దాడులను నిరసిస్తూ ఎంపీ రవిచంద్రకు సంఘీభావం తెలిపిన సేవా సమితి సభ్యులు
ఎల్లప్పుడూ రవిచంద్ర వెంటే ఉంటామని, అడుగుజాడల్లో నడుస్తామని ప్రకటించిన సభ్యులు
ఛాతీపై రవిచంద్ర టాటూ వేయించుకుని అభిమానాన్ని చాటుకున్న ఉపేందర్
ఉపేందర్ ను ఆశీర్వదించిన రవిచంద్ర
హైదరాబాద్: మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సభ్యులకు సంబంధించిన కార్యాలయాలపై ఈడీ, ఐటీ
అధికారులు దాడులకు దిగడాన్ని వద్దిరాజు రవన్న సేవా సమితి తీవ్రంగా ఖండించింది.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ, ఐటీ, సీబీఐలను ప్రయోగించి భయభ్రాంతులకు గురి చేస్తుండడం దుర్మార్గం అని సమితి వ్యాఖ్యానించింది.ఈ దాడులు జరిగిన నేపథ్యంలో సమితి సభ్యులు పాల్వంచ రాజేష్, గౌరి శెట్టి వినోద్,జిల్లపల్లి ఉపేందర్,గుమ్మడెల్లి హరీష్,మద్దెల భానుప్రతాప్,గుమ్మడెల్లి ప్రశాంత్,సాయి,అరుణ్ నాయక్,జువ్వల టింకులు ఎంపీ రవిచంద్రను కలిసి తమ సంఘీభావం ప్రకటించారు.ఇటువంటి దాడులకు తెలంగాణ సమాజం భయపడబోదంటూ బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను యువత ఎండగట్టింది.ఎల్లప్పుడూ తాము ఎంపీ వద్దిరాజు వెంటే ఉంటామని,ఆయన అడుగుజాడల్లో నడుస్తామని సుస్పష్టం చేశారు.
*ఛాతీపై రవిచంద్ర టాటూ వేయించుకుని తన అభిమానాన్ని చాటుకున్న ఉపేందర్*
ఖమ్మం జిల్లా వెంకటగిరికి చెందిన ఉపేందర్ అనే యువకుడు తన ఛాతీపై రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర టాటూ వేయించుకుని ఆయనపై తనకున్న అపారమైన అభిమానాన్ని చాటుకున్నారు. సేవా కార్యక్రమాల ద్వారా అన్ని వర్గాల ప్రజల మన్ననలు,పెద్దల ఆశీస్సులు అందుకుంటున్న రవిచంద్ర అంటే ఎంతగానో అభిమానమని,తనకు దేవుడితో సమానమని ఉపేందర్ చెప్పారు.ఈ సందర్భంగా ఉపేందర్ ను ఎంపీ వద్దిరాజు అభినందించి, ఆలింగనం చేసుకుని ఆశీర్వదించారు.