కేసముద్రం(మహబూబాబాద్),నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లాఎన్ ఎస్ యు ఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన పెరమండ్ల చరణ్ గౌడ్ ను నియమించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు బలమూరి వెంకట్,ఎన్ ఎస్ యు ఐ,రాష్ట్ర ఇంచార్జ్ అక్షయ్ లాకర్,మరియు మార్క అభినవ్ గౌడ్
ఎన్ ఎస్ యు ఐ,జాతీయ కోఆర్డినేటర్ మరియు మహబూబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చంద్ రెడ్డి,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కంకర అయ్యప్ప రెడ్డి,మహబూబాబాద్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ మురళి నాయక్,కాంగ్రెస్ పార్టీ సోదరులకు ఎన్ ఎస్ యు ఐ,మిత్రులందరికీ నాపై నమ్మకం ఉంచి నాకు ఈ పదవి అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ కోసం కష్టపడి శ్రమిస్తానని,ఈ పదవి వల్ల మరింత బాధ్యత పెరిగిందని అందరితో స్నేహభావంతో కలుపుకొని ముందుకు వెళ్తానని అన్నారు.ఈ బాధ్యతలు అప్పగించిన మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.