రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి సీఏంఆర్ఏఫ్ ద్వారా 2,00,000 రూపాయల లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC)ఇప్పించారు.ఎంపీ రవిచంద్ర తన స్వగ్రామం ఇనుగుర్తికి చెందిన నిరుపేద దుబ్బాక రవి 22ఏళ్ల కుమారుడు రణధీర్ అనారోగ్యానికి గురై హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసి మెరుగైన చికిత్స కోసం సీఎంఆర్ఏఫ్ కు సిఫార్సు చేశారు.ఎంపీ వద్దిరాజు సిఫార్సు లేఖను అధికారులు వెంటనే పరిశీలించి రూ.2,00,000 LOC మంజూరు చేశారు.ఇందుకు సంబంధించిన పత్రాన్ని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రణధీర్ తండ్రి రవికి బుధవారం ఎంపీ రవిచంద్ర అందజేశారు.ఈ సందర్భంగా రవి ఎంపీ వద్దిరాజుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.