ఏఈలో మస్తు షేడ్లున్నయ్‌?

కాంట్రాక్టర్ల బిల్లులకు మార్గం సుగమం చేసిన నేటిధాత్రి…

నేటిధాత్రికి కాంట్రాక్టర్‌ కృతజ్ఞతలు…

నేటిధాత్రికి క్యూ కడుతున్న ఏఈ బాధితులు…

తమకు జరుగిన అన్యాయాలను గురించి చెబుతూ కన్నీటి పర్యంతమౌతున్నారు…

నేటిదాత్రిని ఆశ్రయించిన కాంట్రాక్టర్‌కు ఆగ మేఘాల మీద చెల్లించిన బిల్లులు!

బాధిత కాంట్రాక్టర్‌ నేటిధాత్రిని సంప్రదించాడని తెలియగానే బిల్లులు క్లియర్‌!

డిఈ కార్యాలయంలోనే రూ.30వేలు తీసుకున్న ఏఈ?

సకల కలలు ప్రదర్శిస్తున్న ఏఈ?

స్ధానిక కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం గిట్టని బినామీ కాంట్రాక్టర్లు?

కాంట్రాక్టులకు బిల్లుల చెల్లింపుతో బినామీ కాంట్రాక్టర్లు మనస్తాపం?

బాధితులకు న్యాయం జరగడం ఏఈకి కూడా ఇష్టంలేదు?

సానుభూతి కల్పన కోసం బిల్లుల చెల్లింపులు?

 కలెక్టర్‌ గారు ఒక్కసారి మహదేవ్‌ పూర్‌ మండలంపై లుక్కెయండి?

ఏఈ లీలలు తెలుసుకోండి?

బాధితులపై ఏఈ వేధింపుల ఆడియోలు, వీడియోలు త్వరలో పాఠకుల మందుకు?

తప్పు చేశానన్న పశ్చాత్తాపం ఏఈకి కించిత్‌ కూడా లేదు. కాంట్రాక్టులు చేసుకునే వారికి అన్యాయం చేశానన్న బాధ అసలే లేదు.

అక్రమాలకు పాల్పడడం తప్పన్న భావనే లేదు. లంచాలు తీసుకోవడం పొరపాటు అని కూడా అనుకోవడం లేదు… ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశానన్నది కూడా కనిపించడం లేదు. అత్త సొమ్ము అల్లుడు దోచుకొని దాచుకున్నట్లే వుంది. అవసవరం వున్నా లేకున్నా, కమీషన్లకు కక్తుర్తి పడి అడ్డగోలు సంపాదనకు తెగబడ్డాడన్నది కూడా లేదు. కాకపోతే పరువు అనేది ఏఈకి మాత్రమే ఒకటుందంట. అది ఆయనకు మాత్రమే పోతుందట. ప్రజల సొమ్ముకు రక్షణగా వుండాల్సిన కుర్చీలో కూర్చుకొని, ఖజానా లూటీ చేస్తే పరువు పోతుందని తెలియదా? ప్రభుత్వ సొమ్మంతా నీళ్లలా ఖర్చు చేసినప్పుడు గుర్తు రాలేదా? చేసిన పనులే, మళ్లీ మళ్లీ చేసి నిధులు డ్రా చేసుకున్నప్పుడు పరువు అవసరం రాలేదు. గుత్తేదారులుగా తన వాళ్లను పెట్టుకొన్ని స్ధానిక కాంట్రాక్టర్ల పొట్టగొట్టినప్పుడు తెలియలేదు. ఇప్పుడు వియ్యంకుడుకి తన అవినీతి గురించి తెలిసిందట. బంధువులు ఏమనుకుంటున్నారో అన్న దిగులు పెరుగుతోందట. తాజాగా ఎదురైన వారి సానుభూతి కోసం ఏఈ పడుతున్న ఆరాటం…? ఏఈ చేసిన తప్పులు, మేసిన సొమ్ములు కళ్లముందు కనిపిస్తుంటే ఎవరైనా అయ్యో అంటారా? ద్రోహనికి పాల్పడి, ప్రజా ధనం లెక్కలేని తనంగా ఖర్చు చేసి, కమీషన్లకు కక్కుర్తి పడేవారిని సమాజం క్షమిస్తుందా?

