ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన మహిళా బిల్లు సాధించుకున్నట్లే ఓబీసీ రిజర్వేషన్లు తెచ్చుకుందాం:ఎంపీ రవిచంద్ర
చాకలి ఐలమ్మ వంటి ధీరవనితలు అందించిన పోరాట స్ఫూర్తితోటే మహిళా బిల్లును సాధించుకున్నాం:ఎంపీ రవిచంద్ర
మహిళా బిల్లు ఆమోదంతో కేసీఆర్, బీఆర్ఎస్ ప్రతిష్ఠ మరింత పెరిగింది:ఎంపీ రవిచంద్ర
ఐలమ్మ పేరుతో ఒక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్త:ఎంపీ రవిచంద్ర
ఖమ్మం జిల్లా నేటిదాత్రి
ఖమ్మం టౌన్.ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా ఖమ్మంలో ఎంపీ రవిచంద్ర మంత్రి అజయ్ కుమార్ తో కలిసి ఘన నివాళులర్పించారు
మహానేత చంద్రశేఖర రావు నాయకత్వాన మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ల అమలునకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసుకున్నామని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.రాణీ రుద్రమదేవి,చాకలి ఐలమ్మల పోరాట స్ఫూర్తితోటే ఇది సాధ్యమయిందన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన అసెంబ్లీ తొట్టతొలి సమావేశాలలో మహిళా,ఓబీసీ రిజర్వేషన్ల బిల్లులపై ఏకగ్రీవ తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు.అలాగే, ఈ అంశాలను మరోసారి గుర్తు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీకి కేసీఆర్ లేఖలు కూడా రాశారన్నారు.మహిళలతో పాటు ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరాన్ని,ఐలమ్మ పోరాట పటిమను పార్లమెంటులో తాను వివరించానన్నారు.చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా ఖమ్మంలోని ఆమె విగ్రహానికి సోమవారం ఉదయం ఎంపీ రవిచంద్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతంలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం జరిగిన సభలో ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ, చిట్యాల ఐలమ్మ(చాకలి ఐలమ్మ) పేరిట ఒక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా మంత్రి అజయ్ కుమార్ తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేస్తానన్నారు.అదేవిధంగా కేసీఆర్ మార్గదర్శనంలో సభలు, సమావేశాలు పెట్టి,ఉద్యమించి ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకుందామని, అప్పుడే మహిళా రిజర్వేషన్ల అమలునకు సార్థకత చేకూరుతుందని వద్దిరాజు చెప్పారు.కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం,నగర మేయర్ నీరజ,స్థంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దోరేపల్లి శ్వేత, బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు పగడాల నాగరాజు, తెలంగాణ బీసీ ఫ్రంట్ ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కొత్తకొండ్ల శ్రీలక్ష్మీ, బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.