-ఎర్రబెల్లిని ఢీ కొట్టడం అంత సులువు కాదు.
-ఎర్రబెల్లి ఉమ్మడి వరంగల్ జిల్లాకే రాజకీయ వరం.
-ఎర్రబెల్లి జనం గుండెల్లో సంజీవని.
-ఉమ్మడి జిల్లాలోనే తిరుగులేని నేత.
-ఎర్రబెల్లి చేసేది సేవా రాజకీయం…
-ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క ఎర్రబెల్లికే అది సాధ్యం.
-ప్రాంతాలకు అతీతంగా సేవ చేసే నాయకుడు.
-నాలుగు దశాబ్దాల బలమైన సేవా పునాదులు
-దయన్నా! అంటే దయచూపిస్తాడు.
-ఆపద అంటే ఆదుకుంటాడు.
-ఆరోగ్యాల విషయంలో నియోజకవర్గం మొత్తం తండ్రిలా కాపాడుకుంటాడు.
-2014 నుంచి పాలకుర్తి దశ మార్చిన నేత.
-2014 డెంగ్యూ జర్వాల నుంచి ప్రాణాలను కాపాడిన ప్రాణదాత.
– ప్రతి ఊరిలో అంబులెన్స్ ఏర్పాటు చేసి, వందల మంది ప్రాణాలు కాపాడాడు.
-హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి, వైద్యం అందించాడు.
-పరిస్థితిని బట్టి అంబులెన్స్ ల ద్వారా సొంత ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించాడు.
-పల్లెలలను సుందరంగా తీర్చిదిద్దాడు.
-నియోజకవర్గంలో ప్రజలు సీజనల్ జ్వరాల బారిన పడకుండా చూసుకుంటున్నాడు.
– కరోనా కాలంలో ఎంతో మందిని ఆదుకున్నాడు.
– పెద్ద ఎత్తున ప్రజల ఆహార అవసరాలు తీర్చాడు.
– వందలాది మందికి ఉచితంగా కరోనా చికిత్సలు చేయించాడు.
-అతి ఖరీదైన వైద్యం కూడా సొంత ఖర్చులతో అనేక మందికి చెయించాడు.
– నియోజకవర్గం సుందరంగా తీర్చిదిద్దాడు.
-పంచాయతీకి రాజ్ శాఖకు దేశంలోనే అనేక అవార్డులు తెచ్చిపెట్టాడు.
-ప్రజలకు అండగా వుంటూ, అభివృద్ధిలో నియోజకవర్గాన్ని ముందుంచాడు.
-ఎదురులేని రాజకీయం చేయడంలో దిట్టు.
-తిరుగులేని నాయకత్వం ఎర్రబెల్లి సొంతం.
-ఓటమెరగని నేతగా రికార్డు.
-ఎన్ఆరైలు టూరిస్టులు…
-వచ్చి వెళ్లేవారు ప్రజాసేవ చేయలేరు.
-కేవలం రాజకీయాల కోసం వచ్చేవారు…ఎన్నికల కోసమే వస్తారు.
-ఓడిపోయి జనం ముఖం చూడని వాళ్లు ఎంతో మంది వున్నారు.
-నాలుగు రోజుల రాజకీయ అవతారులను ప్రజలు నమ్మరు.
– ప్రజల గుండెల్లో వున్న ఎర్రబెల్లిని దూరం చేసుకోరు.
