ఐసిఐసిఐ బ్యాంకు డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ కార్తిక్ అరెస్ట్.

ఐసిఐసిఐ బ్యాంకు డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ కార్తిక్ అరెస్ట్..
# క్రికెట్ బెట్టింగ్ లో కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు..
# బ్యాంకులో రూ. 8 కోట్ల 65 లక్షలు కాజేసిన ఘనుడు..
# వివరాలు వెల్లడించిన ఏసిపి తిరుమల్

నర్సంపేట,నేటిధాత్రి :

అతను ఒక ఉన్నత స్థాయి ప్రైవేటు అధికారి. ప్రజలు బ్యాంకులో దాచుకుని సొమ్ముపై అతని కన్నుబడింది. తన వంకర బుద్ధితో జల్సాల పేరుతో కాజేసిన సొమ్ముతో క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడి కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నాడు జాతీయస్థాయిలో పేరుమోసిన ఐసిఐసిఐ బ్యాంకు ఉన్నతాధికారి. ఈ సంఘటన నర్సంపేట పట్టణంలో గత రెండు నెలల క్రితం వెలుగులోకి వచ్చిన కోట్లాది రూపాయల కుంభకోణంలో ఉన్న ఐసిఐసిఐ బ్యాంకు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ బైరిశెట్టి కార్తీక్ ను నర్సంపేట పోలీసులు అరెస్టు చేసినట్లు ఏసిపి తిరుమల్ తెలిపారు. మంగళవారం నర్సంపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిధుల కుంభకోణానికి పాల్పడిన డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ కార్తీక్ అరెస్టు ను పట్టణ సిఐ రవి కుమార్ ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వరంగల్ పట్టణ కరీమాబాద్ కు చెందిన బైరిశెట్టి కార్తీక్ నర్సంపేట పట్టణంలోని ఐసిఐసిఐ బ్యాంకు డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే బ్యాంకులో గోల్డ్ లోన్ విభాగం పూర్తిస్థాయిలో చూసుకునే కార్తిక్ గోల్డ్ లోన్ రెన్యువల్స్ క్లోజింగ్ పనులు పూర్తి చేసేవాడు. డబ్బు పైన కుట్రపూరిత వ్యామోహం పెంచుకున్న కార్తీక్ బంగారు రుణాల ఖాతాలు సంబంధిత లబ్ధిదారులు క్లోజ్ చేసినప్పటికీ ఆ డబ్బులను బ్యాంకు ఖాతాలో క్లోజ్ చేయకుండానే బంగారు ఆభరణాలు బ్యాంకులో ఉన్నట్లుగా చూపుతూ వాటి లోన్ రెన్యువల్స్ అతనే చెల్లిస్తూ ఖాతా నడుస్తున్నట్లుగా బ్యాంకు రికార్డులలో చూపించి ఆ డబ్బులను అతనే సొంతం వాడుకున్నాడు. అలాగే ఖాతాదారులు రెన్యువల్ పాక్షిక గంగా తీసుకోవడం లేక మరికొంత ఆభరణాలు జమచేసి అధిక లోను పొందడం కోసం రాగా ఆ కథదారులను వారి కుటుంబ సభ్యుల పేరు మీద కొత్త ఖాతాలు తెరిచి తద్వారా వచ్చిన డబ్బుల నుండి కొంత పాత రెన్యువల్స్ కి వాడుకొని మిగిలిన డబ్బులతో క్రికెట్ బెట్టింగ్ లకు ఆడేవాడని పేర్కొన్నారు. కొన్నిసార్లు ఖజానాలో ఉన్న బంగారు పౌచులను తీసుకొని వేరే వ్యక్తుల మీద ఖాతా తెరిచి తద్వారా వచ్చిన డబ్బులను బెట్టింగ్ లకు వాడుకునేవాడని, అనధికారకంగా ఖాతా తెరవడం ఖాతదారుల అనుమతి లేకుండా బంగారు పౌచులను తెరవడం వేరే వారి పేరు మీద అదే బంగారాన్ని పెట్టి డబ్బులు పొందుతూ ఆ బ్యాంకును మోసం చేసేవాడని ఎసిపి వివరించారు. కొన్ని సందర్భాలలో ఖాతాదారుల తన గోల్డ్ ఖాతాలను ఖాతా రోజర్ కోసం డబ్బులు తీసుకొని బ్యాంకుకు రాగా ఐసిఐసిఐ బ్యాంకు సర్వర్ నందు నకిలీ లావాదేవీలు సృష్టించి గోల్డ్ పౌచులను ఖాతాదారులకు ఇచ్చి ఆ డబ్బులను ఖాతాలో జమ చేయకుండా క్లోజ్ అయినట్లు చూపించేవాడని అలాగే మరికొన్నిసార్లు గోల్డ్ నకిలీ జువెలర్స్ పెట్టి కస్టోడియన్, ఆడిటర్ సంతకాలు ఫోర్జరీ చేసి అకౌంట్లు క్లోజ్ చేసినట్లు చూపించేవాడని తెలియజేశారు. ఇలా బంగారు రుణ ఖాతా క్లోజర్ నిమిత్తం ఖాతాదారులు డబ్బు తీసుకొని బ్యాంకుకు రాగా ఆ డబ్బులు తీసుకుని వారి ఖాతాలో జమ చేయకుండా వాటిని పక్కకు పెట్టి అన్నదికారకంగా రుణ ఖాతా క్లోజ్ చేయకుండా బంగారు ఆభరణాల ఖాతాదారునికి ఇచ్చేసి ఎవరికి అనుమానం రాకుండా ఆ ఖాతా రెన్యువల్ అమౌంటు ఇతనే చెల్లిస్తూ ఖాతా నడుస్తున్నట్లుగా బ్యాంకు రికార్డులను చూపిస్తూ ఆయా డబ్బులను కార్తీక్ తన సొంత వాడుకున్నాడని పేర్కొన్నారు. ఆ బ్యాంకులో 2019 నుండి ఆగస్టు 2023 వరకు బ్యాంకును మోసం చేస్తూ 8 కోట్ల 65 లక్షల 78 వేల 9503 రూపాయలను మొత్తం 128 మంది ఖాతాదారులను వాడుకొని ఆ డబ్బులను ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ పోగొట్టుకున్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఇందులో ఐసిఐసీఐ నర్సంపేట బ్రాంచ్ ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎసిపి సూచించారు. గత కొన్ని రోజుల క్రితం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో నిందితుడు బైరిశెట్టి కార్తీక్ నర్సంపేట బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా తను చేసిన నేరాలను ఒప్పుకున్నాడని తెలిపారు. పలు నేరాలకు పాల్పడిన సదరు బైరిశెట్టి కార్తీక్ ను క్రైమ్ నంబర్ 20058/203 యు సెక్షన్,120(బి), 403, 405, 406, 409 464,468,471, 420 ఐపిసి సెక్షన్ 66-( సి)( డి) ఆఫ్ ఐటీ ఆక్ట్ ప్రకారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఏసిపి తిరుమల్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!