Headlines

కర్ణాటకలో కాంగ్రెస్‌ ఘన విజయం.

`నేటిధాత్రి చెప్పిందే నిజమైంది.

`సర్వేలన్నింటిలో నేటిధాత్రి సంచలనం సృష్టించింది.

` డీ ప్యాక్‌ తో కలిసి కర్ణాటకలో నేటిధాత్రి పలు దఫాలుగా సర్వే నిర్వహించింది.

కర్ణాటకలో కాంగ్రెస్‌ ఘన విజయం.

` ఎంత ప్రచారం చేసుకున్నా ఓడి వాడిన కమలం.

`తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న కమలం.

` ప్రధాని మోడీ సహా అనేక మంది విపరీత ప్రచారం కలిసి రాలేదు.

`కమలనాధులను గట్టెక్కించలేదు.

`కర్ణాటక కాంగ్రెస్‌ లో కలిసి వచ్చిన ఐక్యతా రాగం?

` సిద్దరామయ్య, శివ కుమార్‌ ల ధ్వయం సమన్వయం.

` కలిసొచ్చిన రాహుల్‌ జోడో యాత్రా ఫలితం.

` దక్షిణాదిలో బిజేపికి భవిష్యత్తు కష్టం.

`కమలం వైఫల్యం ఎవరి ఖాతాలోకి?

`పాలు కలిసి రాలేదు.

`పెరుగు పెత్తనం నచ్చలేదు.

` కన్నడ ఆత్మ గౌరవం ముందు మూడు సిలిండర్లు నిలవలేదు.

`ఖచ్చితమైన ఫిగర్‌ ను ముందే ప్రకటించింది.

` కేవలం నేటిధాత్రి ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రమే ఖచ్చితమైన లెక్క చెప్పింది.

`డీ ప్యాక్‌, నేటిధాత్రి గతంలో కూడా అనేక సందర్భాలలో ఖచ్చితమైన ఫలితాలు అందించింది.

`కర్ణాటక కాంగ్రెస్‌ దే అని నేటిధాత్రి ముందే చెప్పింది.

`హంగ్‌ కు ఆస్కారమే లేదని ప్రకటించింది.

`కాంగ్రెస్‌ మాజిక్‌ ఫిగర్‌ దాటుతుందని సర్వేలో తేల్చింది.

`మంచి మెజారిటీతో గెలుస్తుందని నేటిధాత్రి మాత్రమే చెప్పింది.

`సర్వేలన్నింటిలో ది బెస్ట్‌ సర్వే నేటిధాత్రి దే అని తేలింది.

`నేటిధాత్రి ని అభినందించిన ఇతర సర్వే సంస్థలు.

`నేటిధాత్రి లెక్కుల నిజం కావడంతో వివరాలు తెలుసుకుంటున్న పార్టీలు.

హైదరబాద్‌,నేటిధాత్రి:  

కర్నాటక ఎన్నికలు బిజేపికి మంచి పాఠం నేర్పినట్లే లెక్క. ఇప్పటికైనా భారతీయ జనతాపార్టీలో ఒక అంతర్మధనం జరగాల్సిన అవసరం వుంది. దేశ రాజకీయాల్లో దక్షిణభారత దేశ రాజకీయాలు, చైతన్యం అన్నది ఎలా వుంటుందన్నది ఇప్పటికైనా బిజేపి తెలుసుకోవాలి. దేశ సమగ్రత మీద కూడా బిజేపి ఇంకా ఎంతో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం వుంది. సీట్లపరంగా లెక్కలేసుకొని ఉత్తరాధి రాష్ట్రాల సీట్లు చాలన్నంత దోరణితో దక్షిణాది రాష్ట్రాలను చిన్న చూపూ చేస్తుందన్న అపవాదును ఎదుర్కొంటోంది. అయినా బిజేపి మారలేదు. పైగా మరింత ఉత్తరాధి పెత్తనాలు మరింత పెంచుకునే ప్రయత్నమే చేసింది. అందుకే కర్నాటకలో ఎంతో బలంగా వున్నప్పటికీ ప్రజలు బిజేపిని కాదునుకున్నారు. కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టారు. కన్నడ ప్రజల తీర్పు కొత్తేమీ కాదని సమర్ధించుకునే వాళ్లు కూడా చాలా మందే వున్నారు. ఎందుకంటే కన్నడ ప్రజలు 1982 తర్వాత ఎప్పుడూ ఒక పార్టీకి రెండుసార్లు అధికారం ఇవ్వలేదని అదే ఆనవాయితో 2023లో కూడా అదే అనుసరించారని బిజేపి సమర్ధించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం మరింతగా ఆ పార్టీ పతనాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఎందుకంటే కర్నాటక దక్షిణాదిన ఎంతో చైతన్యవంతమైన రాష్ట్రం. బెంగుళూరు దేశంలోని అతి పెద్ద పట్టణాలతో ఒకటి. సిలికాన్‌ వ్యాలీ అనే పేరున్న నగరం. అక్కడ దేశంలోని అనేక రాష్ట్రాలు,ప్రాంతాల ప్రజలు వుంటుంటారు. వాళ్లు కూడా బిజేపికి పెద్దగా సపోర్టు చేయలేదు. ఎందుకంటే ఎవరి జీవన విధానమైనా ఒకటే. ఆచార వ్యవహరాలు ఒకటే. అందరూ ధరల భారాన్ని మోస్తున్నవారే. అయితే ఎప్పుడూ మతమే, తప్ప సమ్మతంలేని రాజకీయాలు ఏ ప్రజలు కోరుకోరు. విశ్వాసానికి,నమ్మకానికి రాజకీయాన్ని ముడిపెట్టి అభివృద్దిని విస్మరించినా ప్రజలు సమ్మతిస్తారనుకుంటే ఇదే జరుగుతుంది. మళ్లీ రాజకీయాలకు దారి లేకుండాపోతుంది. నిజానికి బిజేపికి దక్షిణాదిన వున్న ఏకైక రాష్ట్రం కర్నాటక. ఆ ప్రజలను ఆత్మగౌరవం మీద కూడా బిజేపి దెబ్బ తీసే ప్రయత్నం చేసింది. కులాల మధ్య, ప్రాంతాలమధ్య, మతాల మధ్య దుమారం, వివాదం రేపే ప్రయత్నం చేసింది. ఇది కన్నడ ప్రజలకు నచ్చలేదు. అసలు బిజేపికి ఇంత ఘోరమైన ఓటమి తప్పదని ముందునుంచి తెలిసినా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. స్ధానిక కర్నాకట నాయకులకు బిజేపి పరిస్ధితి ఏమిటో తెలిసినా, జాతీయ స్ధాయి నాయకులకు నిజాలు చెప్పడంలో విఫలమయ్యారు. వారికి ఎదరుసమాధానం చెప్పడానికి జంకారు. కేంద్ర నాయకత్వం చెప్పినట్లు తలూపారు. కర్నాకటలో బిజేపి ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణమైంది. 

కర్నాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సుమారు 14 సభలల్లో ప్రసంగించి ప్రచారం చేశారు.