హైదరబాద్,నేటిధాత్రి:
రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయకర్‌రావు ముందు ఎన్నికల బరిలో నిలబడం అంటే పులి ముందు ప్లూట్ ఊదడమే అవుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఓటమి అంటే ఎమిటో తెలియదు. అది ఎలా వుంటుందో కూడ తెలియదు. ఎందుకంటే ఆయనకు ప్రజాభిమానం ఎక్కువ. ప్రజాదరణ ఎక్కువ. ప్రజలను గుండెల్లో పెట్టుకునే నాయకుడు దయాకర్‌రావు. అందుకే నాలుగు దశాబ్ధాలుగా ఆయన ఎదురులేని నాయకుడిగా, తిరుగులేని ప్రజాప్రతినిధిగా వెలుగొందుతున్నారు. ప్రత్యక్ష్య ఎన్నికల ప్రస్దానంలో ఆయను ఎదరులేదు. ఆయనకు ఎదురుగా నిలబడిన నాయకులు మళ్లీ రాజకీయాలు చేసింది లేదు. ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయన పెద్దగా ప్రయాస పడిరది కూడా లేదు. ఎంతో సునాయాసంగా ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ వచ్చారు. గతంతో 2004లాంటి కాంగ్రెస్ ప్రభంజన కాలంలోనూ గెలిచారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత కూడా ఆయన గెలిచారు. అంటే కాలమేదైనా, పరిస్ధితులు ఏవైనా, రాజకీయాలకు అతీతమైన ప్రజాభిమానం ఎర్రబెల్లి దయాకర్‌రావు సొంతం. గతంలో ఆయన వరసగా వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు. ఆ తర్వాత డీలిమిటేషన్ కారణంగా పాలకుర్తినుంచి పోటీ చేస్తున్నారు. అప్రతిహాతంగా గెలుస్తూ వస్తున్నారు. మధ్యలో పార్లమెంటుకు కూడా పోటీ చేసి గెలిచిన ఘనత ఎర్రబెల్లి దయాకర్‌రావుది. ఇలా వరసగా ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ గెలిపిస్తూ వస్తున్నారంటే, ప్రజలంటే ఆయనుకు ఎంత నమ్మకంతో తెలుసుకోవచ్చు. ప్రజలకు ఆయననంటే ఎంత అభిమానమో తెలుసుకోవచ్చు. అలాంటి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రతిపక్షంలో వున్నప్పుడు కూడా ఆయన ఢీ కొట్టిన నాయకుడు లేడు. ఎప్పుడూ మంచి విజయాలే..మెజార్టీ గెలుపులే. ఆయన రాజకీయ జీవితం మీద దెబ్బకొడదామని చాలా మంది చూశారు. కాని వాళ్లే దెబ్బతిన్నారు. ఆయన మీద ఆధిపత్యం చేయాలని చూలా మంది చూశారు. కాని వాళ్లే అడ్రసు లేకుండాపోయారు. అంతే కాదు ఎర్రబెల్లిని రాజకీయంగా ఎదుర్కొలేక, నిలబడలేక, ఓపికలేక, ఇక తమ వల్ల కాదని చాలా మంది క్రియాశీల రాజకీయాలకు కూడా చాలా మంది దూరమయ్యారు. కాని ఎర్రబెల్లి ఎదుగుతూనే వస్తున్నాడు. గెలుస్తూ విజయాలతో వారికి సవాలు విసురుతూనే వున్నాడు. ఎర్రబెల్లిని అణిచివేయాలని కూడా కొందరు చూశారు. కాని వాళ్లే ఇప్పుడు చేష్టలుడిగి చూస్తున్నారు. దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న ఎర్రబెల్లిని చూస్తూ, కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. ఆయన కీర్తి ప్రతిష్టలను చూసి, కుళ్లుకుంటున్నారు. అదీ ఎర్రబెల్లి రాజకీయం అంటే..ప్రజాసేవకు ఆయన ప్రజలనుంచి పొందుతున్న ఆదరణకు నిదర్శనం. ప్రతిపక్షంలో వున్నప్పుడు కూడా ఎర్రబెల్లి హవా ఆగలేదు. ప్రజల్లో ఆయనకు ఆదరణ ఇసుమంత కూడా తగ్గలేదు. ఆయన ఎక్కడా తలవంచలేదు. ఆయనను నమ్మి ఎనుకున్న ప్రజలకు నష్టం చేయలేదు. ఆయా పార్టీలకు తలవంపులు తేలేదు. దుష్టపన్నాగాలు ఏనాడు పన్నలేదు. చాటామాటు రాజకీయాలకు ఒడిగట్టలేదు. ఏది చెప్పినా ముక్కుసూటిగానే, ఏది చేసినా నిర్మొహమాటంగానే చేశారు. అదే ప్రజలు మెచ్చారు. ఎర్రబెల్లికి అండగా నిలుస్తున్నారు. ఆదరిస్తున్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా తన రాజకీయం తాను చేసుకుపోవడం, ప్రజలకు మేలు చేయడం, నియోజకవర్గం అభివృద్ది చేయడం తెలుసు. తనకు అప్పగించిన మంత్రిత్వశాఖను సమర్ధవంతంగా నిర్వహించడం మాత్రమే ఎర్రబెల్లికి తెలుసు. వివాదాలు ఎన్ని చుట్టుముట్టినా, మొక్కవోని ధైర్యమే ఆయన సొంతం..అదే ఆయన విజయాలకు చిహ్నం. ప్రజాసేవకు నిదర్శనం.
