ఎండాకాలంలో ప్రజల దాహాన్ని తీర్చేది మట్టి కుండ….

గతంలో మట్టి కుండలోనే పెరుగు , సల్ల చేసేవాళ్ళు….

ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన మట్టికుండలు….

స్టీల్ వైపే ప్రజల మొగ్గు…. 

కొల్చారం , ( మెదక్ ) నేటి ధాత్రి :

మట్టితో మానవుడిది విడదీయలేని అనుబంధం. అందుకే మట్టి పాత్రల పై మళ్ళీ ఆసక్తి చూపుతున్నాడు. మన పూర్వీకులు మట్టితోనే ఎన్నో రకాల పాత్రల్ని తయారు చేసి వాటి వినియోగంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో అల్యూమినియం, స్టీల్ ఇతరత్రా కెమికల్స్తో కూడిన రకరకాల వస్తువులు మార్కెట్లను ముంచెత్తాయి. దీంతో ఆరోగ్యం కూడా తరిగిపోతూ వచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ మట్టి పాత్రలకు ఆదరణ పెరిగింది. వీటి వినియోగం తో ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చు. మట్టి పాత్రలు రాగి పాత్రలు ఆరోగ్యానికి మంచివని మన పూర్వీకులు వినియోగించేవారు. ఇప్పటికీ పల్లెల్లో కట్టెల పొయ్యి పైన మట్టిపాత్రలో వంట చేయడం కనిపిస్తున్నది. కొన్నేళ్ల కిందట వీటి ఉపయోగం చాలా ఉండేది. కానీ కాలక్రమేణా వినియోగం తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం వినియోగిస్తున్న పాత్రల తయారీలో రసాయనాలను వినియోగిస్తుంటారు. వీటిని వాడుతున్న ప్రజలకు నేడు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతుoడంతో ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్న ప్రజలు మళ్లీ పాతధనమే కోరుకుంటున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ ప్రకారం వంటగదిని తన పాత్రలు చిన్న మట్టి పాత్రలు రాగి చెంబులు వాడుతుండటం పెరుగుతోంది. ఆరోగ్య రీత్యా ప్రస్తుతం సమాజంలో వీటి వినియోగం పై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో మట్టి పాత్రలు, రాగి పాత్రలు అమ్మకాలు నానాటికీ పెరుగుతున్నాయి.

ఇప్పటివరకు అల్యూమినియం, స్టీల్, ఇతడితో పాటు వివిధ రకాల ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్, రోటి మేకర్స్ వంటి పాత్రలు వాడుతున్న ప్రజలు మట్టి పాత్ర పై మనసు పారేసుకున్నారు. ఆరోగ్యరీత్యా మట్టి పాత్రలు మంచిదని భావించి వీటితోనే వంటలు చేస్తున్నారు. మట్టితో చేసిన వివిధ రకాల పాత్రలు గిన్నెలు రకరకాల వస్తువులు విక్రయాలు జరుగుతున్నాయి. వంట చేసుకునేందుకు వివిధ ఆకారాల్లో మట్టి గిన్నెలు అందుబాటులోకి వచ్చాయి. కుక్కర్లు, ఫ్యాన్లు, నీటిని తాగడానికి గ్లాసులు, బాటిల్ లు సైతం మట్టి తో తయారు చేసినవి మార్కెట్లో సందడి చేస్తున్నాయి. పలు హోటళ్లు, రెస్టారెంట్లలో మట్టి పాత్రలోనే వంటకాలు చేస్తున్నారు. దేశి చికెన్, చికెన్ లోని వివిధ రకాల వంటల కోసం మట్టి పాత్రలోనే వినియోగిస్తున్నట్లు హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. స్వీట్ షాపుల్లో మట్టి పాత్రలోనే గతంలో పాలు, పెరుగు, నెయ్యి , చల్ల , చేసి ఎండాకాలంలో మట్టికుండలో చేసినటువంటి చల్లాను తాగితే అప్పటి పెద్ద మనుషులు పొద్దు పొద్దున్నే లేచి గంజి , సల్ల తాగి భుజాన నాగలి ఎత్తుకొని ఎద్దులను కొట్టుకొని పొలం పనులకు పోయేవారు. ప్రస్తుతం ఇప్పుడు చల్లా అనే పదాన్ని మరిచిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!