కచ్చితంగా విజయం తధ్యం

 

కవిత పోరాటంలో అర్ధముంది

మహిళా హక్కుల ప్రశ్నలో ధైర్యముంది.

చేయని తప్పుపై తిరుగుబాటు శక్తి వుంది.

వాషింగ్‌ పౌడర్‌ నిర్మా కావడం కష్టం.

కవిత త్యాగాల చరిత్ర తెలియని బిజేపి.

సహజంగా ఏ కేసులోనైనా పోలీసులు రుజువులు చూపించాలి!

ఈడీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లే తప్పులేదని నిరూపించుకోవాలి!

ఇదే బిజేపికి కలిసి వచ్చిన అంశం.

కవితను ఇబ్బందులకు పెట్టేందుకు ఎంచుకున్న పన్నాగం?

బిఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టడానికి బిజేపి ఎంచుకున్న మార్గం?

 కేసిఆర్‌ మనో ధైర్యం దెబ్బతీయాలనే బిజేపి లోక్ష్యం?

ఒకనాటి రాజకీయాలు వేరు… ఇప్పటి రాజకీయాలు వేరు. ఒకప్పటి ఎత్తులు వేరు..ఇప్పటి కుయుక్తులు వేరు.. ఎంతకైనా తెగించడమే నేటి రాజకీయాలు..ఎంత వేధింపులకైనా పెట్టింది పేరు ఇప్పటి రాజకీయాలు..అందుకే కల్లకుంట్ల కవిత లాంటి నాయకురాలని ఎలాగైనా బిజేపిలోకి తెచ్చుకోవాలి. అలాంటి నాయకురాలు బిజేపిలో లేరు. ఏ ఇతర పార్టీలలోనూ లేదు. అందుకే సమర్ధవంతమైన నాయకత్వ పటిమ వున్న నాయకురాలు కవిత. అలాంటి నాయకురాలు బిజేపిలో చేరాలన్నది బిజేపి పెద్దల ఆశ. నిజంగా రాజకీయాలు చేయాలనుకునేవారు..ఆదర్శవంతమైన రాజకీయాలు సాగించాలనుకునేవారు చేసే ఆలోచన కాదు. బిజేపి చేయాల్సిన ఆలోచన అసలే కాదు. ఎందుకంటే మాటకు ముందు దేశం..కోసం ధర్మం కోసం అని చెప్పే బిజేపి నాయకులు కవిత బిజేపిలోకి రావాలనుకోవడం ఏ ధర్మమో! చెప్పాలి? ఎందుకంటే ఆమె తెలంగాణ సాధకుడు, పరిపాలన దక్షుడు, సంక్షేమ సారధి, గొప్ప ఆదర్శవంతమైన నాయకుడు, ప్రగతి రధసాధకుడు, తెలంగాణలో వెలుగులు ప్రసరించిన రాజనీతిజ్ఞడు,ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూతురు. ఆమె తొలుత రాజకీయాలలోకి రాలేదు. ఇది కవితను విమర్శించేవాళ్లు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. తెలంగాణ విముక్తి కోసం వచ్చారు. తెలంగాణ సాధనలో పనిచేశారు. పోరాటం చేయాలనే ఆరాటం అందరికీ వుంటుంది. కానీ పోరాటం చేసే శక్తి కొందరికే వుంటుంది. అలాంటి పోరాట యోధురాలు కవిత. తెలంగాణ సాధన కోసం, ఉద్యమంలో పాలు పంచుకున్నారు. కీలక భూమిక పోషించారు. తెలంగాణ సాధనలో తనదైన పాత్ర పోషించారు. అందుకు ఆమె ఎంచుకున్న రూపాలు తెలంగాణ పాలిట వరాలు. ముందుగా ఆమె జాగృతి పేరిట తెలంగాణ సమాజంలో చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అప్పటికే ఎంతో నిస్తేజంగా వున్న తెలంగాణ యువ సమాజాన్ని తట్టి లేపేందుకు కృషి చేశారు. వారికి విద్యావకాశాలు పెరిగేందుకు దోహదం చేశారు. విద్యాపరంగా తెలంగాణ సమాజానికి దిశా, దశ చూపించారు. సామాజిక బాధ్యతను భుజాన వేసుకున్నారు. సమాజ సేవకు అంకితమయ్యారు. యువతను తీర్చిదిద్దే యజ్ఞం మొదలుపెట్టారు. జాగృతి ఏర్పాటు చేసి, తెలంగాణ పల్లెలో సాంకేతిక విద్యపై యువతకు అవగాహన పెంచే కార్యక్రమం మొదలుపెట్టారు. ఎందుకంటే అప్పటి వరకు తెలంగాణ యువతలో చదువుకోవాలని వున్నా, చదివించుకునే స్తోమత లేక, చదువకునే అవకాశాలు లేక, కుటుంబాలు గడవక విద్యను మధ్యలోనే వదిలేసే వాళ్లు చాలా మంది వుండేవారు. వారికి చదువు విలువ తెలిసేలా చేసి, చదవుకు దగ్గరగా చేసే గొప్ప కార్యక్రమం మొదలుపెట్టారు. అందులో భాగంగా యువతకు సరైన మార్గాలు వేశారు. ఆ తర్వాత అదే జాగృతి ద్వారా తెలంగాణ ఉద్యమానికి బతుకమ్మతో సాంస్కృతికపునరుజ్జీవం కల్పించారు. తెలంగాణలో కూడా బతుకమ్మ పండుగను మర్చిపోయే దశకు చేరుకుంటున్న తరుణమది. తెలంగాణ పల్లెలో పచ్చదనం కరువైపోయి, కరువు తాండవిస్తున్న దశలో బతుకు జీవుడా అని జనం ఊర్లను వదిలి పట్నాల వెంట కన్నీళ్లతో కదలి, కూలీనాలి చేసుకునేవారు. అయినా బతుకమ్మ పండగ సమయంలో ఊరు చేరుకునేవారు. కాని నిరంతర కరువు కాటకాలు వారిని ఊరికి దూరం చేశాయి.

పండుగలను లేకుండా చేశాయి. ఇదే సమయంలో కవిత తెలంగాణ ఉద్యమానికి అంతరించి పోతున్న కళారూపాలలో, ప్రకృతి ఆరాధనను మళ్లీ జనంలోకి తెచ్చారు. తెలంగాణ బతుకమ్మను ఉద్యమ రూపాన్ని చేశారు. తెలంగాణ బతుకమ్మగా కవిత కీర్తిపొందారు. అంతటి కవితను ఎలాగైనా బిజేపిలోకి లాగేసుకోవాలి. లేకుంటే రాజకీయంగా అణచివేయాలని బిజేపి తలచిందనేది ప్రధానంగా వినిపిస్తున్నదే. 

                        ఒకనాడు జాగృతి, తర్వాత తెలంగాణ ఉద్యమం, బతుకమ్మ స్వరూపం..ఆ తర్వాత తెలంగాణ ప్రగతి. ఇప్పుడు జనజాగృతి , మహిళా సాధికారిత, హక్కుల కోసం ఆమె పోరాటం సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆమెను సిబిఐ ఎందుకు విచారించిందో తెలియదు. తర్వాత ఎందుకు ఈడీ ఎంటరైందో ఎవరికీ తెలియదు. డిల్లీలో జరిగిన లిక్కర్‌ దందా గురించి వివరాల సేకరణ కోసం మాత్రమే కవిత వాంగూలం కావాలి. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పటికీ ఇంతే…కాని ఈ విషయాన్ని చిలువలు పలువలు చేసి, రాజకీయంగా బిజేపి మైలేజీ పొందాలని చూసింది. కాని డామిట్‌ కధ అడ్డం తిరిగింది. ఈడి వివరాలు బైట పెట్టిందో…లేక బిజేపి కట్టుకథలు అల్లిందో గాని రాజకీయంగా కవితను బరింత బలోపేతం చేశారనే చెప్పాలి. అంతా లెక్క తేల్చినా వందకోట్ల దగ్గరే అటుతిరిగి, ఇటుతిరిగి విచారణ చక్కర్లు కొడుతోంది. దేశాన్ని ముంచి వేల కోట్లు దోచుకొని దేశాలు దాటి వెళ్తున్న వాళ్లను ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షాలు చెబుతున్నట్లు పారిశ్రామిక వేత్తలకు బ్యాంకులు లక్షల కోట్లు మాఫీలు చేస్తున్నారు. ఎంతో మంది వ్యాపార వేత్తలు బ్యాంకులను ముంచేస్తున్నారు. అప్పులు ఎగ్గొడుతున్నారు. వారి రుణాలు బ్యాంకులు మాఫీ చేస్తున్నాయి. కాని కవిత విషయంలో ఈడీ ఎంటరైంది. లేని లెక్కలు ముందేసుకొని మందు గురించి లెక్కల వివరాలు సేకరిస్తోందన్న మాటలు వినిపిస్తున్నాయి. అయినా ఒక మహిళగా తన హక్కుల సాధన కవితకు ఎంతో ముఖ్యం. మాజీ పార్లమెంటు సభ్యురాలు, ప్రస్తుత శాసన మండలి సభ్యురాలికే ఈడీ విషయంలో వేధింపులు వుంటే, సామాన్య మహిళల పట్ల ఎలా వుంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఈడీకి చేసిన చట్టాలేమీ ఆకాశం నుంచి ఊడిపడలేదు. కోర్టుకోర్టుకూ ఓ తీర్పు అని అదేదో సినిమాలో అన్నట్లు, విచారణ సంస్ధలకు వేర్వేరు చట్టాలు..ఏమిటో? సహజంగా సిఆర్‌పి చట్టాలు మహిళల విషయంలో కొన్ని మినహాయింపులు వున్నాయి. కాని ఈడీలో అవేవీ లేవని మహిళా హక్కులను కాలరాసే చట్టాలు కూడా మన సమాజానికి ఇబ్బందికరమే…అందుకే కవిత చేస్తున్న పోరాటం అందరిలోనూ స్పూర్తిని రగిలిస్తోంది. ఈ విషయంలో కూడా కవిత చరిత్రలో నిలిచిపోనున్నది. ఇప్పటికే చెప్పుకునే అనేక కేసులను పరిగణలోకి తీసుకొని తీర్పులు వెలువడినట్లే, భవిష్యతుల్లో కవిత చేసే పోరాటం కూడా అనేక సందర్భాలలో కూడా గుర్తు చేసుకునే అవకాశం వుంది. అందుకే డిల్లీ మద్యం విషయంలోనే కాదు, ఈడీపై కవిత అభ్యంతరాలన్నింటిలో కవిత కచ్చితంగా విజయం తధ్యమనే అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!