రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంపులోని సీతా రామాంజనేయ,కాల్వొడ్డున ఉన్న గుంట మల్లేశ్వర స్వాముల ఆలయాలను సందర్శించారు.కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఎంపీ రవిచంద్ర,తన సన్నిహితులు మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి గణేష్ లతో కలిసి, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు .వేద పండితులు పూలమాలలు, కండువాలతో వారిని సత్కరించి ఆశీర్వచనాలు పలికారు,తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మల్లేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు అన్నదానం చేసేందుకు లక్ష రూపాయలు అందించారు.