మందమర్రి, నేటిధాత్రి:-
ఉత్పత్తి ఉత్పాదకతపై ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మందమర్రి ఏరియాలోని జీఎం కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం ఉత్పత్తి ఉత్పాదకతపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జనరల్ మేనేజర్ ఏ మనోహర్ ఉన్నత అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం రాజేశ్వర్ రెడ్డి, కేకే ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్, ఆర్కే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ గోవిందరావు, డీజీఎం ఐఈడి రాజన్న, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సివిల్ డీజీఎం శ్రీనివాసులు, శాంతిఖని గ్రూప్ ఏజెంట్ విజయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.