ప్రజాస్వామ్య వ్యవస్ధలో ఎవరైనా రాజకీయాలు చేయొచ్చు. ప్రజాసేవ చేయొచ్చు.
కాని ఇటీవల ప్రజా సేవ అనేదానికన్నా, రాజకీయం అన్నది ఎక్కువ ప్రచారంలోకి వచ్చి, ఎంతైనా ఖర్చు చేస్తా..ఎన్నికల్లో నిలుస్తా? అనుకుంటున్నారు. కాని ఒక్కసారి రాజకీయంలోకి దిగితే గాని అసలు లోతు తెలియదు. ప్రజా సేవతో రాజకీయం చేయడం వేరు..రాజకీయాల కోసం ప్రజాసేవ ముసుగేసుకోవడం వేరు. ఈ రెండు తెలియక ఇటీవల కాలంలో చాలా మంది తెలియని తనంతో రాజకీయాలను కలుషితం చేస్తున్నారు. అయినా ప్రజలు ఎంతో విజ్ఞలు. రాను రాను రాజకీయాలంటే అలుసైపోతున్నాయి. పైసలుంటే చాలు రాజకీయాలు చేయొచ్చనే భ్రమలు బాగా పెరిగిపోతున్నాయి. చదువుకొని భవిష్యత్తును నిర్ధేశించుకన్నప్పుడు ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన వుండదు. కాని నాలుగు పైసలు సంపాదించగానే రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారు. సేవ ముసుగులో పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా చాలా మంది దేశంలో రాజకీయాలను కలుషితం చేస్తున్నారు. ముఖ్యంగా వైద్య విద్య చదువుకున్న వారు వైద్యులుగా తమ ప్రాంతాలకు సేవ చేయక, విదేశాలకు వెళ్లి అక్కడ స్ధిరపడి, డబ్బు సంపాదించుకొని, రాజకీయాలు చేయాలన్న ఆశతో వచ్చినవారు చాల మంది వున్నారు. అలాంటి వారిలో మరో ఎన్ఆర్ఐ కుటుంబం పాలకుర్తిలో రాజకీయం చేయాలని చూస్తోంది. కాని వారికి కూడా తెలుసు. ఎర్రబెల్లిదయాకర్‌రావును ఎదిరించి రాజకీయాలు చేయడం అంత సులువైన పని కాదు. అయినా రాజకీయాలు చేయాలన్న ఆశతో పాలకుర్తి రాజకీయాల్లో వేలుపెడుతున్నట్లు సమాచారం. మా తాతలు నేతలు నాకారు…మా మూతులు వాసన చూడండి అన్నట్లు ఎప్పుడో తమ కుటుంబం పాలకుర్తికి సేవ చేసింది. ఇప్పుడు రుణం తీర్చుకోండని ప్రజలను ఆదేశిస్తున్నట్లుగా రాజకీయం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి వారు ఎంత మంది వచ్చినా పరోక్షంగా మంత్రి దయాకర్‌రావుకే మేలు కలుగుతుంది. ఎందుకంటే దయాకర్‌రావు అవకాశ వాద రాజకీయాలు ఏనాడు చేయలేదు.
