ఏజెన్సీ మండలాలపై బిఆర్ఎస్ ప్రభుత్వం వివక్షత.

రోళ్లపాడు.ప్రాజెక్టును విస్మరిస్తే నోరువిప్పని బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు.

రైతు సంఘాల పోరాట స్ఫూర్తితో నీళ్లసాధనకు పోరాడుదాం.

అఖిలపక్ష నేతల పిలుపు.

కారేపల్లి నేటి ధాత్రి:

2016 ఫిబ్రవరి16న రోళ్లపాడు చెరువువద్ద శిలాఫలకం వేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీరు అందిస్తామని,జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఏడున్నర సంవత్సరాలు గడిచినా ఏమాత్రం పనులు చేయకుండా ఏజెన్సీ మండలాలకు ద్రోహం చేస్తున్నారని రోళ్లపాడు ప్రాజెక్టు జలసాధన కమిటీ సిపిఐ(ఎంఎల్)ప్రజాపంథా జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు,సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఖమ్మం,వరంగల్ జిల్లాల ఏరియా నాయకులు జే.సీతారామయ్య పిలుపునిచ్చారు.ఏజెన్సీ మండలాలకు సాగునీరు అందించే రోళ్లపాడును పక్కన పెట్టి మైదాన ప్రాంతాల ద్వారా ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తరలించే బిఆర్ఎస్ ప్రభుత్వ కుట్రకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమం జరగాలని వారు పిలుపునిచ్చారు.*
సింగరేణి మండల కేంద్రం కారేపల్లిలో రోళ్లపాడు సాధన సదస్సు జరిగింది.ఈ సదస్సుకు సిపిఐ మండల కార్యదర్శి బోళ్ళ రామస్వామి అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో సీతారామయ్య,వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగిస్తూ 2016లో 13వేల కోట్ల రూపాయలతో సీతారాం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టేందుకు డిజైన్ చేయబడిందని డిపిఆర్ నివేదిక ప్రకారం రోళ్లపాడు నుండి కారేపల్లి, డోర్నకల్, బయ్యారం,గార్ల మండలాల మీదుగా పాలేరుకు సాగునీరు అందించేందుకు చేసిన డిజైన్ ను విస్మరించి రోళ్లపాడు పనులు ప్రారంభించకుండా మైదాన ప్రాంతం ద్వారా నీళ్ళని తరలించటం దుర్మార్గమైందని విమర్శించారు.సీతారామ ప్రాజెక్టు ద్వారా 674000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టులో పనులు మొదలు పెట్టకుండా ఏజెన్సీ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. రోళ్లపాడు ప్రాజెక్టు శిలాఫలకం వేసిన రోజే
భక్త రామదాసు ప్రాజెక్టుకు శిలాఫలకం వేశారని దానిని 11 నెలలకే పూర్తి చేసిన ప్రభుత్వం ఏడున్నర ఏండ్లు గడిచినా రోళ్లపాడు పనులు చేపట్టకపోవడం
ఏజెన్సీ ప్రాంతంపై వివక్షతకు నిదర్శనం అన్నారు.ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులు తమ అవసరాల కోసం అధికార పార్టీలో చేరి రోళ్లపాడుపై స్పందన లేకుండా ప్రజలకు ద్రోహం చేశారని విమర్శించారు.రోళ్లపాడు ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని కారేపల్లి,కామేపల్లి,గార్ల,బయ్యారం,ఇల్లందు,టేకులపల్లి,ఆళ్లపల్లి,గుండాల,పినపాక,కరకగూడెం,బూర్గంపాడు,అశ్వాపురం,పాల్వంచ,లక్ష్మీదేవిపల్లి తదితర ఏజెన్సీమండలాల కు సీతారామ సాగర్ సాగునీరు మొదటి ప్రాధాన్యతలో అందించేందుకు పూనుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) ప్రజాపంధా డివిజన్ కార్యదర్శి ఆవుల అశోక్ సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి గూగులోతు తేజ, సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా సంయుక్త మండలాల కార్యదర్శి గుమ్మడి సందీప్, సహాయ కార్యదర్శి ఎన్ వి రాకేష్,మండల నాయకులు స్వర్ణపాక లక్ష్మీనరసి ,భాస్కర్ ,వడ్డే వెంకటేశ్వర్లు, వేముల వీరన్న ధారావత సకృ,సత్తిరెడ్డి, పాయం లక్ష్మీనారాయణ,రావుల నాగేశ్వరరావు, కొయ్యల శ్రీను, చల్ల రాజు బీమిరెడ్డి రాము, తాటి పాపారావు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *