
బోయినిపల్లి,నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం దుండ్రపల్లి గ్రామానికి చెందిన గుంటి అరుణ్ కుమార్ ఎస్సై ఉద్యోగానికి ఎంపిక కావడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం గుంటి అరుణ్ ను తన నివాసంలో కలిసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓ సామాన్య రైతు కుటుంబానికి చెందిన
అరుణ్ కుమార్
సివిల్ ఎస్సైగా ఎంపిక కావడం అభినందనీయమని కొనియాడారు. అరుణ్ కుమార్ ఎస్సై ఉద్యోగంలో రాణించి, గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగుల కనుకయ్య, బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు బోయిని ఎల్లేష్, ఎండీ బాబు, గంగిపెల్లి లచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.