 ప్రధాని మోడీ గుజరాత్‌ తర్వాత ఇంతలా ప్రచారం చేసింది ఎక్కడా లేదు. కాకపోతే ప్రధాని నరేంద్ర మోడీ అని ప్రాజెక్టులకు గుజరాత్‌ కేరాఫ్‌ అడ్రస్‌ చేయడంతో ప్రజలు కూడా ఆదిరిస్తూ వస్తున్నారు. కాని కర్నాకటలో బిజేపి ప్రభుత్వం వున్నా అభివృద్ధి గురించి పెద్దగా కేంద్రం పట్టించుకోకపోవడం గమన్హాం. ఇటీవల కర్నాటకలో పెద్దఎత్తున వరదలు వచ్చాయి. వరద నివారణ చర్యలు చేపట్టడంలో బిజేపి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. కేంద్రం సాయం అందించడంలో కూడా చొరవచూపకుండాపోయింది. దాంతో ప్రజలకు బిజేపి మీద తీవ్రమైన కోపం వుంది. అది బిజేపికి తెలుసు. అయినా నష్టనివారణ చర్యలు చేపట్టడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. సాయం అందించేందుకు పెద్దగా చొరవ తీసుకోలేదు. ఎంత క్లిష్టపరిస్ధితులైనా సరే మతం ఆధారంగా నెగ్గుకురావొచ్చన్న కారణాలు మాత్రమే వెతుక్కుంటూ రాజకీయాలు చేయడం బిజేపి మొదలుపెట్టింది. దేశ, ధర్మం అంటూ మాటలు చెప్పడమే అలవాటు చేసుకున్నది. తాజాగా కర్నాకటలో భజరంగ్‌ దళ్‌ వివాదాన్ని పెద్దఎత్తున రాజకీయంగా మల్చుకునే ప్రయత్నం బిజేపి చేసింది. పైగా కాంగ్రెస్‌ పార్టీ కర్నాటకను దేశం నుంచి వేరు చేసే కుట్ర చేస్తుందంటూ సాక్ష్యాత్తు ప్రధానమంత్రి మోడీ ప్రకటన కూడా ప్రజలకు అసలే నచ్చలేదు. ఒక ప్రధాన మంత్రి ఇలాంటి ప్రకటనలు చేసి రాజకీయ సానుభూతి సంపాదించాలనుకోవడం కూడా కరెక్టు కాదు. ఇక మన రాజ్యాంగం ప్రకారం మత పరమైన ప్రచారం ఎన్నికల విధానానికి నియమనిబంధనలకు విరుద్దం. అదేంటో గాని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాకటలో పెద్దఎత్తున వివాదంగా మారిన 40శాతం కమీషన్‌ మీద మాట్లాడితే ఎన్నికల సంఘం అభ్యంతరం తెలిపింది. కాంగ్రెస్‌ పార్టీకి నోటీసులు ఇచ్చింది. వాటికి సంబంధించిన సాక్ష్యాలు అందించాలని ఆదేశించింది. కాని అదే ప్రధాని నరేంద్ర మోడీ కర్నాకట విషయంలో చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఎలాంటి స్పందన కనబర్చలేదు. వీటిని కూడా ప్రజలు బాగానే గమనిస్తూ వచ్చారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నాకటలో ఆరు సార్లు రోడ్‌ షోలు నిర్వహించారు. 

ప్రజలు కూడ పెద్ద సంఖ్యలో హజరయ్యారు. మోడీని చూసేందుకు జనం ఎగబడ్డారు. పెద్ద ఎత్తున మోడీ నినాదాలు చేశారు. మోడీ సాగిన రోడ్‌ షోలలో రోడ్లన్నీ పూలను పర్చారు. పూలతో రోడ్లను నింపేశారు. నేరేంద్ర మోడీ మీద ప్రజలు పూల వర్షం కురిపించారు. కాని ఓట్లు వేయలేదు. కారణం ఏమిటో? తెలియనంత అమాయకులు కాదు బిజేపి నేతలు. స్పాన్సర్‌ ప్రోగ్రామ్‌లు చేపట్టి, పూలు విసిరేయించుకుంటే, పూల దండలు వేయించుకుంటే ప్రజలు మురిసిపోరు. సంబరపడి ఓట్లు వేయరు. కాని అలా ప్రజలను మాయ చేయడం అలవాటు చేసుకున్నాకా..అంతటా ఇదే ఫార్ములా సక్సెస్‌ అవుతుందని అనుకున్నట్లున్నారు. కాని ఎల్లకాలం అదే చెల్లదు. అందుకే జనాలను చూసి నాయకులు మురువొద్దు. వచ్చిన వాళ్లంతా ఓట్లేయరు. జేజేలకు పొంగిపోవద్దు. నినాదాలు ఓట్లు రాల్చవు. విధానాలు లేకపోతే ఎల్లకాలం రాజకీయాలు నిలబడవు. ఒక్క మోడీ అన్న వ్యక్తిస్వామ్యమే పార్టీకి శ్రీరామ రక్ష అనకుంటే పరిస్తితి ఇలాగే వుంటుంది. ఇది బిజేపిలో ఏ నాయకుడైనా నేర్చుకోవాల్సిన పాఠం..గుణపాఠం. 

 జన్‌కీ బాత్‌ మర్చిపోయి, మన్‌కీ బాత్‌ ఎప్పుడూ చెబితే ఇలాగే వుంటుంది. 

