ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోడ్డుకు మోక్షం ఎప్పుడో! *శాయంపేట- ఆత్మకూర్ రోడ్డు పని పూర్తి చేయలేక నిరీక్షణ.

డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు అస్తవ్యస్తం శాయంపేట నేటి ధాత్రి :

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రం నుండి ఆత్మకూరు వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ భాగంలో గత ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభించారు. రోడ్డు వెడల్పు భాగంలో ఇండ్లు కోల్పోయిన ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిసి రోడ్ పక్క భాగంలో డ్రైనేజీ లేక మురికి నీరు ఇంటి ఆవరణంలో ముందు భాగంలో విచ్చలవిడిగా ప్రయాణిస్తుంది ప్రజలందరూ, వాహనదారులు కూడా ఇబ్బందుల పాలవుతున్నారు. ఇల్లు కోల్పోయిన వారికి త్వరలో డబుల్ బెడ్లను ఇస్తామని స్థానిక ఎమ్మెల్యే ప్రజల పక్షాన తెలియజేశారు ఇప్పటికైనా ఎమ్మెల్యే వాదన నిజం కాదా అలాగే అభివృద్ధి అనేది చాలాకాలం పడుతుందా సమస్య ఎప్పుడు ముగుస్తుందో నాయకులు ఆలోచనలు చేయండి అని ఇండ్లు కోల్పోయిన బాధితులు వాపోతున్నారు.డామేజ్ అయినా కాలువ నిర్మాణం కూడా చేయలేకపోతే, ప్రజలు అనారోగ్య పాలవుతారు. ప్రజలు వాహనదారులకు ఇబ్బందుల అవుతున్నాయి. ఈ సమస్య తొందరలోనే పూర్తి చేయాలని ప్రజలు దుఃఖంతో వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే తొందరగా పని పూర్తి చేయాలని ప్రజలు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు.