనా చేపలు చూసిన చరిత్ర వుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ మత్స్య సంపదనను తెలంగాణ ఎందుకు మించిపోయింది? ఒకప్పుడు తెలంగాణకు ఆంధ్రనుంచి చేపలు వచ్చేవి. ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చేపలు సరఫరా చేస్తున్నారు. తెలంగాణలో సంపద సృష్టి ప్రతిపక్షాలకు కనిపించదు. పెరిగిన మత్స్య సంపద చూడలేరు. కాని ఇంటికి కొనుక్కెళ్లి తింటున్నారు. ఇదీ ప్రతిపక్షాల తీరు. 

  ప్రపంచంలోనే అతి పెద్ద బహులార్ధక ఎత్తిపోతల పధకం కాళేశ్వరం. 

ఇది మొత్తంగా కేవలం రాష్ట్ర ప్రభుత్వంచే నిర్మాణం చేయబడిన ప్రాజెక్టు. కేంద్రాన్ని ఎన్ని సార్లు కోరినా, రూపాయి సాయం చేయలేదు. పైగా తెలంగాణ రావడమే ఇష్టంలేని ప్రధాని మోడీ, తెలంగాణకు సాయం చేస్తాడని ఆశించలేదు. తెలంగాణ అంటేనే కళ్లలో నిప్పులు పోసుకునే బిజేపి పెద్దలకు తెలంగాణ అభివృద్దిని కోరుకుంటారా? అసలు తెలంగాణను నిధుల విషయంలో అన్యాయం చేస్తూ వున్నా, తెలంగాణ ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలబడేలా చేసిన ఘనత ఒక్క కేసిఆర్‌కే దక్కుతుంది. చరిత్రలో కేసిఆర్‌ లాంటి నాయకుడు మరొకరు కనిపించరు. ఎందుకంటే తన పుట్టిన నేల రుణంతీర్చుకున్న నాయకుడు కేసిఆర్‌. అలాంటి యుగపురుషుడు, త్యాగధనుడు, ఉద్యమ కారుడు ప్రపంచ చరిత్రలోనే లేరు. అంత గొప్ప నాయకుడి పాలనలో తెలంగాణ అన్ని రంగాలలో పరుగులు పెడుతుంది. తొమ్మిదేళ్లలో సర్వతోముఖాభివృద్ధి సాధించింది. ఏ రంగంలో చూసినా అన్ని విజయాలే. చిగురించిన ఆశలను ఆశయ ఫలాలుగా మార్చి ప్రజలకు అందించిన గొప్ప దార్శనికుడు కేసిఆర్‌. అలాంటి కేసిఆర్‌ పాలనను తెలంగాణ ప్రజలు ఎప్పుడూ వదులుకోరు. అధికారంలో వున్న నాడు తెలంగాణ కోసం పట్టించుకోలని కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు ఆదరించరు. తెలంగాణకు సాయం చేసే స్ధానంలో వుండి కూడా తెలంగాణ ఏర్పాటును ఇప్పటికీ నిందిస్తూ, తెలంగాణపై విషయం కక్కుతూ, తెలంగాణలో పాలన కోసం అర్రులు చాచే బిజేపిని ప్రజలు ఎప్పుడూ దరి చేరనివ్వరు. ఆ పార్టీకి చోటే కల్పించరు. తెలంగాణ అంటే కేసిఆర్‌. కేసిఆర్‌ అంటే తెలంగాణ. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ తప్ప మరోపార్టీకి తావులేదు. ఆ పార్టీల జెండాలకు చోటు లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!