చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఐసీడీఎస్ ఆధ్వర్యంలో
పోషణ మాసం సందర్బంగా సూపెర్వైజర్ జయప్రద చిట్యాల గ్రామం లో ఇంటింటికి వెళ్లి గర్భవతులు, బాలింతలు, పిల్లలు తీసుకుంటున్న ఆహార పధార్ధాలను, వ్యక్తిగత, పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, త్రాగే నీటిని టీచర్స్ తో కలిసి 3 ఇండ్లను సందర్శించి తగిన సలహాలు సూచనలు ఇవ్వనైనది. ముఖ్యంగా గర్భవతి దశ నుండి 2 సంవత్సరాల పిల్లల వరకు ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ, బరువులు తీయించుకుంటూ, సమతుల ఆహరం భుజించి వయసుల వారిగా ఇప్పించాల్సిన టీకాలన్నీ వేయించినచో నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదుగుతు పోషకాహార లోపం లేని సమాజాన్ని ఏర్పరుకోవచ్చని సూపెర్వైజర్ జయప్రద గారు వివరించారు.తదుపరి మహిళా సంఘాల మీటింగ్ కు హాజరై మహిలందరితో పోషణ మాసం ప్రతిజ్ఞ చేయించనైనది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ సంధ్య రాణీ, భాగ్యలక్ష్మి, జ్యోతి, సిఏలు వివోలు పాల్గొన్నారు