మన్‌కీ బాత్‌ అన్నది ఒక్క మనిషికి చెందినదే. అదే అందరికీ రుద్దాలని చూస్తే ఎల్లకాలం వినరు. అందుకే నీతులు కూడా పదే పదే చెప్పినా, నిజాలు మరుగున పడిపోతుంటాయి. వింటే బోర్‌ కొడతాయంటారు. అందుకే నాయకులు చెప్పాల్సింది నీతులు కాదు..నీతి కథలుకాదు..నిజాలు చెప్పాలి. ప్రజలకు నిజాయితీ పాలన అందించాలి. తాను చెప్పేదే ప్రజలు వినాలన్నట్లు మన్‌కీ బాత్‌ను చెప్పడమే కాదు, కనీసం అప్పుడప్పుడైనా జన్‌కీ బాత్‌ వింటే ప్రజల సమస్యలు తెలుస్తాయి. జనం సమస్యలు తెలుసుకోకపోతే, నాయకుల విన్నపాలు కూడా ఓట్లనాడు ప్రజలు పట్టించుకోరు. రాజకీయంగా అవతలకు విసిరేస్తారు. ఇక మత రాజకీయాలు అన్నవి ఎల్లకాలం చెల్లవని బిజేపి ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ప్రతీసారి మతం రాజకీయాలకు పనిచేయదు. అందుకే మతం పరువు తీయొద్దు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. పరిపాలన అంటే ప్రజా రంజకంగా వుండాలి. ప్రగతి రూపు కనిపించాలి. అభివృద్ధి మంత్రం కొనసాగాలి. మతమే మంత్రతంత్రం అనుకుంటే ఫలితాలు ఇక భవిష్యత్తులో కర్నాటక తరహాలోనే వస్తాయి. అందుకే ప్రజల మేలు కోరే రాజకీయాలే దేశానికి కావాలి. ఇక దేశంలోని అన్ని ప్రాంతాలకు ఆత్మగౌరవాలు వుంటాయి. గతంలో దేశమంతా హిందీ భాషను రుద్దాలని బిజేపి ప్రయత్నం చేసింది. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటీవల దక్షిణాది రాష్ట్రాలలో పెరుగు ప్యాకెట్లపై హిందీలోనే రాయాలని కేంద్రం నిర్ణయం చేసింది. సరిగ్గా కర్నాటక ఎన్నికల మందు దాన్ని తెరమీదకు బిజేపి తెచ్చింది. గెలిస్తే ప్రజల మద్దతు వుందన్న సంకేతాలు దేశమంతా పంపేందుకు ఆలోచనచేసింది. కాని అది కూడా బెడిసి కొట్టింది. ఇక విద్యావిధానంలో కూడా మార్పులు తెచ్చే క్రమంలో పాఠ్య పుస్తకాల నుంచి కొన్ని పాఠాలు తొలగించింది. అందులో మహాత్మాగాంధీని చంపిన గాడ్సేపై పాఠాన్ని ఎన్సీఆర్టీ తొలగించింది. ఇందతా బిజేపి ఎన్నికలపై కూడా ప్రభావం పడిరదనే చెప్పొచ్చు. ఇటీవల బిజేపికి సుప్రింకోర్టులో కూడా అడుగడుగునా అవాంతరాలే ఎదురౌతున్నాయి. వాటిని కూడా గమనించుకొని బిజేపి ముందుకు సాగాలి. డిల్లీప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకొని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కీలుబొమ్మను చేయడాన్ని సుప్రిం కోర్టు ఆక్షేపించింది. ఇ డిల్లీలో ప్రజా ప్రభుత్వమే పనిచేయాలని సూచించింది. డిల్లీ ప్రభుత్వంపై ఈడీ పెట్టిన లిక్కర్‌ కేసు విషయంలో అసలు స్కామ్‌కు ఆస్కారమే లేదని డిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. పైగా ఈడీ అనే సంస్ధ దక్షిణాది ప్రాంతాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించకూడదన్న ఘాటు సూచన చేసింది. ఇక మహారాష్ట్రలో బిజేపి చేసింది తప్పని సుప్రింకోర్టు ఆక్షేపించింది. ధాకరే ప్రభుత్వాన్ని కూల్చడం అనైతికమని చెప్పింది. రాహుల్‌ గాంధీ కేసులో తీర్పు వెలువరించిన జడ్జి ప్రమోషన్‌పై సుప్రింకోర్టు స్టే విధించింది. ఇదంతా భారత సమాజం బాగా గమనిస్తూ వుంది. కర్నాకట ప్రజలు సమయం వచ్చిందని అదును చూశారు. బ్యాలెట్‌ తీర్పులో బిజేపిని ఓడిరచారు. కర్ణుడి చావుకు కారణాలెన్నొ అన్నట్లు బిజేపి ఓటమికి కూడా ఇవన్నీ కారణాలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!