రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ అను నిత్యం ఎదో ఒక విధంగా మొక్కలు నాటడం హరిత హారం పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్య వంతులను చేస్తున్న వరంగల్ లో కొన్ని సంవత్సరాలుగా ప్రజల సేవలకై ఏర్పడ్డ కల్పలత సూపర్ బజార్ కి ఉపాధ్యక్షులు గా బాధ్యతలు చేపట్టి అటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మన్ననలు పొందుతూ గురువారం నిర్వహించిన తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ కార్యక్రమంలో హరితహారం ఉత్తమ సేవా పథకం విప్ చేతుల మీదుగా అందుకోవటం చాలా ఆనందం గా ఉందని షఫీ తెలిపారు ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ డాక్టర్ తరుణ్ జోషి, జిల్లా కలెక్టర్ కి కృతఙ్ఞతలు తెలిపారు