ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యంలో పూల రవీందర్,పుట్టం పురుషోత్తంల నాయకత్వాన చండూరుకు తరలివచ్చిన మున్నూరుకాపులు
టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా జరిగిన ర్యాలీ,సభ దిగ్విజయం
టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, సర్థార్ పుట్టం పురుషోత్తంల నాయకత్వాన మున్నూరుకాపులు చండూరుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.మునుగోడు నియోజకవర్గంలో గ్రామగ్రామాన ఉన్న మున్నూరుకాపులు ఆకుపచ్చని, గులాబీ కండువాలు మెడలో ధరించి మండుటెండలో మోటార్ సైకిళ్లపై తరలి వచ్చారు. టిఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కే.టీ.రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపు,సభకు వేలాదిమంది తరలివచ్చి దిగ్విజయం చేశారు.కేటీఆర్ 45 నిమిషాలకు పైగా చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.చండూరుకు తరలి వచ్చిన మున్నూరుకాపు ప్రముఖులలో ఆకుల రజిత్,వాసుదేవుల వెంకటనర్సయ్య, సకినాల రవికుమార్, జెన్నాయికోడే జగన్,సోమ నారాయణ,గంధం నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.