కలవని చేతులు!?

` ఆ చేతులు కలిసినా దూరమే! కలవకపోయినా భారమే!!

`అయినా మారరు? పార్టీ అధికారంలోకి రాదు?

`అధికారంలోకి తేవాలన్న సోయి ఎవరికీ లేదు?

` పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం వారికే లేదు?

`చిత్తశుద్ధి ఎవరిలో లేదు?

`పగటి కలలకు మాత్రం కొదువలేదు?

`అందరూ సిఎం లే? పని మంతుడు ఒక్కడూ లే!?

`ఇలాగే కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఎంటర్టైన్‌ చేయండి?

`దళిత ముఖ్యమంత్రి పేరుతో కొత్త పంచాయతి.

`ఉట్టికెగరలేని నేతలు కాచుతున్న నెయ్యి?

`నిజంగా దళితుడిని సిఎం చేయాలన్న ఆలోచన వుందా?

` రేవంత్‌ ను దెబ్బతీయడమే లక్ష్యమా?

`కాళ్లల్లో కట్టెలు పెట్టుకోవడం ఆపరా?

`కోమటి రెడ్డి రూపంలో ఎప్పుడూ కొత్త పంచాయతీయే!

`తమ్ముడు కాంగ్రెస్‌ లో వున్నంత అదే పని?

`ఆది నుంచి అన్నది అదే దోరణి?

`కొత్త కొర్రాయి తెచ్చి మంట పెట్టడమంటే ఇదే?

`పార్టీని రెండు వర్గాలుగా చీల్చే కుట్రలో భాగం?

`సాటి నాయకుడు అద్దంకిని దూషించినప్పుడు ఆ గౌరవం ఎటు పోయింది?

`ముందైతే పార్టీలో కలిసికట్టుగా పని చేయండి?

`రాష్ట్ర నాయకుల చేతిలో లేని అధికారం గురించి లొల్లెందుకు?

`ఎన్నికలు దగ్గరకొస్తున్నా నేతలది ఎడమొహం…పెడమొహమే?

`మారితే మీరు కాంగ్రెస్‌ నేతలెలా అవుతారు?

హైదరబాద్‌,నేటిధాత్రి:

దేశంలో ఎన్ని పార్టీలలో మార్పులు వచ్చినా కాంగ్రెస్‌లో మార్పు రాదు. అంతర్గత సమస్యలు తీరిపోవు. ఎవరికి వారే యమునా తీరే అన్నది ఆగిపోదు. అందరూ రాజులే ఆ పార్టీలో..అందుకే తెల్లారిలేస్త కయ్యాలే తప్ప,కలుపుగోలు తనాలు కనిపించవు. సఖ్యతకు తావు లేదు. కేంద్రంలో ఎటూకాని పరిస్ధితుల్లో కొట్టుమిట్టాడుతున్నా, రాష్ట్రాలలోనన్నా దారిలో వుందా? అదీ లేదు. ఇప్పటికే మెజార్టీ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కనుమరుగైపోయింది. కోలుకుంటుందన్న నమ్మకం లేదు. కోలుకోవాలన్న సోయి నాయకులకు లేదు. తెలంగాణలో మాత్రం ఇతర రాష్ట్రాలకన్నా మెరుగైన పరిస్ధితుల్లో పార్టీ వున్నప్పటికీ నాయకులే అగాధం సృష్టించుకుంటున్నారు. వారి మధ్య అంతర్గత విభేదాలు పార్టీని నిండా ముంచేస్తున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీకి మరిన్ని గడ్డు పరిస్దితులు వచ్చి పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు కోలుకోవడం లేదు. కోలుకుంటుందన్న నమ్మకం లేదు. కాని తెలంగాణలో కాంగ్రెస్‌ బలంగానేవుంది. అయినా ఆ పార్టీ నేతల్లో సఖ్యత లేకపోవడం వల్ల క్యాడర్‌ అయోమయంలో వుంది. మేమంతా కలిసి గెలిపిస్తామని క్యాడర్‌ చెబుతున్నా, లీడర్లకు మధ్య సానుకూలత లేదు. నాయకత్వపోరు ఆగడం లేదు. ముఖ్యంగా పిపిసి. అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ బలపడిరదో..మరింత బలహీనపడిరదో ఎవరికీ అర్ధం కాకుండాపోయింది. పార్టీ బాగా బలపడిరదా? అంటే ఈమధ్య జరిగిన ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ తన పాత్రను పెద్దగా పోషించింది లేదు. డిపాజిట్లు కూడా రానంత దుస్ధితిని ఎదుర్కొంటోంది. బలహీనపడిరదా? అంటే రేవంత్‌ రెడ్డి వచ్చిన తర్వాత జోష్‌ పెరిందనే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వరసగా రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో సభలు,సమావేశాలు సాగుతున్నాయి. సమస్యల మీద స్పందన కనిపిస్తోంది. ఉద్యమాలు సాగుతున్నాయి. పోరాటాలు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డ పాదయాత్ర చేస్తున్నారు. అది సాగుతుండగానే సిఎల్పీ నాయకుడు మల్లు భట్టివిక్రమార్క కూడా పాదయాత్ర సాగిస్తున్నారు. ఇది ఎవరు కాదన్నా,ఔనన్నా పిపిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి పోటీగా సాగుతున్న పాదయాత్రే అన్నది అందరూ చెప్పుకుంటున్న మాట. పాదయాత్రలకు ఇటీవల శ్రీకారం చుట్టింది తెలంగాణలో అంటే రేవంత్‌రెడ్డి అని చెప్పకతప్పదు. ఎందుకంటే ఆ పార్టీలో పెద్దఎత్తున ఆయన యాత్ర చేపట్టిన తర్వాతే తమెక్కడ వెనుకబడి పోతామో? అన్న ఆందోళనతో మిగతా నాయకులు కూడా కొద్దో గొప్పో యాత్రలకు శ్రీకారం చుట్టారు. ఇదంతా బాగానే వుంది కాని నేతల మధ్య దూరం తగ్గడం లేదు. వారి చేతులు కలవడం లేదు. 