                   నిజానికి మహాదేవ్‌ పూర్‌ ఏఈలో మస్తు షేడ్స్‌ వున్నాయన్నది, ఆయన వల్ల ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టర్లే అంటున్నారు. అది కూడా ఒక్కొక్కటిగా నేటిధాత్రి దృష్టికి వస్తుండడంతో విని విస్తుపోవాల్సివస్తుంది. తాను తప్పు చేయలేదని నమ్మించేందుకు, బాధ పడుతున్నట్లు కలరింగ్‌ ఇస్తూ మొసలి కన్నీరు కార్చుతున్నారట. ఉన్నతాధికారులకు కావాల్సినవి నిజాలు…రికార్డులు…ప్రభుత్వ లెక్కలు…పడిన బొక్కలు…చేసిన పనులు…అధికారులు ప్రభుత్వ సొమ్ము సేవ్‌చేశారా? లేక షేవ్‌ చేశారన్నది చూస్తారు. తనపై మీడియాలో కధనాలొస్తున్నాయని వాపోవడం కన్నా, తాను చేసినపనులపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్న ప్రకటన ఏఈ ఎందుకు చేయడం లేదు? తాను సచ్చీలుడినన్నది ప్రచారం చేసుకుంటే సరిపోదు. తాను చేసినపనులు చెప్పాలి. ఖజానాకు మిగిల్చిన లెక్కలు చెప్పాలి. అంతే గాని ఉన్నతాధికారులకు వేడుకోలుతో ముగిసిపోదు. చేసిన పాపం వెంటాడక మానదు. కొంత మందితో నేటిధాత్రికి రాయభారాలు నెరిపేందుకు ఏఈ ప్రయత్నం చేశాడు. అందుకు నేటిధాత్రి ఒప్పుకోలేదు. దాంతో అది కుదరలేదు. దారులన్నీ మూసుకుపోవడంతో తన చపలచిత్త స్వరూపాన్ని కలగలపి, అపరిచితుడిని తలపించే నటనా విన్యాసం చూపిస్తున్నాడు. 

                 నేటి ధాత్రిని ఓ బాధిత కాంట్రాక్టర్‌ కలిశాడన్న సంగతి తెలిసుకున్న ఏఈ రాత్రికి రాత్రి బిల్లులు చెల్లించేశారు. ఏళ్లకేళ్లు నెలల తరబడి ఏఈ చుట్టూ తిరుగుతున్నా బిల్లులు ఇవ్వడానికి మొండికేసిన ఏఈ ఒక్క రోజులో బిల్లులు చెల్లించేశారు. గతంలో ఓ కాంట్రాక్టరుకు ఇవ్వాల్సిన బిల్లులో కొంత ఇచ్చేందుకు ముందు ముప్పై వేలు వసూలు చేశాడు. సాక్ష్యాత్తు డీఈ కార్యాలయంలోనే ఏఈ ముప్పై వేలు తీసుకున్నట్లు బాధితుడు వెల్లడిరచాడు. అదే బాధితుడు మిగతా బిల్లుల కోసం కాళ్లరిగేలా తిరిగినా బిల్లులు ఇవ్వలేదు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని మొత్తుకున్నా కనికరించేలేదు. కాని నేటిధాత్రిలో వరస కథనాలు వస్తుండడం తెలిసి ఓ బాదితుడు నేటిధాత్రికి వివరాలు అందించాడు. ఆ బాధితుడు నేటిధాత్రితో మాట్లాడినట్లు తెలిసిన వెంటనే మరుసటి రోజు బ్యాంకులు తెరిచిన వెంటనే మిగతా సొమ్ములో మరింత భాగం బిల్లులు వచ్చేశాయి. సహజంగా బిల్లులు చేసి, మంజూరు చేయడానికి కొంత సమయం తీసుకుంటారు. కాని బాధిత కాంట్రాక్టర్‌ అందుబాటులో లేకున్నా, కింది స్ధాయి సిబ్బంది చేత హుటాహుటిన పనులు సర్వేచేయించి, ఏఈ బిల్లులు ఇచ్చాశాడు. అయినా ఇంకా పూర్తిగా బాధిత కాంట్రాక్టర్‌కు మొత్తం బిల్లులు చెల్లించలేదు. తనకు కమీషన్‌ రూపంలో రావాల్సినంత సొమ్మును పక్కన పెట్టి, మరీ బిల్లు మంజూరు చేశాడు. అంటే ఇప్పటికీ ఏఈ తీరు మారలేదు. తన దోడిపీ ఆపలేదు. ఇలా బిల్లులు రాకుండా చేసిన అప్పులకు వడ్డీల మీద వడ్డీలు చెల్లిస్తున్న వారు అనేకం వున్నారు. వాళ్లను కదిలిస్తే చాలు…కన్నీటి పర్యంతమౌతున్నారు. నేటిధాత్రికి ఫోన్లు చేసి తమ బాధలు వెళ్లగక్కుకుంటున్నారు. తమ పనులు ఆగిపోయి, బిల్లులు ఆగిపోయి, కాంట్రాక్టు పనులు ఆగిపోయి, అప్పులోళ్లకు భయపడుతూ, బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నామని వారు చెబుతున్నారు. అలాంటి వారి ఉసురు పోసుకుంటూ మరో వైపు తన పరువు గురించి ప్రచారం చేసుకుంటున్నాడట. చేసినవే తప్పు పనులు. తప్పుడు పనులు. నేరమయమైన పనులు. పైగా తన దోడిని వెలుగులోకి తెచ్చిన నేటిధాత్రిపై నిందలు ఎలా వేయొచ్చన్నదానిపై సమాలోచనలు జరుగుపుతున్నాడట. కనీసం బాధితులైన చిన్న చిన్న కాంట్రాక్టర్లను ఆదుకుందామన్న ఆలోచన చేయడం లేదు. వారికి బిల్లులు చెల్లించాలన్న సోయి లేదు. . బాధితులకు పరవు, మర్యాధలుండవా? 

                        ఉన్నతాధికారుల కార్యాలయంలోనే యదేచ్చగా బాధితుల వద్దనుంచి కమీషన్ల పేర డబ్బులు తీసుకున్న ఏఈ..అదే ఉన్నతాధికారులకు తాను సచ్చీలుడినని సర్టిఫికెట్లు కోసం పాకులాడుతున్నాడట…ఉన్నతాధికారులు ఒక్కసారి ఏఈ నేతృత్వంలో జరిగిన పనులపై విచారణ చేపడితే తెలుస్తుంది. అప్పుడు సర్టిఫికెట్‌ ఏ సర్టిఫికెట్‌ ఇవ్వాలో తెలిపోతుంది? అంతే కాని తోటి ఉద్యోగి అయిన ఏఈ మధనపడుతున్నాడని, ఆయన నటనా కౌశలాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగంలో పెద్దలు పాత్ర కూడా అని ప్రజలు అనుమానించాల్సివస్తుంది. జిల్లా కలెక్టర్‌తో తాను సచ్చీలుడిని అని చెప్పుకున్న ఏఈపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించాలని ప్రజలు కోరుతున్నారు. పనుల పర్యవేక్షణకు కమిటీ వస్తే గుట్టు తెలుస్తుంది. గూడుపుఠాణి ఎంత వున్నదన్నది తేలిపోతుంది. జనం అంటున్నారు. నేటి ధాత్రి కూడా అదే చెబుతోంది. చేసిన తప్పులు మళ్లీ జరక్కుండా చూసుకునేది పోయి, మళ్లీ మళ్లీ తప్పులుచేయడానికి, దోచుకొని దాచుకోవడానికి పరువును ముందు వేసుకుంటే ఎవరూ నమ్మరు… తప్పులు వెలుగు చూడక మానవు. తిన్న జనం సొమ్ము కక్కించకమానరు….అధికారులు శిక్షించక మానరు…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!