ఒట్టు తీసి గట్టు మీద పెట్టి ‘లీడర్‌’ నయ్యాను!

భవిష్యత్తు లో ఏమౌతావంటే లీడర్‌…అన్నాను…

మా ఊరికి బ్రిడ్జి కట్టిస్తానని చెప్పాను.

కష్టాలు కన్నీళ్లే తోడుగా పెరిగాను.

పెద్దత్త నీడలో, చిన్నత్త ప్రేమలో ఎదిగాను.

చిన్నప్పటి నుంచే లీడర్‌ ని…

ప్రశ్నించడం నా రక్తంలోనే వుంది.

వకృత్వ పోటీలో నేను చెప్పిన బ్రిడ్జి అప్పటి కలెక్టర్‌ నిర్మాణం చేశాడు…

ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ ప్రోద్బలంతో నిలిచాను.. గెలిచాను…

పార్టీ గుర్తించి అవకాశం ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞతలు.

కేసిఆర్‌ నాయకత్వం బలమైనది…పేదల అభ్యున్నతికి పాటుపడుతోంది…

ములుగులో టిఆర్‌ఎస్‌ పార్టీ బలంగా వుంది.

పార్టీకి అంకిత భావంతో వున్న నాయకులున్నారు.

ఈసారి ములుగు లో ఎగిరేది గులాబీ జెండానే…

ములుగు జడ్పీ వైస్‌ చైర్మన్‌ నాగజ్యోతి అంతరంగం…ఆమె మాటల్లోనే…ఎక్స్‌ క్లూజివ్‌ గా మీ నేటిధాత్రి లో…                                  

 హైదరాబాద్‌,నేటిధాత్రి: త్యాగాల వనంలో పూసిన పువ్వులు వాడుతాయా? పరిమళాలు కోల్పోతాయా? అన్నది ఒక చర్చ. ఎండిన పూ రేకులు కూడా మెలుస్తాయి..మొక్కలై మళ్లీ పూలు విరబూస్తాయి. పరిమళాలు ఎప్పుడూ వెదజల్లుతూనే వుంటాయి. అంటే ఇదేనేమో! బంతి పవ్వు ఎండినా మళ్లీ ఆ రేఖలు జల్లుతే మొక్కలౌతాయి. పూలు పూస్తాయి. ప్రజా సేవలో తరించే వారి వారసులు కూడా అదే దారిలో నడుస్తారని చెప్పడానికి ఇది కూడా ఒక సాక్ష్యమేమో! అంతటా ఇదే జరుగుతుందని కాదు. కొందరి జీవితాల్లోనే ఇలాంటివి నిజమౌతుంటాయి. అది పూర్వజన్మ సుక్రతమో! లేక మరేదో పుణ్యమో కాని పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు కొందరు జీవితాలు చిన్నప్పుడు తెలిసిపోతుంది. వారు ఏ రంగంలో స్ధిరపడిపోతారన్నది కూడా కొన్ని సార్లు చెప్పేయెచ్చు. ములుగు జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ నాగజ్యోతి జీవితంలో కూడా ఇది నిజమైందనే చెప్పొచ్చు. ఆమె జీవితంలో ఎంత విషాదం వుందో…అంతకు మించి ఆత్మవిశ్వాసం వుంది. అకుంఠిత దీక్ష వుంది. కొండంత ధైర్యముంది. ప్రశ్నించే తత్వం వుంది. నిలదీసే గుణం వుంది. ఎవరికీ భయపడని తెగింపు వుంది. తను అనుకున్న లక్ష్యం కోసం సాగే కఠోర పరిశ్రమ వుంది. భవిష్యత్తు మీద ఒక క్లారిటీ వుంది. అందుకే ఆమె చిన్న వయసులోనే లీడరైంది. ప్రజా ప్రతినిధిగా ప్రజల ఆశీర్వాధంతో ఎన్నికల్లో నిలిచి గెలిచింది. ప్రజల కోరిక మేరకు నాయకులరాలైంది. కాకపోతే ఇదంతా ముందుగా చేసుకున్న ప్లాన్‌ ప్రకారం జరగలేదు. 

కాగల కార్యం గంధర్వులే తీర్చుతారన్నట్లు ఆమె వేసిన ప్రతి అడుగును కూడా ఒక రకంగా దేవుడే తీర్చిదిద్దాడేమో అనిపించక మానదు. నాయకురాలు కావడానికి ముందు ఓ రోజు నాగజ్యోతి ఊరికి వచ్చిన సందర్భం ఒకటి. ఆమె భవిష్యత్తుకు పడిన మార్గం మరొకటి. అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం కూడా నాగజ్యోతి జీవితాన్ని మలుపు తిప్పింది. జనం కోరిక మేరకు ఎన్నికల బరిలో నిలిచినందుకు ఊరంతా ఓట్లేశారు. సర్పంచ్‌గా గెలిపించారు. ఆ పదవి చేపట్టి మూడు నెలలు కాకముందే, తాడ్వాయి జడ్పీటీసిగా పోటీ చేసే అవకావం వెతుక్కుంటూ వచ్చింది. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ నుంచి కబురొచ్చింది. ఎన్నికల్లో పోటీ చేయాలని పిలుపొచ్చింది. ఎలాగైనా సాయంత్రంలోగా నామినేషన్‌ వేయాలని నన్నపనేని నుంచి నాగజ్యోతికి ఫోన్‌ వచ్చింది. అంతా అయోమయం. అనూహ్యమైన నిర్ణయం. సరిగ్గా ఆ సమయంలో నాగజ్యోతి ఓ శుభకార్యంలో వుంది. ఈ శుభ వార్త ఆమె చెవిన పడిరది. ఇప్పుడెలా, ఎలా అనుకుంటున్న సందర్భం నుంచే ఏమాత్రం ఆలోచించినా, కాల యాపన చేసినా నామినేషన్‌ వేసే అవకాశం చేజారుతుంది. వెంటనే హన్మకొండనుంచి బయలుదేరింది. జిల్లాకేంద్రానికి చేరింది. నామినేషన్‌కు అంతా సిద్ధం చేసుకున్నది. కాని కొత్త బ్యాంకు అకౌంట్‌ బుక్‌ కావాలన్నారు. మళ్లీ ఆందోళన. కాని ఆఖరు నిమిషంలో నామినేషన్‌ అంతా సవ్యంగా సాగింది. టిఆర్‌ఎస్‌ నుంచి బిఫారం అందింది. అధికార తెరాస పార్టీ అభ్యర్ధిగా సమ్మక్క`సారలమ్మల మండలనుంచి గెలిచింది. పార్టీ పెద్దలైన ముఖ్యమంత్రి కేసిఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు కల్వకుంట్ల తారకరామారావు, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ తోపాటు, జిల్లా , మండల స్ధాయి నాయకుల ఆశీస్సులతో ములుగు జడ్సీ వైస్‌ చైర్మన్‌ అయ్యింది. నాగజ్యోతి లీడర్‌ ఎందుకయ్యింది? అన్నదాని వెనక ఆసక్తికరమైన విషయాలు కూడా వున్నాయి.

పసి వయసులోనూ అంతా శూన్యం. కాని నాగజ్యోతికి ఏమీ తెలియదు. కాని ఏదో వెలితి. నా అన్న వారు ఎంత మంది వున్నా పిలిచేందుకు అమ్మ, నాన్న, నానమ్మ, తాత ఇలా ఎవరూ లేరు. ఏ పసివాళ్లకైనా ముద్దు ముద్దు మాటలు వచ్చే ముందు ఎవరైనా అత్తా, అత్తా అనమని ఎందుకంటారో గాని నాగజ్యోతి జీవితాన్ని తెలుసుకుంటే అర్ధమౌతుంది. జన్మనిచ్చినవారు పరలోకం చేరారు. నానమ్మ, తాత వారు దేవుడి సన్నిధికెళ్లిపోయారు. నాగజ్యోతిని మేనత్తలిద్దరూ పెంచుకున్నారు. సాదుకున్నారు. విద్యాబుద్దులు చెప్పించారు. నాగజ్యోతి ప్రయోజకురాలయ్యేందుకు కృషి చేశారు. కాకపోతే ఎంతో చురుకైన ఆడబిడ్డ నాగజ్యోతి. పసి వయసులోనే మా ఊరుకు రోడ్డెందుకు లేదు? వాగు దాటేందుకు బ్రిడ్జి ఎందుకు లేదు? తన కళ్లముందే వాగులో కొట్టుకుపోయిన వారిని చూసింది? అయ్యో అని ఆ పసి తనంలోనే ఎంతో మదనపడేది. అన్నిరకాల సౌకర్యాలు వున్న ప్రాంతాలకు మాకు తేడా? ఎందుకు? మాకు అభివృద్ధి జరగదెందుకు? అన్న ప్రశ్నలు తనలోతానే వేసుకునేది. 

                          ఇలాంటి సందర్భంలో ఓసారి స్కూల్‌లో వకృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో ఏమౌతారు? అనుకున్న లక్ష్యం నెవరేరితే ఏం చేస్తారన్నదానిపై విద్యార్ధులును మాట్లాడమన్నారు. అప్పుడు నాగజ్యోతి నేను లీడర్‌నౌతాను. మన ఊరికి బ్రిడ్జి కట్టిస్తాను. అని చెప్పింది. ఇది జరిగిన కొన్ని రోజులకు వాళ్ల ఊరి వాగు మీద బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఆ సమయంలో జిల్లా ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ ప్రభాకర్‌ వున్నారు. కాకతాళీయంగా జరిగిందో…లేక నాగజ్యోతి అనుకున్నది నెరవేరిందో గాని, వాళ్ల ఊరికి బ్రిడ్జి వచ్చింది. చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు నాగజ్యోతిలో కనిపించేవి. ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రులను నుంచి సంక్రమించి ఆస్తిగా ప్రజా సేవ, నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకున్నదనే చెప్పొచ్చు. ఇక తాను హస్టళ్లలో వున్న సమయంలో భోజనం నాణ్యత కోసం కొట్లాడిన రోజులు కూడా వున్నాయి. డిగ్రీ హస్టల్‌ ఏర్పాటు కోసం పోరాటం చేసింది. అయితే ఎక్కడ నాగజ్యోతి కూడా రివల్యూషన్‌ లక్షణాలతో ఎక్కడ అడవిబాట పడుతుందో అన్న ఆందోళన వారి మేనత్తల్లో ఎప్పుడూ కనిపిస్తూనే వుండేది. సహజంగా మేధావులకే తిరుగుబాటు లక్షణాలు ఎక్కువగా వుంటాయి. ప్రశ్నించే తత్వం అలవడుతుంది. ఆ కుటుంబమంతా ఇప్పటికే ప్రజల కోసమంటూ, ప్రజా సేవంటూ అమరులయ్యారు. నాగజ్యోతి కూడా అదే బాట పట్టొద్దని హన్మకొండలోని కాలేజీలో చేర్పించారు. కాని నాయకత్వ లక్షణాలు మాత్రం ఆమెలో ఎప్పుడూ కనిపిస్తూనే వుండేవి. దాంతో నాగజ్యోతి మేనత్తలు ఓసారి ఆమెతో ఒట్టేయించుకున్నారు. నేను ఎప్పుడూ నాయకత్వ లక్షణాల పేరిట, ఉద్యమాలు, పోరాటాలు, ప్రజలు అంటూ వెళ్లనని మాటిచ్చేదాకా ఊరుకోలేదు. ఇక తప్పని పరస్ధితుల్లో నాగజ్యోతి వారికి మాటియ్యాల్సిన పరిస్దితి ఎదురైంది. ఆ తర్వాత పూర్తిగా చదువు మీద దృష్టి సారించిన నాగజ్యోతి ఉన్నతవిద్యావంతురాలైంది. ఎమ్మెస్సీ బోటనీ చేసింది. బిఎడ్‌ పూర్తి చేసింది. అనుకోకుండా ఏ మేనత్తలైతే ఒట్టు వేయించుకున్నారో…ఆ ఒట్టు గట్టుమీద పెట్టక తప్పలేదు. నాగజ్యోతి రాజకీయాల్లోకి రాకతప్పలేదు. కాకపోతే ఎంచుకున్న మార్గం వేరు. ప్రజా సేవ అన్నది మాత్రం కామన్‌. 

మేనత్తలు, వారి పిల్లలతోపాటు స్నేహితులకు కూడా నాగజ్యోతి జీవితంలో ఒక భాగమయ్యారు. డిగ్రీ, పీజిలు చేసిన సమయంలో తన స్నేహితులు కొమురం శైలజ, పాయం తులసీ దేవి, కొప్పుల మల్లీశ్వరి తనకు ఎంతో మేలు చేశారని చెబుతుంటారు. వాళ్లు నా కోసం ఆలోచించింనంతగా, వారి కోసం కూడా ఆలోచించుకోని రోజులు కూడా వున్నాయంటూ నాగజ్యోతి తన స్నేహితురాళ్ల గురించి చెబుతుంది. వారి తోడ్పాటు కూడా తన ఉన్నత విద్యకు ఎంతో తోడ్పడిరదని చెబుతుంది. ఇక రాజకీయాల విషయానికి వస్తే, అనుకోకుండా జరిగిన సందర్భమే. కాని నన్ను నాయకురాలిని చేసింది కూడా మా గ్రామమే…నా ప్రజలే…సర్పంచ్‌గా గెలిచిన మూడు నెలలకే జడ్పీటీసిగా అవకాశం రావడం అదృష్టం. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ చొరవ, ఆశీస్సులుతో జడ్పీటీసీ అయ్యాను. తన పేరు ప్రతిపాదననను అంగీకరించి తనకు ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసిఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంటు, పురుపాలక, ఐటి శాఖ మంత్రి తారకరామారావుకు ప్రత్యేక ధన్యవాదాలు. కృతజ్ఞతలు. ప్రజా సేవ చేయాలన్న నా ఆశయం ఇంత త్వరగా వస్తుందని కూడా ఊహించలేదు. జిల్లా స్ధాయి సేవలు అందించే అవకాశం ఇచ్చిన పార్టీ కోసం, ప్రజల కోసం అహర్నిషలు పనిచేస్తున్నారు. నా గెలుపుకు కృషి చేసిన మండల రాజశ్రీ, నాగమ్మ, పురుషోత్తం, శివారాజు, జాజి చంద్రంలకు కూడా ధన్యవాదాలు. నా ప్రజలకు ఏం కావాలో తెలుసు. ఎందుకంటే ఆ బాధలనుంచి వచ్చాను. నా కుటుంబం కూడా మా ప్రాంతం కోసం ప్రాణాలొదిలారు. నాకు వచ్చిన ఈ అవకాశంతో వారి ఆశయాలు నెరవేర్చడం కోసం నా జీవితాంతం ప్రజలకు సేవ చేస్తాను. వారి కోసమే రాజకీయాలు చేస్తాను. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కోసం పనిచేస్తాను. పేదల ప్రజల్లో వెలుగులు నింపడమే నా కల. అది నెరవేరేదాకా విశ్రమించను. అందుకు నా ప్రజల ఆశీస్సులు ఎల్లకాలం వుండేలా చూసుకుంటాను. అటు పార్టీని కాపాడుకుంటూ, ఇటు ప్రజల సంక్షేమం చూసుకుంటూ, తన ప్రాంతం ప్రగతిలో మందుకు సాగేందుకు కృషి చేస్తాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!