అవకాశా వాదంతో రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలను నమ్ముకొని రాజకీయం చేశాడు. రాజకీయాలు చేస్తున్నా ప్రజాసేవను ఎంతో ఇష్టంగా చేస్తుంటాడు. ఆయన చేసిన చేవలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ నాయకుడు ఇప్పటి వరకు చేయలేదు. రాజకీయాలు చాల మంది చేశారు. దానితోపాటు ప్రజా సేవ చేసినవాళ్లున్నారు. కాని దయాకర్‌రావు మాత్రం రాజకీయాల కోసం మాత్రమే ప్రజాసేవ ఏనాడు చేయలేదు. ప్రజలకు ఏనాడు ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. అది ఆర్ధికపరంగానైనా, ఆరోగ్యపరంగానైనా అన్నా అని వెళ్తే చేసే సాయాలు అన్నీ ఇన్నీ కావు. ఆయనతో మేలు పొందని కుటుంబం అంటూ వుండదంటే అతిశయెక్తి కాదు. గతంలో ఆయన చేసిన సేవ కార్యక్రమాల గురించి పక్కన పెడితే, తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరంలోనే సీజనల్ వ్యాధులు విసృతంగా ప్రభలాయి. ఆ సమయంలో పాలకుర్తి నియోజకవర్గంలో పెద్దఎత్తున డెంగ్యూ జ్వరాలు ప్రజల ప్రాణాలు తీశాయి. ఒక రకంగా చెప్పాలంటే వైద్యులు కూడా పల్లెల్లోకి వెళ్లి వైద్యం చేయాలంటే భయపడేంతగా ఇబ్బందికరపరిస్దితులు ఎదురయ్యాయి. అలాంటి సమయంలో ఆయన అనేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఆంబులెన్స్‌లు ఎప్పుడూ సిద్దంగా వుంచారు. ఏ గ్రామంలో ఏ ఒక్కరి పరిస్ధితి విషమించినా వెంటనే వరంగల్, హైదరాబాద్‌లలో ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి ఉచిత వైద్యం అందించి అనేక మంది ప్రాణాలు కాపాడిన నాయకుడు దయాకర్‌రావు. ఇక కరోనా సమయంలో ఆయన చేసిన సేవ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ నాయకుడు చేయలేదు. ఏ సామాజిక వేత్త చేయలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కరోనా సమయంలో మంత్రి దయాకర్‌రావు తన నియోజవకవర్గంలోనే కాదు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయన అనేక రకాల సేవంలందించాడు. ముఖ్యంగా వైద్యపరమైన అవసరాలు తీర్చాడు. పేదలకు ఎంతో ఖరీదైన వైద్యం కూడా ఉచితంగా చేయించాడు. రెమిడీస్ వీర్‌లాంటి ఇంజక్షన్లు ఎంతో మంది పేదలకు ఉచితంగా అందించి, వారి ప్రాణాలు కాపాడాడు. ఎంతో మందికి ఆహార అవసరాలు తీర్చాడు. అంత గొప్పది దయాకర్ రావు సేవ. ప్రజలు ఇప్పటికీ ఆనాటి సేవలు ఎవరూ మర్చిపోలేదు. కాని రాజకీయాలు చేసిన వారు మర్చిపోయారు. ప్రజలను ఏమార్చాలనుకునేందుకు ప్రయత్నిస్తున్నవారు మర్చిపోయారు. కరోనా కాలంలో వారు ఎవరూ లేరు. ప్రజల మీద ప్రేమ చూపలేదు. వారికి సేవ చేయలేదు. ఇప్పుడు రాజకీయాలు చేయడానికి వస్తున్నారు. ప్రజలు ఎంతో విజ్ఞులు. మంత్రి దయాకర్‌రావును కాదనుకోలేరు. ఇది దయాకర్‌రావు మీద రాజకీయం చేయాలనుకున్నవారందరూ నేర్చుకున్న పాఠమే..ప్రతిసారి ఆయన కొత్తగా రుచి చూపిస్తున్నదే…