కొత్తగా దళిత ముఖ్యమంత్రి నినాదం కాంగ్రెస్‌లో తెరమీదకు వచ్చింది.

 దీనికి పార్టీ అధిష్టానం నుంచి సంకేతాలు వున్నాయా? లేదా? అన్నదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. కాకపోతే భువనగిరి ఎంపి. వెంకటరెడ్డి తన మీద వస్తున్న విమర్శలనుంచి దృష్టి మళ్లించేందుకు మల్లు భట్టివిక్రమార్క యాత్ర సందర్భంగా దళిత ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. భువనగిరి ఎంపి. కోమటిరెడ్డి ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఎవరికీ అర్ధం కాదు. నిజానికి మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర మొదలు పెట్టిన నాడు ఆయనకు మద్దతు పలికి పాదయాత్రలో కూడా వెంకటరెడ్డి పాల్గొన్నారు. తర్వాత ఆయన కొంత కాలం పార్టీకి దూరంగా వుంటూ వచ్చారు. ఓ వారం రోజుల క్రితం వెంకటరెడ్డి కాంగ్రెస్‌ను వీడుతున్నారంటూ కొన్ని వార్తలు పుకార్లు షికార్లు చేశాయి. పైగా ఆయన కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా జోరుగా ప్రచారం సాగింది. కాని వాటిని వెంకటరెడ్డి ఖండిరచారు. తాను కాంగ్రెస్‌లోనే వున్నానని ప్రకటించారు. దానికి బలం చేకూరాలంటే భట్టి పాదయాత్రలో కనిపించారు. కాంగ్రెస్‌సభకు హజరయ్యారు. పనిలో పనిగా కాంగ్రెస్‌ గెలిస్తే దళిత ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ ముందు డిమాండ్‌ వుంచారు. అంటే ఒక వేళ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఇప్పటినుంచే మోకాలడ్డే పనిని వెంకటరెడ్డి మొదలుపెట్టారని చెప్పాలి. ఆలు లేదు..చూలు లేదన్న సామెతను కాంగ్రెస్‌ నాయకులు గుర్తు చేస్తున్నారు.  

కాంగ్రెస్‌లో ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించే సంప్రదాయం ఎప్పుడూ లేదు.

ఎన్నికల్లో పార్టీ గెలిచిన తర్వాత పార్టీ కేంద్ర నాయకత్వం పంపే సీల్డ్‌ కవర్‌ ను బట్టి సిఎల్పీ నాయకుడిని ఎంపిక జరుగుతుంది. 2004 ఎన్నికలకు ముందు రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసినా, ఎన్నికల ముందు ఆయన పేరు ప్రకటించలేదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాతనే ఆయన పేరు ప్రతిపాదించారు. ముఖమంత్రిని చేశారు. అయితే అప్పటి పరిస్ధితి వేరు..ఇప్పటి పరిస్ధితి వేరు. అప్పుడు పిసిసి. అధ్యక్షుడుగా వున్న డి. శ్రీనివాస్‌ కంటే సిఎల్పీ నాయకుడు వైఎస్‌ పవర్‌ఫుల్‌ నాయకుడు. అందువల్ల 2004 ఎన్నికల ఫలితాల తర్వాత పిపిసి. అధ్యక్షుడిని కాదని సిఎల్సీ నేతైన రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. అయితే 1989 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో పిపిసి. అధ్యక్షుడుగా వున్న మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రినిచేశారు. అంటే ఆనాడు పిపిసి. అధ్యక్షుడుగా వున్న మర్రి చెన్నారెడ్డి పవర్‌ఫుల్‌లీడర్‌. ఇలా నాయకత్వ పటిమను దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు ఇద్దరూ నాయకులు పార్టీలో పవర్‌ ఫుల్‌ నాయకులే. ఇప్పుడు వచ్చిన చిక్కంతా ఇదే… పిపిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటే సీనియర్లకు ఎవరికీ ఇష్టం లేదు. ఆయన ఎటువంటి కార్యక్రమం తీసుకున్నా సీనియర్లు ఎవరూ సహకరించడం లేదు. దాంతో భట్టిని రంగంలోకి దింపి రేవంత్‌రెడ్డికి పోటీగా యాత్రకు పురిగొల్పారనేది ఒక వాదన. నిజానికి బిఆర్‌ఎస్‌ తర్వాత రాష్ట్రంలో బిజేపి కన్నా ఎక్కువ బలంగా వున్నది కాంగ్రెస్‌ పార్టీయే. అందుకే నాయకులకు ఇంకా ఆశలు సజీవంగానే వున్నాయి. అందువల్ల రేవంత్‌ను అడ్డుకునే ఎత్తుగడతోపాటు, దలిళ ముఖ్యమంత్రి ప్రభావం ఏ కాలంలో కాంగ్రెస్‌క కలిసి వస్తుందని సీనియర్ల ఆలోచన. అందుకే వెంకటరెడ్డి రూపంలో ఆ చర్చను ముందుకు తెచ్చి పెట్టారన్నది కొందరు నేతలు అంటున్న మాట. ఏది ఏమైనా కాంగ్రెస్‌ నేతల చేతులు కలవడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని మాత్రం తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *