స్టేషన్ ఘనపూర్ జనగాం నేటి ధాత్రి
స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని విశ్వనాధపురం గ్రామానికి చెందిన గొల్ల కురుమలు సర్పంచ్ మల్లేష్ ఆధ్వర్యంలో హనుమకొండలోని మాజీ ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గొల్లలకు రావలసిన గొర్ల యూనిట్లు ఇచ్చే విధంగా చొరవ చూపాలని గొల్ల కురుమలు కడియం ను కోరారు. అనంతరం కడియం వారికి భరోసా ఇచ్చినట్టు సమాచారం
ఈ కార్యక్రమంలో చాగల్ సర్పంచ్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు పోగుల సారంగపాణి, భూక్య సురేష్, పోలే అక్కయ్య, కొమురయ్య, రాజయ్య, బండారి బుచ్చయ్య, అంజయ్య, పోలే పున్నం, కోటిలింగం, రాజకొమురు, బాబు, మాజీ సర్పంచ్ సుగుణ, మొగిలయ్యలు, పాల్గొన్నారు.