రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు.తన సొంతూరు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి అంబులెన్స్ అందించారు.రవిచంద్ర తాను ఎంపీ అయిన కొద్ది రోజుల్లోనే ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న ఇనుగుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయించడమే కాక అన్ని విధాలా అభివృద్ధిపరుస్తున్నారు.తాజాగా ఇప్పుడు తన ఎంపీ నిధుల నుంచి నిధులు మంజూరు చేసి ఇనుగుర్తి,దాని చుట్టుపక్కల గ్రామాల ప్రజల అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్ అందించారు.
దీనిని శనివారం వారి సోదరులు వద్దిరాజు కిషన్, వద్దిరాజు దేవేందర్ లతో కలిసి స్థానిక శాసనసభ్యుడు శంకర్ నాయక్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి అంబరీష్, ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ రాంమూర్తి, సింగిల్ విండో ఛైర్మన్ దీకొండ వెంకన్న గౌడ్,సంబంధిత అధికారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.